సీఎం జగన్ రాజకీయ వ్యూహాల గురించి ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ ఏం చేసేందుకైనా వెనుకాడరంటూ దుయ్యబడుతుంటారు. అన్నదమ్ములు, బావాబామ్మర్దులు, బాబాయ్ అబ్బాయ్..ఇలా ఎవరి మధ్య అయినా చిచ్చు పెట్టేందుకు జగన్ అసలు సందేహించరంటూ వారు విమర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే నెల్లూరులో రెండు కుటుంబాల మధ్య జగన్ చిచ్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది.
ఉదయగిరిలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి చంద్రశేఖరరెడ్డిని జగన్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, చంద్ర శేఖర్ రెడ్డిపై పోటీకి జగన్…చంద్రశేఖర్ సోదరుడు మేకపాటి రాజగోపాల్‌రెడ్డిపని దించబోతున్నారు. దీంతో, వీరిద్దరి మధ్య చిచ్చు రేగింది. దీంతో, అన్నదమ్ముల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. మరోవైపు, మాజీ మంత్రి అనిల్ వర్సెస్ రూప్ కుమార్ అన్న రీతలో మాటల యుద్ధం జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ వార్ నడుస్తోంది. అనిల్ కు చెక్ పెట్టేందుకు పార్టీ కార్యాలయం ప్రారంభించిన రూప్ కుమార్…అనిల్ వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నారు.
అయితే, రూప్ కుమార్ గురించి జగన్ కు అనిల్ కంప్లయింట్ చేయగా…పోయి పనిచూసుకోబ్బా అని జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో అనిల్ షాకయ్యారట. మంత్రి పదవి ఉన్నప్పుడు జగన్ పై ఈగ వాలనివ్వని అనిల్ ఇప్పుడు తనకి ఈ స్థితి రావడంతో దిగాలుగా ఉన్నారట. రూప్ కుమార్ ను సస్పెండ్ చేయాలని అనిల్ కోరినా జగన్ పట్టించుకోలేదటజ తనకు అండగా నిలబడతాడని భావించిన జగన్ కూడా పట్టించుకోకపోవడంతో అనిల్ కుమార్ తీవ్ర అసహనానికి గురవుతున్నారట. మరోవైపు, తన బావమరిది బ్రదర్ అనిల్ కుమార్ కు కూడా జగన్ చెక్ పెట్టారట. గతంలో జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన బ్రదర్ అనిల్…ఇపుడు సైలెంట్ అయ్యారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates