కోవిడ్ టైంలో లైమ్లైట్లోకి వచ్చిన ఆయన ఇప్పుడు చట్టసభలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్కు కాళ్లు మొక్కడం నుంచి హరీశ్ రావుకు అహర్నిశలూ భజన చేయడం వరకు ఎక్కడా తగ్గడం లేదు. అయితే.. ఈ ప్రయత్నాలలో ఆయన మిగతా టీఆర్ఎస్ నేతలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని కొందరు ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తోంది. తాజాగా ఆయన కొత్తగూడెం నియోజకవర్గం గురించి మాట్లాడిన మాటలపై వనమా నాగేశ్వరరావు వర్గం నుంచి …
Read More »అప్పుడు లక్ష్మీపార్వతి.. ఇప్పుడు సజ్జల
ఎమ్మెల్సీ ఎన్నికలతో మారిన ఏపీ రాజకీయ వాతావరణానికి తగ్గట్లు వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు విపక్షాలపై విరుచుకుపడే వైసీపీ.. ఇప్పుడు తమలో తాము అనుకునే పరిస్థితిలోకి వెళ్లిపోయింది. నష్ట నివారణ చర్యల విషయంలో సీఎం జగన్ మౌనం ఒకపక్క.. ఆయన కార్యకలాపాల్ని చక్కదిద్దే ఆయన సలహాదారు సజ్జల కొత్త తరహా దాడి ఎక్కువైంది. దీంతో.. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ …
Read More »నందిగం సురేశ్ ఫ్యూచర్ ఏంటి?
బాపట్ల ఎంపీ నందిగాం సురేశ్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. భారీ మెజారిటీతో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు 2024 ఎన్నికల నాటికి డీలా పడుతుండడంతో వ్యూహాలు మారుస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా టీడీపీ బలం పుంజుకుంటున్న సెంట్రల్ ఆంధ్రలో పెద్దఎత్తున మార్పులకు తెరతీస్తున్నట్లు చెప్తున్నారు. 2019లో పోటీ చేసిన ఎంపీలలో చాలామంది ఈసారి పార్లమెంటుకు పోటీచేయకపోవచ్చని చెప్తున్నారు. ఆ లిస్టులో వినిపిస్తున్న పేర్లలో …
Read More »రాహుల్ కు మరో షాక్..
చట్టంతో వచ్చిన చిక్కేమంటే.. ఒక్కోసారి కోరలు తీసిన పులిలా ఉంటుంది. మరోసారి కోరలు లేని అదే పులి రంకెలు వేస్తూ.. నానా హడావుడి చేస్తుంది. అయితే.. ఇదంతా ఆడించే వాడిని బట్టి ఉంటుందే తప్పించి.. చట్టానికి కోరలు లేవని ఎలా చెబుతారు? అది అపోహ మాత్రమే అంటూ వ్యాఖ్యానించేవారు లేకపోలేదు. చట్ట ప్రకారం చేయాల్సినవి చాలానే ఉన్నా.. అత్యుత్తమ స్థానాల్లో ఉండే వారి కోసం అవెప్పుడూ చుట్టాల మాదిరే పని …
Read More »ముగ్గురు కాదు అయిదుగురు.. జగన్ ఉద్వాసన పలకున్న మంత్రులు ఎవరు?
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఏపీ సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైనట్లుగా సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆయన రాజ్భవన్లో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్తో భేటీ కావడంతో వైసీపీ మంత్రులలో టెన్షన్ మొదలైంది. అదేసమయంలో మంత్రి పదవులను ఆశిస్తున్నవారిలో ఆశలు చిగురిస్తన్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండడంతో ఈలోగా అమాత్యులు అనిపించుకోవాలని చాలామంది ఆశపడుతున్నారు. అయితే… ప్రస్తుత కేబినెట్లో ఎంతమందిని జగన్ తప్పిస్తారు.. కొత్తగా …
Read More »స్పీకర్ తమ్మినేని ఫోర్జరీ చేశారా.. !
కూన రవికుమార్ ..టీడీపీ హార్డ్ కోర్ నేత. జగన్ పేరు చెప్పినా, తన ప్రత్యర్థి అయిన స్పీకర్ తమ్మనేని సీతారాం పేరు చెప్పినా ఆయన ఒంటి కాలి మీద లేస్తుంటారు. వైసీపీ ప్రభుత్వం ఆయన మీద కేసులు కూడా పెట్టింది. అయినా కూన ఒక్క అడుగు కూడా వెనుకంజ వేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వీరవిధేయుడు, వీర భక్తుడైన రవికుమార్… వైసీపీ ప్రభుత్వంపై రోజు వారీ ఆరోపణలు చేస్తుంటారు. తాజాగా …
Read More »చూశారా.. వైసీపీ కోసం వాళ్లెవరూ రాలేదు!
ఇప్పటి వరకు ఏ సామాజిక వర్గం అయితే.. జగన్ను మోసిందో.. ఇప్పటి వరకు ఏ సామాజిక వర్గం అయితే .. జగన్ సీఎం కావాలని వెయ్యికళ్లతో ఎదురు చూసిందో.. ఆ సామాజిక వర్గం కిక్కురుమనలేదు. నిజానికి 2019 ఎన్నికలకు ముందు .. జగన్ కోసం.. జగన్చేత.. జగన్ కొరకు.. అని నడిచిన రెడ్డి సామాజిక వర్గం.. ఆస్తులు అమ్ముకుని కూడా.. ఆయన ను గెలిపించేందుకు కృషి చేసింది. అనేక రూపాల్లో …
Read More »కమాన్ సీబీఐ అంటున్న లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర హాఫ్ సెంచరీ కొట్టింది. యాభై రోజుల తర్వాత కూడా లోకేష్ అదే ఊపులో నడుస్తుంటే లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఆయన వెంట నడుస్తున్నారు. పీలేరు పాదయాత్ర సందర్భంగా లోకేష్ చేసిన భూకబ్జా ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. దీనితో లోకేష్ మరోమారి దీన్ని ప్రస్తావించారు. పీలేరు భూఆక్రమణలపై సీబీఐ లేదా సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని నేరుగా …
Read More »షర్మిలకు ఏమైంది?
తెలంగాణాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్ధితి బాగా అయోమయం అయిపోతోంది. కొద్దిరోజులుగా షర్మిల ఉనికి ఎక్కడా పెద్దగా కనబడటలేదు, వినబడటంలేదు. టీఎస్ పీఎస్సీ ప్రశ్రపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్రమంతా అట్టుడికిపోతుంటే షర్మిల మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అంతకుముందు పాదయాత్రంటు నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. నాలుగురోజులు నానా హడావుడి చేయటం తర్వాత కొద్దిరోజులు చప్పుడు చేయకుండా కూర్చోవటం అలవాటైపోయినట్లుంది. ఉద్యోగాలు భర్తీ చేయటంలేదని, నిరుద్యోగులు ఆత్మహత్యలు …
Read More »సోమిరెడ్డి టెన్షన్
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటారు. టీడీపీలో కొందరి పరిస్థితి కూడా అలాగే ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని విశ్వసిస్తున్న నేతలే తమ పరిస్థితేమిటోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు. కొన్ని జిల్లాలో ఈ పరిస్థితి నాయకుల్లో భయానికి కూడా కారణమవుతోంది. సింహపురి మొత్తం టీడీపీ పరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.. ఇప్పుడు వైసీపీకి దూరం జరుగుతున్న ఆనం రామానారాయణ రెడ్డి, కోటంరెడ్డి రేపో మాపో పసుపు కండువా కప్పుకోవడం ఖాయమని …
Read More »రికమండ్ చేయరూ ప్లీజ్
రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ డౌన్ అయిపోతోంది. టీడీపి పట్ల జనంలో నమ్మకం పెరుగుతోంది. టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు అన్ని దారులు టీడీపీ వైపే చూపిస్తున్నాయి. వైసీపీలోని కొందరు నేతలు టీడీపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. వారికి మించి.. కాంగ్రెస్ నుంచి వలసలకు చాలా మంది సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ మునిగింది. వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయి కోలుకోలేని దెబ్బతిన్నది. ఆ …
Read More »కటౌట్ కు కాపలాగా పోలీసులు
ప్రజాజీవితంలో ఉండి.. తమ జీవితాన్ని ప్రజల కోసం ధారపోసే నేతల వైభోగం ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయాన్ని చెప్పేందుకు తాజా ఉదంతానికి మించిన ఉదాహరణ మరేదీ ఉండదని చెప్పాలి. గత ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకొని.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ యాదవ్.. తన తీరుతో తరచూ వార్తల్లో నిలిచేవారు. ఆ మధ్యన జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పదవిని పోగొట్టుకున్నఆయన.. ప్రస్తుతం మాజీ మంత్రిగా.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates