తెలుగుదేశం త‌మ్ముళ్ల‌కు పాత జ్ఞాప‌కాలు గుర్తొస్తున్నాయా..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీని బ‌లోపేతం చేసేందుకు అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు కౌంట‌ర్‌గా ఆయ‌న కూడా.. వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇలా.. గ‌త ఏడాది గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని వైసీపీ ప్రారంభించింది. అంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా.. ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లిసి వారి స‌మ‌స్య‌లు విన‌డం.. ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం.

అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను, ప‌థ‌కాల‌ను కూడా వారికి వివ‌రించాలి. దీంతో ఇది పెద్ద ఎత్తు న వైసీపీకి మేలు చేస్తుంద‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో అలెర్ట్ అయిన‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వెంట‌నే ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మం తాము కూడా చేప‌డుతున్నామంటూ.. ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ప్రాంతీయ స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌తో పెద్ద ఎత్తున వీడియో కాన్ఫ‌రెన్సులు నిర్వ‌హించారు.

ఇంటింటికీ కార్య‌క్ర‌మాన్ని వేగవంతం చేయాల‌ని చెప్పారు. అంతేకాదు.. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ప్లాన్ కూడా చేసుకున్నారు. ఎవ‌రెవ‌రు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాలో కూడా మ్యాప్ రెడీ చేసుకున్నారు. కానీ, ఈ కార్య‌క్ర‌మం ఎందుకో మ‌రుగున ప‌డింది. ఇప్పుడు ఈ చ‌ర్చ ఎందుకు వ‌చ్చిందంటే.. చేతులు కాలిని త‌ర్వాత‌.. అన్న‌ట్టుగా.. వైసీపీ నేత‌లు మ‌రో కార్య‌క్ర‌మం చేప‌ట్టి.. శుక్ర‌వారం దుమ్ము రేపారు. మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న‌న్నా.. అనే కార్య‌క్ర‌మం పెద్ద ఎత్తున హిట్ కొట్టింది.

దీంతో ఇలాంటి కార్య‌క్ర‌మం మ‌నం కూడా చేస్తే.. బాగుండేది కదా.. ఎంత సేపూ మీడియా ముందు మాట్టాడితే.. ఏం ప్ర‌యోజ‌నం.. అనే మాట వినిపించింది. ఈ క్ర‌మంలోనే గ‌తాన్ని త‌వ్వుకున్న త‌మ్ముళ్ల‌కు.. ఇప్పుడు పాత గుర్తులు జ్ఞాప‌కం వ‌చ్చాయి. మ‌రి ఇలా.. అయితే.. పార్టీ పరిస్తితి ఏంటి? అనేది చ‌ర్చ. పోనీ.. ఆ కార్య‌క్ర‌మం ఎందుకు చేప‌ట్టలేదో కూడా.. ఇప్ప‌టిక ఈక్లారిటీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.