టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేతనని గొప్పగా చెప్పుకొనే జగన్‌కు ఇప్పుడు తన తల్లి-చెల్లి ఎందుకు దూరమయ్యారో చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. జగన్ అరాచకాలు చూసి.. విసిగిపోయి వారంతా ఎప్పుడో జగన్‌ను వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆస్తి వివాదాల్లో ఏకంగా.. తల్లిని, చెల్లిని కూడా జగన్ దూషించారని.. వైసీపీ నాయకులే తనతో చెప్పారని వ్యాఖ్యానించారు.
యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అప్పర్ భద్ర ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నించని సీఎం జగన్… రాయలసీమకు శాపమని లోకేష్ ధ్వజమెత్తారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 102వ రోజు నంద్యాల నియోజకవర్గంలో కొనసాగింది. నియోజకవర్గంలోని ప్రజలతో మాట్లాడు తూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నంద్యాలలోని టీడీపీ శ్రేణులు లోకేశ్‌కు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న అక్రమాలను ఎండగట్టారు. ప్రజలకు ఏం చేశారని.. వైసీపీ నేతలకు ఓట్లే యాలని నిలదీశారు. ఇసక దోపిడీ.. మట్టి దోపిడీ.. మద్యం పేరుతో నిధుల దోపిడీ చేస్తున్న వైసీపీ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. జగన్ అరాచకాలు చూసి తల్లి, చెల్లి సైతం దూరంగా వెళ్లారని, అందుకే ఒంటరయ్యారని లోకేష్ ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం హయాంలోనే నంద్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నఆయన… ఈ నాలుగేళ్ల కాలంలో 10 శాతం పనులు కూడా చేయలేదని విమర్శించారు. సండే ఎమ్మెల్యే పాలనలో నంద్యాలలో నేరాలు బాగా పెరిగాయని.. కానిస్టేబుల్ సురేంద్రను వైసీపీ నేతలు కిరాతకంగా చంపారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సురేంద్రను చంపినవారిని జైలుకు పంపిస్తామని తెలిపారు. అలాగే రైతులకు చెందిన 3,500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెడతారా? ఎమ్మెల్యే, ఎంపీ భూములు మాత్రం తీసుకోరా? అని లోకేశ్ ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates