టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా కీలక నిర్ణయం తీసుకుని.. వెంటనే అమలు చేసేశారు. పార్టీలో అసంతృప్తులను తగ్గించడంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నవారిని ఆయన తేల్చేశారు. ఈ క్రమంలో కొందరికి టికెట్లు.. మరికొందరికి పార్టీలో కీలక పదవులు ప్రకటించారు. వెంటనే ఈ నియామకాలు.. ఆదేశాలు అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పారు. నియమితులైనవారు.. టికెట్ దక్కిన వారు తక్షణం ప్రజల్లోకి వెళ్లాలని.. వారి సమస్యలు తెలుసుకుని.. పార్టీ మినీ మేనిఫెస్టోను వివరించాలని చంద్రబాబు ఆదేశించారు.
టికెట్లు వీరికి..
- నెల్లూరు సిటీ అసెంబ్లీ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి నారాయణను నియమించారు.
- కర్నూలు పార్లమెంట్ ఇంచార్జ్‌గా బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడును నియమించారు.
- నంద్యాల పార్లమెంట్ స్థానం ఇంచార్జ్‌గా మల్లెల రాజశేఖర్ గౌడ్ ను నియమించారు.
పదవులు వీరికి
- ప్రస్తుతం నెల్లూరు అసెంబ్లీ ఇన్‌చార్జిగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామించారు. పార్టీ అదికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు.
- ఎస్.కోట టికెట్ ఆశిస్తున్న గొంప కృష్ణకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిని అప్పగించారు.
- దివంగత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కుమారుడు బోస్‌కు కార్య నిర్వాహక కార్యదర్శి పదవిని అప్పగించారు.
- కర్నూలు పార్లమెంట్ అధ్యక్షునిగా ఉన్న సోమిశెట్టిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.