విప‌క్షాలు.. తోడేళ్ల మంద‌: స‌జ్జ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, వైసీపీ ముఖ్య నాయకుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ప్ర‌తిప‌క్షాల‌ను తోడేళ్ల మంద‌తో పోల్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విప‌క్షాలు.. తోడేళ్ల మంద‌లా విరుచుకుప డుతున్నాయ‌ని నిప్పులు చెరిగారు. జగన్ పథకాలు చూసి వారు కుళ్లు కుంటున్నార‌ని అన్నారు. ఏడాదిలో ఎన్నికలు జరుగనుండగా ప్రతిపక్షాలు తోడేళ్ల మందలాగ దాడి చేస్తున్నారని మండిపడ్డారు.

తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అప్రమత్తంగా వుండాలని వైసీపీ శ్రేణులకు స‌జ్జ‌ల‌ పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో వైసీపీ అధినేత జ‌గ‌న్ చెప్పిన హామీలను 98.2 శాతం అమలు చేసిన ధీశాలిగా అభివ‌ర్ణించారు. టీడీపీ అధినేత‌ చంద్రబాబు ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హౌస్ రెంట్ అలవెన్స్ చంద్రబాబు తీసుకుంటున్నారని, కానీ.. రెంట్ క‌ట్ట‌డం లేద‌ని ఆయ‌నే చెప్పార‌ని అన్నారు.

ప్ర‌జ‌ధ‌నాన్ని రెంట్ రూపంలో తీసుకుంటున్న చంద్ర‌బాబు ఆ సొమ్మును త‌న జేబులో వేసుకుంటున్నార‌ని స‌జ్జ‌ల వ్యాఖ్యానిం చారు. లింగమనేని రమేష్ తన గెస్ట్ హౌస్ ప్రభుత్వానికి రాసి ఇచ్చానని చెబుతున్నారని… అది ప్రభుత్వ గెస్ట్ హౌస్ అయితే చంద్రబాబు దానిని ఎలా వాడుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. ఒక‌వేళ త‌నే అక్క‌డ నివాసం ఉండాల‌ని అనుకుంటే.. ప్రభుత్వ అనుమతి ఎందుకు తీసుకోలేద‌ని అని నిలదీశారు.

అమ‌రావ‌తి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కలిసి అడ్డుకుంటున్నారని స‌జ్జ‌ల‌ మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ దందా చేసేవారు దీనిని సుప్రీంకోర్టు వరకు తీసుకవెళ్లారన్నారు. చంద్రబాబు చెప్తే పవన్ కళ్యాణ్ ఏ పాత్ర అయినా పోషిస్తున్నారని.. చివరకు కమ్యూనిస్టులు కూడా చంద్రబాబుకు సపోర్టు చేస్తున్నారని సజ్జల వ్యాఖ్యలు చేశారు.