బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర దాటుతోంది. ఆయన హయాంలో కీలకమైన రెండు ఉప ఎన్నికలు వచ్చాయి. ఒకటి తిరుపతి పార్లమెంటు, రెండు బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక వచ్చింది. అయితే..ఆ రెండు చోట్లా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీనికి తోడు నాయకుల మధ్య కూడా కలివిడి లేదు. దీనికి సంబంధించి సోము చేస్తున్న ప్రయత్నాలు కూడా కనిపించడం లేదు. దీంతో కేంద్రంలోని …
Read More »వలంటీర్ల రాజ్యంలో వణుకుతున్న నేతలు!
వైసీపీలో రాజకీయాలు ఇప్పుడున్నట్టుగా.. వచ్చే ఎన్నికల సమయానికి ఉండవనేది ప్రతి ఒక్కరి మాట. ఇది పార్టీలోనూ హల్చల్ చేస్తోంది. ఎవరిని కదిపినా.. వచ్చే ఎన్నికల నాటికి.. ఏం జరుగుతోందో ? అనే చర్చ చేస్తున్నారు. కొందరు ఏకంగా మాకు టికెట్ కూడా దక్కుతుందని అనుకోవడం లేదు.. అనేస్తున్నారు. దీనికి వారేదో తప్పులు చేస్తున్నారని కాదు.. వారిపై వ్యతిరేకత వస్తుందని కూడా కాదు. వైసీపీ అధిష్టానం దృష్టి వేరేగా ఉండడమే..! దీంతో …
Read More »కౌశిక్ కొంప ముంచాడా?
టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో అనూహ్యంగా పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఈటల రాజేందర్ గెలవకూడదని కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా.. ప్రజలు మాత్రం టీఆర్ఎస్‌కు దిమ్మ తిరిగే తీర్పునిచ్చారు. తమ వాడిగా ఈటల రాజేందర్‌ను గుండెల్లో పెట్టుకుని ఓట్లతో ఆశీర్వదించారు. ఎన్నికల్లో గెలవడం.. ఓడడం సాధారణమేనని కేసీఆర్ బయటకు చెప్తున్నప్పటికీ ఈ ఓటమికి దారితీసిన పరిణామాలపై ఆయన దృష్టి …
Read More »కేసీఆర్ సాఫ్ట్ కాలేదు.. లోపల ఒరిజినల్ అలానే ఉంది: కేటీఆర్
గడిచిన రెండు రోజులుగా వరుస పెట్టి ప్రెస్ మీట్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద ఎంతలా విరుచుకుపడుతున్నారో తెలిసిందే. బండి సంజయ్ తో పాటు.. కేంద్రం మీదా ఆయన మాటల తూటాల్ని విసురుతున్నారు. అన్నింటికి మించి సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ లో.. ‘ఫాంహౌస్ కు వస్తే ఆరుముక్కలవుతావు నా కొడకా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య …
Read More »ఒడిశా సీఎంను కలిసిన జగన్
ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రుల మధ్య కొన్ని సమస్యలకు అవగాహన కుదిరింది. తాజాగా ఏపీ సీఎం జగన్.. ఒడిశాకు వెళ్లి.. అక్కడ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్యలపై వారు చర్చించారు. ఈ క్రమంలో కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి రెండు రాష్ట్రాలకు దోహదపడతాయని ఇద్దరు ముఖ్యమంత్రులు పేర్కొనడం గమనార్హం. మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె …
Read More »డెడ్‌లైన్లు పెట్టడమేనా పవన్ పని?
ఉవ్వెత్తున లేసే కెరటంలా ఆయన దూసుకొస్తారు.. ఆ తర్వాత ఒక్కసారిగా కిందపడే అలలా సైలెంట్ అయిపోతారు.. ఉద్యమం పేరుతో ప్రజల్లోకి వస్తారు.. డెడ్‌లైన్లు పెట్టేసి సైడ్ అయిపోతారు.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఆవేశం రాగానే ప్రజల్లోకి వచ్చే ఆయన.. అది తగ్గగానే చల్లబడిపోతారనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. …
Read More »హుజూరాబాద్ దెబ్బకు ప్రజల్లోకి కేసీఆర్
ఒక్కోసారి కొన్ని సంఘటనలు రాజకీయ నాయకుల కళ్లు తెరిపిస్తాయి. తమదే పెత్తనం అని భావించే నేతలు కూడా కొన్నిసార్లు కిందికి దిగిరావాల్సి ఉంటుంది. ఊహించని ఓటములు ఎదురైనప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నపుడు అన్నింటినీ పక్కనపెట్టి ప్రజల్లోకి వెళ్లాల్లి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి దెబ్బకు కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చారని.. ఇక ఇప్పుడు ప్రజల్లోకి …
Read More »కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్.. హాట్ కామెంట్స్
తెలంగాణలో రెండు రోజుల కిందట ప్రారంభమైన.. అధికార పార్టీ టీఆర్ ఎస్ వర్సెస్ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మధ్య వార్.. కొనసాగుతూనే ఉంది. వరుసగా ప్రెస్ మీట్‌లు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ అన్యాయం చేస్తోందని.. రైతులను రోడ్డున పడేస్తోందని..ఆయన విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్‌గా .. రాష్ట్ర పార్టీ చీఫ్ బండి సంజయ్ విమర్శ లు చేశారు. ఇక, తాజాగా కేంద్ర …
Read More »‘రాఫెల్’ లంచాలు నిజమే.. ఫ్రెంచ్ పత్రిక సంచలన కథనం
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి.. ప్రధాని నరేంద్రమోడీ సర్కారుకు మరో భారీ ఎదురు దెబ్బతగిలింది. ఈ ఒప్పందంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఇప్పటి వరకు ఆరోపణల్లో ఏమీ వాస్తవం లేదని.. బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ, తాజాగా.. ఫ్రెంచ్ కు చెందిన అతి పెద్ద పత్రిక.. ‘మీడియా పార్ట్’ ఒక కథనం ప్రచురించింది. దీనిలో రాఫెల్ బాగోతాన్ని పూస గుచ్చినట్టు …
Read More »ఏపీ మంత్రులకు.. ‘ఎర్రి పుష్పం’ అవార్డులిస్తాం..
ఏపీలో బీజేపీ-వైసీపీల మధ్య నిన్న మొన్నటి వరకు ఉన్న సైలెంట్ వార్ ఇప్పుడు వీధికెక్కింది. పెట్రోల్, డీజీల్ ధరల తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన.. బీజేపీకి అంతే రేంజ్‌లో వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. నిన్నటికి నిన్న.. మంత్రి పేర్ని స్పందిస్తూ.. మొత్తంగా తగ్గించాల్సింది మీరే.. మీరే పెంచారు.. మీరే తగ్గించాలని.. ఏపీని తగ్గించమనే అర్హత లేదని చెప్పేశారు. ఇక, తాజాగా మాట్లాడిన.. మంత్రి కొడాలి నాని.. …
Read More »చంద్రబాబుకు బుద్ధి లేదు.. కొడాలి నాని మళ్లీ ఫైర్
వైసీపీ నాయకుడు, మంత్రి కొడాలి నాని.. మరోసారి విరుచుకుపడ్డారు. తన మాటల తూటాలతో ఆయన అటు టీడీపీ, ఇటు బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై సంచలన వ్యాఖ్యలే చేశారు. పెట్రో భారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేదే లేదని తేల్చేశారు. “అసలు మేమెందుకు తగ్గించాలి.. తగ్గించి మా ఆదాయాన్ని ఎందుకు కోల్పోవాలి” అని మంత్రి ఎదురు ప్రశ్నించారు. తిరుపతి, బద్వేల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు …
Read More »ఇద్దరు సీఎంలదీ ఒకే మాట
ఏ విషయంలో కలిసినా కలవకపోయినా కేసీయార్, జగన్మోహన్ రెడ్డి ఓ విషయంలో మాత్రం కలిసిపోయారు. అదేమిటంటే పెట్రోలు, డీజల్ ధరలను తగ్గింపు విషయంలో. పెట్రోలు, డీజిల్ ధరలను తమ రాష్ట్రాల్లో తగ్గించేది లేదని ఇద్దరు స్పష్టంగా చెప్పేశారు. తెలంగాణాలో ధరలను తగ్గించేది లేదని స్వయంగా కేసీయారే చెప్పగా, ఏపిలో కూడా ధరలు తగ్గింపు సాధ్యంకాదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ద్వారా జగన్ చెప్పించారు. సరే జగన్ …
Read More »