Political News

జీవోల విష‌యంలో ర‌చ్చ‌…జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇటీవ‌ల తెర‌మీద‌కు వ‌చ్చి బ్లాంక్ జీవోల వివాదంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జీవోలు ఇకపై ఆన్ లైన్లో పెట్టకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అన్న దానికే అర్ధాన్ని మార్చేసి గోల్ మాల్ ఆర్డర్ అన్న విధంగా బ్లాంక్ జీవోలను జారీ చేస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించిన …

Read More »

ఆఫ్ఘన్లో మొదలైన అరాచకాలు

గడచిన వారం రోజులుగా ఆఫ్ఘనిస్ధాన్ దేశంలో విచిత్రమైన పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు మూడో వారంలో యావత్ దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళిపోతుందని అందరు అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా 15వ తేదీకే దేశంలో నాయకత్వం మారిపోయింది. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పదవికి రాజీనామా చేసి అధికారాన్ని తాలిబన్లకు అప్పగించేసి దేశంవదిలి పారిపోయారు. ఈయనతో పాటు కొందరు మంత్రులు, గవర్నర్లు, ముఖ్యనేతలు కూడా దేశంనుండి పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. …

Read More »

డబ్బు మూటలతో పారిపోయిన ఆప్ఘాన్ అధ్యక్షుడు..!

ఆప్ఘనిస్తాన్ ని పూర్తిగా తాలిబన్లు ఆక్రమించుకున్నారు. తాలిబన్లు ఎంటర్ కావడంతో.. ఆ దేశ అధ్యక్షుడు అఫ్రాఫ్ గని పరారయ్యాడన్నసంగతి కూడా తెలిసిందే. దేశానికి ఆపద వస్తే.. అధ్యక్షుడు అలా పారిపోయాడనే వార్త ఇప్పటికే ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. అంతకుమించి ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. అష్రాఫ్ గని పోతూ పోతూ.. డబ్బల మూటలు కట్టుకొని మరీ వెళ్లిపోవడం గమనార్హం. తాజా సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని, నాలగు కార్ల …

Read More »

ఆప్ఘాన్ కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ నాయకుడు..?

ఆప్ఘనిస్తాన్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. దేశాధ్యక్షుడు పారిపోయాడు. దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దీంతో… దేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే రాజధాని కాబూల్‌ను ఆక్రమించడంతో ప్రభుత్వం లొంగిపోయింది. అలాగే శాంతియుతంగా అధికార బదిలీ వుంటుందని ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే అధ్యక్షుడిగా ఆశ్రఫ్‌ ఘనీ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త దేశాధ్యక్షుడు ఎవరన్న దానిపై ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో దేశ నూతన …

Read More »

తాలిబన్ల దెబ్బ అంత గట్టిగా పడిందా ?

ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబన్ల అరాచకాలను విదేశాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. రాజధాని కాబూల్ నుండి తమ రాయబార కార్యాలయాల్లోని ఉన్నతాధికారులను, ఉద్యోగులందరినీ తిరిగి వచ్చేయాలంటు ఆయా దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. అన్నీ దేశాలకన్నా ముందుగా అమెరికా, ఇండియాలు తమ సిబ్బందిని వెనక్కు పిలిపించేస్తున్నాయి. అమెరికా అయితే తమ మిలిట్రీని దగ్గరుండి మరీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వారందరినీ విమానాలెక్కించేస్తోంది. విమానాల్లో ప్రయాణించటానికి కుదరని ఉద్యోగుల కోసం ప్రత్యేకించి హెలికాప్టర్లలో సమీప …

Read More »

వెంకయ్యపై కేంద్రమంత్రుల ఒత్తిడి ?

రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపిలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుపై ఏడుగురు కేంద్రమంత్రులు బాగా ఒత్తిడి తెస్తున్నట్లే ఉంది చూస్తుంటే. మొన్నటి 11వ తేదీన రాజ్యసభలో ప్రతిపక్షాలకు చెందిన కొందరు ఎంపిలు పోడియం దగ్గర ఉద్యోగులు కూర్చునే బెంచీల మీదకు ఎక్కి అల్లరి చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగానే మార్షల్స్ కు …

Read More »

ఆప్ఘాన్ అధ్యక్షుడి పరారీ..దేశం తాలిబన్ల స్వాధీనం..!

తాలిబనన్లు.. ఆప్ఘనిస్తాన్ ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఆప్ఘాన్ రాజధాని కాబూల్ లోకి తాలిబన్లు ప్రవేశించారు. ఈ క్రమంలో.. దేశ ప్రజలకు అండగా నిలవాల్సిన ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని.. అక్కడి నుంచి పరారు కావడం గమనార్హం. అష్రఫ్ ఘని తజకిస్తాన్ పరారయ్యాడని.. అక్కడి అధికారులు స్వయంగా చెప్పడం గమనార్హం. అష్రఫ్ ఘనీ ఆచూకీని ఈ బృందం తనిఖీ చేస్తోందని తాలిబాన్ ప్రతినిధి తెలిపారు. సెప్టెంబర్ 11 న …

Read More »

ఏపీలో ముంద‌స్తు.. ఢీల్లీ వ‌ర్గాల చ‌ర్చ‌లు…!

రాష్ట్ర ప్ర‌భుత్వ సార‌థి.. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప‌రిస్థితి ఇబ్బందిగా మారిందా? ఆయ‌న కేంద్రంగా.. ఢిల్లీలో రాజ‌కీయాలు మారుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం వివిధ కేసుల విష‌యంలో జ‌గ‌న్ బెయిల్ పొంది.. సీఎంగా గెలిచి.. పాల‌న సాగిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. జాతీయ స్తాయిలో మారుతున్న ప‌రిణామాలు.. జ‌గ‌న్‌ను ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా.. మ‌రో ఏడాదిలోనే రాష్ట్రంలో ముందస్తుకు …

Read More »

కాంగ్రెస్ వ్యూహానికి సురేఖ బ‌ల‌వుతున్నారా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో.. చెప్ప‌డం క‌ష్టం. నాయ‌కుల త‌ల‌రాత‌లు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌లేం. అయితే, నాయ‌కులు ఎవ‌రైనా.. ఆచితూచి అడుగులు వేయాల్సిందే. ఈ విష‌యంలో ఎలాంటి పొర‌పాట్లు చేసినా.. నాయ‌కుల‌కు తీర‌ని మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌డం.. కోలుకోలేని దెబ్బ‌లు త‌గ‌ల‌డం కూడా కామ‌నే! ఇప్పుడు ఈ విష‌యాన్ని ఎందుకు చ‌ర్చించాల్సి వ‌స్తోందంటే.. తెలంగాణ‌లో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో కీల‌క నేత విష‌యం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీయ‌బ‌ట్టే! …

Read More »

పవన్ నిర్ణయంపై అయోమయం ?

రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెంచేస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడ్రస్ ఎక్కడా కనబడలేదు. ఉపఎన్నికలో తన స్టాండ్ ఏమిటో కూడా ఇంతవరకు జనసేన అధికారికంగా ప్రకటించలేదు. ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలీదు కానీ ఈ రోజే రేపో నోటిఫికేషన్ వచ్చేస్తోందన్నంతగా నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగిపోతోంది. అన్నీ పార్టీలు హుజూరాబాద్ కేంద్రంగా ఏదో కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఇంతటి కీలక సమయంలో జనసేన పార్టీ ఉనికి …

Read More »

మోడీ వ్యూహం.. మ‌రో పాతికేళ్లు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఈరోజు చేసిన పంద్రాగ‌స్టు ప్ర‌సంగం ఆద్యంతం… వ్యూహాత్మ‌కంగానే సాగిందని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధాని ప్ర‌సంగం యావ‌త్తు.. మ‌రో పాతికేళ్ల పాటు ప్ర‌భుత్వం కొన‌సాగిం చాల‌నే త‌న ల‌క్ష్యాన్ని చాటుకున్న‌ట్టుగా ఉంద‌ని భావిస్తున్నారు. ఆద్యంతం.. త‌న ల‌క్ష్యాన్ని ప్ర‌స్ఫుటంగా వివ‌రించార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 75వ …

Read More »

బీజేపీ, కాంగ్రెస్ పోటీ దేనితోనే తెలుసా ?

వచ్చే ఎన్నికల్లో ఇరగదీసేస్తామని ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ నేతలు భీబత్సమైన ప్రకటనలు చేసేస్తున్నారు. విచిత్రమేమిటంటే 2024లో అధికారంలోకి రావాల్సిందే అని కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధి నేతలతో గట్టిగా చెప్పారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే రెండుపార్టీలకూ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులు కూడా లేరన్నది వాస్తవం. నిజానికి రెండు …

Read More »