Political News

వాళ్ల‌పై బాబు క‌న్నేశారా?

రెండు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయ అనుభ‌వం.. ఒక‌టికి రెండు సార్లు అధికారాన్ని చేప‌ట్టిన సామ‌ర్థ్యం మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సొంతం. కానీ గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆయ‌న నిల‌బ‌డ‌లేక‌పోయారు. ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. ఒక‌ప్పుడు వెలుగు వెలిగిన తెలుగు దేశం పార్టీ ఆ త‌ర్వాత ఢీలా ప‌డిపోయింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి మునుప‌టి వైభ‌వాన్ని క‌ట్ట‌బెట్టేందుకు బాబు ఇప్ప‌టి నుంచే సిద్ధ‌మ‌వుతున్నార‌ని …

Read More »

చిన్నమ్మకు ఎదురు దెబ్బ..100కోట్ల ఆస్తులు జప్తు..!

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి, అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చిన్నమ్మకు చెందిన దాదాపు రూ.100కోట్ల ఆస్తులను బినామీ చట్టం కింద ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది. శ‌శిక‌ళ‌కు చెందిన ఆస్తుల‌ను ఆదాయ ప‌న్ను శాఖ బుధ‌వారం బినామీ లావాదేవీల నిషేధిత చ‌ట్టం కింద‌ అటాచ్ చేసింది. చెన్నై శివార్ల‌లోని ప‌య్య‌నుర్ గ్రామంలోని ఆస్తుల‌ను ఐటీ అధికారులు అటాచ్ చేశారు. …

Read More »

మంత్రులుగా మోస్ట్ వాటెండ్ ఉగ్రవాదులు

తాజాగా ఏర్పాటైన ఆఫ్ఘనిస్ధాన్ మంత్రివర్గాన్ని చూసి యావత్ ప్రపంచం భయపడిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే మంత్రులుగా నియమితులైన 33 మందిలో 14 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులే. వివిధ దేశాల్లో అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడి, వందలాది మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిలో 14 మంది ఇప్పుడు ఆప్ఘన్ మంత్రివర్గంలో మంత్రులు గా చలామణి అవబోతున్నారు. అంటే ఆప్ఘన్లో తాలిబన్ ప్రభుత్వాన్ని ఏ దేశమైనా గుర్తేస్తే అలా …

Read More »

ఏపీ మంత్రుల్లో వీరి రూటు స‌ప‌రేటు!

YS Jagan Mohan Reddy

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రివ‌ర్గంలో ఉన్న కొంద‌రు చేస్తున్న వ్య‌వ‌హారం.. ప్ర‌బుత్వానికి త‌ల‌నొప్పి గా మారింది. వీరంతా సీనియ‌ర్లు కావ‌డం.. చేస్తున్న ప‌నులు విమ‌ర్శ‌ల‌కు దారితీయ‌డం.. తాజాగా మ‌రోసారి మంత్రుల‌పై చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌స్తుతం రాష్ట్రం అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంది. క‌రోనా త‌ర్వాత‌.. ఆర్థిక ప‌రిస్థితి కూడా భారంగా మారింది. మ‌రోవైపు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డంలో ఆల‌స్యం వంటివి ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ స‌మ‌యం …

Read More »

చ‌వితి వేడుక‌ల‌కు హైకోర్టు ఓకే.. కానీ…!

రాష్ట్రంలో ఘ‌నంగా నిర్వ‌హించుకునే వినాయక చవితి వేడుకల విషయంలో ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మండపాలు కట్టినా, గణపతి విగ్రహాలు పెట్టినా, నిమజ్జనం చేసినా కరోనా ప్రబలుతుంద‌ని పేర్కొంటూ.. ప్ర‌భుత్వం.. ఈ ఏడాది కూడా వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను బ‌హిరంగంగా నిర్వ‌హించుకునే అంశంపై నిషేధం విధించింది. వాస్తవానికి తెలంగాణతో పోలిస్తే ఏపీలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహం తరహాలో ఒకేచోట …

Read More »

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిపై గవర్నర్ అసంతృప్తి..!

కీలకమైన హుజురాబాద్‌ ఉప ఎన్నికల హీట్ నడుస్తున్న సమయంలో.. కాంగ్రెస్ నుంచి అధికారిక టీఆర్ఎస్ కి జంప్ చేసిన నేత కౌశిక్ రెడ్డి. టీఆర్ఎస్ నుంచి హుజురాబాద్ అభ్యర్థిగా ఎంపిక అవుతాననే నమ్మకంతో ఆయన ఆ పార్టీలోకి వెళ్లారు. కానీ.. ఆ ఛాన్స్ ఇవ్వకుండా.. ఆ వెంటనే కొద్దిరోజుల్లోనే గవర్నర్‌ కోటాలో కౌశిక్‌ రెడ్డిని శాసన మండలికి పంపనున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్‌.. దీనిపై ఆఘమేఘాల మీద నిర్ణయం తీసుకున్న …

Read More »

ఆమెను దూరం పెట్టి.. ఆయ‌న‌ను ద‌గ్గ‌రికి తీసి!

క‌ర్నూలులో భూమా కుటుంబానికి ఎంతో పేరుంది. రాజ‌కీయంగా చూస్తే నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆళ్ల‌గ‌డ్డ కుటుంబానికి బ‌ల‌మైన ప‌ట్టు ఉంది. కానీ ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే టీడీపీ భూమా కుటుంబాన్ని దూరం పెట్టే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌ను మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ ఉంది. అఖిల ప్రియ‌ను దూరం పెట్టి ఏవీ సుబ్బారెడ్డిని ద‌గ్గ‌రికి తీసేందుకు బాబు …

Read More »

దిల్లీ ప‌ర్య‌ట‌న వెన‌క కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌

ఏ ప్ర‌యోజ‌నం లేనిదే రాజ‌కీయ నాయ‌కులు ఏం చేయ‌ర‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌గ్గ‌ర నుంచి అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం వ‌ర‌కూ ప్ర‌తి సంద‌ర్భంలోనూ త‌మ ప్ర‌యోజ‌నాల కోస‌మే నాయ‌కులు వ్యూహాలు ర‌చిస్తారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీ ప‌ర్య‌ట‌న వెన‌క కూడా ఇలాంటి ప్ర‌ణాళికే దాగి ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో అక్క‌డ గెలుపు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న ఈట‌ల రాజేంద‌ర్‌ను …

Read More »

కనగరాజ్ నియామకంపై కేసు

జస్టిస్ కనగరాజ్ నియామకంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 78 ఏళ్ళ వయసున్న జస్టిస్ కనగరాజ్ ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసు ఫిర్యాదుల అథారిటి ఛైర్మన్ గా నియమించింది. అంటే నియామకం జరిగి కూడా చాలా కాలమైంది. మరి పిటీషనర్ ఇంతకాలం ఏమి చేస్తున్నారో అర్ధం కావటంలేదు. ఎప్పుడో నియామకం జరిగితే ఇపుడు పిటీషన్ వేయటంలో అర్ధమేంటో పిటీషనరే చెప్పాలి. జస్టిస్ కనగరాజ్ ను నిబంధనలను విరుద్ధంగా ప్రభుత్వం …

Read More »

ఏపీ చ‌వితి వివాదంపై ప‌వ‌న్ ఘాటు స్పంద‌న‌

ఈ మ‌ధ్య త‌ర‌చుగా ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిల‌వ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారుకు అల‌వాటుగా మారిపోయింది. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకుంటున్న చాలా నిర్ణ‌యాలు వివాదాస్ప‌దం అవుతున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో వినాయ‌క చ‌వితి సంబ‌రాలకు అనుమ‌తి నిరాక‌రిస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు ఆ పండుగ‌ను సెంటిమెంటుగా భావించే హిందువుల‌కు రుచించ‌డం లేదు. క‌రోనా ప్ర‌భావం చాలా వ‌ర‌కు త‌గ్గిన నేప‌థ్యంలో కొన్ని ప‌రిమితుల మ‌ధ్య పండుగ జ‌రుపుకుంటామ‌ని జ‌నాలు …

Read More »

రేవంత్ టార్గెట్ జిల్లాలు ఏమిటో తెలుసా ?

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 72 నియోజకవర్గాల్లో గెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. తాను చెప్పినన్ని సీట్లు వస్తాయో రావో ఇప్పుడే చెప్పలేం కానీ రేవంత్ అయితే పార్టీకి మునుపటి జోష్ తేవడానికి చాలా కష్టపడుతున్నారు. పార్టీ నేతల్లో ముఖ్యంగా యువతలో ఉత్సాహం నింపడానికి రేవంత్ చాలా గట్టిగానే ట్రై చేస్తున్నారు. పార్టీలో గతంలో ఎప్పుడు లేనంతగా ఇపుడు యువనేతలనే రేవంత్ …

Read More »

రేవంత్‌కు మేలు చేసిన కేసీఆర్‌!

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థుల్లో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఒక‌రు. ఎప్ప‌టి నుంచో త‌న ప‌దునైన మాట‌ల‌తో కేసీఆర్‌పై విరుచుకుప‌డుతున్న రేవంత్‌.. ఇక తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత దూకుడు పెంచారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై త‌న మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. స‌భ‌లు ర్యాలీల పేరుతో కేసీఆర్‌ను స‌వాలు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు రేవంత్‌కు కేసీఆర్ మేలు చేశారంటే న‌మ్ముతారా? కానీ ఉద్దేశ‌పూర్వ‌కంగా …

Read More »