చంద్ర‌బాబు దూకుడు పెంచ‌క‌పోతే క‌ష్ట‌మేనా…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడు పెంచాల్సిందేన‌ని సీనియ‌ర్లు కోరుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న రాజకీయ ప‌రిణామాలు వ‌డివ‌డిగా మారుతున్న నేప‌థ్యంలో ఆయ‌న చురుగ్గా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని చెబుతున్నారు. నిజానికి షెడ్యూల్ ప్ర‌కారం.. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ఢిల్లీ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ ఏడాదే ఎన్నిక‌ల‌కు ముహూర్తం ఫిక్స‌య్యే ఆలోచ‌న క‌నిపిస్తోంది. దీనికిపై వైసీపీ అన్నీ అప్ర మ‌త్తం చేసుకుంటోంది.

వైసీపీ ప‌రంగా చూసుకుంటే.. కేవ‌లం 30 నుంచి 40 నియోజ‌క‌వ‌ర్గాల్లోనే మార్పులు క‌నిపిస్తున్నాయి. వీటిలో గ‌తంలో ఓడిపోయిన 23 స్థానాలు కూడా ఉన్నాయి. కాబ‌ట్టి.. వీటిని ఒకటి రెండు రోజుల్లోనే క‌న్ఫ‌ర్మ్ చేస్తారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ .. ఇప్ప‌టికే మార్పులు, చేర్పుల‌పై సంకేతాలు ఇచ్చారు. నాయ‌కుల‌ను కూడా మాన‌సికంగా సీఎం జ‌గ‌న్ సిద్ధం చేశారు. ఇక‌, ఎటొచ్చీ.. టీడీపీలోనే ఇలాంటి కార్య‌క్ర‌మం ఊపందుకోలేదు.

ఆశ‌లు పెట్టుకున్న నాయ‌కులు.. త‌మ‌కు త‌ప్ప ఎవ‌రికి టికెట్ ఇస్తారులే.. అని భావిస్తున్న‌త‌మ్ముళ్ల‌ను దారిలో పెట్టుకునే కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు ఇంకా శ్రీకారం చుట్టలేదు. దీనివ‌ల్ల నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ అనుకున్న విధంగా అయితే పుంజుకున్న‌ దాఖ‌లాలు క‌నిపించ‌లేద‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు. దీంతో ఇప్ప‌టికైనా.. వేగంగా నిర్ణ‌యాలు తీసుకోవాలని.. ఎవ‌రో ఉంటారు.. ఎవ‌రో పోతారు.. అనే సందేహాల‌ను కూడా వీడి నిర్ణ‌యాల‌పై స్పందించాల‌ని కోరుతున్నారు.

గ‌త వారం రోజులుగా నియోజ‌క‌వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు ప్ర‌త్యేక చ‌ర్చ‌లు చేస్తున్నారు. ఇలా మొత్తం 20 నుంచి 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని చంద్ర‌బాబు స‌మీక్షించారు. అయితే.. అత్యంత త‌క్కువ‌గానే నాయ‌కుల‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. దీంతో మిగిలిన స్థానాల ప‌రిస్థితి ఏంటి? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాబ‌ట్టి.. ఈ ప‌రిస్థితిలో వేగం తీసుకురావాల‌నేది సీనియ‌ర్ల సూచ‌న‌గా ఉంది. దీనిపై చంద్ర‌బాబు దృష్టి పెడుతుల‌న్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.