అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచాలనే డిమాండ్ తో తొందరలోనే రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలని అమరావతి జేఏసీ డిసైడ్ చేసింది. ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కంటిన్యూ చేయాలని డిమాండ్ తో ఆందోళనకారులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి జేఏసీ నేతలు కావలిలో మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల బిల్లులో లోపాలున్నాయన్న కారణంగానే హఠాత్తుగా ఉపసంహరించుకున్నట్లుగా మండిపడ్డారు. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహిరంచుకుంటున్నట్లు తెలియగానే సోమవారం ఉదయం పాదయాత్రలో …
Read More »జగన్ చేసిన తప్పేంటో తెలుసా ?
పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎత్తి చూపారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని అనుకున్న జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్ గా అయిపోయేదాన్ని పెద్ద సమస్యగా తయారు చేసుకున్నట్లు ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లోనే మూడు రాజధానులు అని జగన్ చెప్పటంతోనే సాంకేతిక, న్యాయ సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జస్టిస్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా వైజాగ్, …
Read More »బండిని ఆపేందుకు కేసీఆర్ అడుగులు
తెలంగాణలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్‌కు ప్రస్తుతం ప్రతిపక్షాల నుంచి సవాలు ఎదురవుతుందంటే అందుకు బండి సంజయ్ ప్రధాన కారణం. ఏడేళ్లుగా తిరుగులేని కేసీఆర్‌కు సంజయ్ కొరకరాని కొయ్యలా మారారు. గతేడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఈ కరీంనగర్ ఎంపీ.. దూకుడు పెంచారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలతో మరింత …
Read More »మళ్లీ మెలిక ఎందుకు? జగన్‌కు పవన్ సూటి ప్రశ్న
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై జనసేనాని పవన్ తీవ్రస్థాయిలో కామెంట్లు కుమ్మరించారు. మూడు రాజధానుల ఏర్పాటు, సి.ఆర్.డి.ఏ. రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి కూడా.. మళ్లీ ప్రజలను అయోమయంలోకి నెట్టేశారని విమర్శించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. జగన్ చేస్తున్నదంతా కూడా.. కోర్టు కళ్లకు గంతలు కడుతున్నట్టుగా ఉందని దుయ్యబట్టారు. మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామనడం వెనుక వ్యూహం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసులలో …
Read More »అమరావతి అడుగులు ఇలా… 2014 టు 2021
ఏపీ రాజధాని అమరావతి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిని వికేంద్రీకరిస్తూ మూడు రాజధానులు చేశారు. ఇక ఈ రోజు మూడు రాజధానులను రద్దు చేస్తూ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలు అమరావతి రాజధానిగా 2014 – 2021 సంవత్సరాల మధ్య ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. 2014లో నవ్యాంధ్ర …
Read More »జగన్ చేసిన పెళ్లి.. వియ్యం అందుకున్న కొలుసు-బుర్రా
వైసీపీలో ఇద్దరు కీలక నాయకులు, ఎమ్మెల్యేలు కూడా అయిన.. కొలుసు పార్థసారథి, బుర్రా మధుసూదన్ యాదవ్‌లు వియ్యం అందుకున్నారు. అయితే.. సహజంగానే.. ఇలాంటి జరుగుతుంటాయి. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, పి. నారాయణ కూడా వియ్యం అందుకున్నారు. కానీ, వారికి .. ఇప్పుడు.. వియ్యం అందుకున్న వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్య కొంత తేడా ఉంది. టీడీపీ మంత్రుల వియ్యానికి .. పార్టీ అధినేత , అప్పటి …
Read More »తప్పు దిద్దుకున్న కాంగ్రెస్
ఇంతకాలానికి కాంగ్రెస్ అధిష్టానంలో మార్పు వచ్చినట్లే ఉంది. మధ్యప్రదేశ్ లో జరిగిన తప్పు రాజస్థాన్ విషయంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్ వర్గానికి సీనియర్ నేత సచిన్ పైలట్ వర్గానికి మధ్య పరిస్థితులు ఉప్పు-నిప్పుగా ఉన్న విషయం తెలిసిందే. ఒక సమయంలో తన వర్గాన్ని తీసుకుని పైలెట్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేయాలని ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే అధిష్టానం అప్రమత్తమవటంతో సచిన్ …
Read More »ఏపీ బీజేపీని మలుపు తిప్పింది ఆయనేనా..?
ఏపీ బీజేపీని మలుపు తిప్పింది ఆయనేనా? ఆయన సూచనలతోనే ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకు అమరావతి రాజధాని విషయంలోనూ.. రైతులు చేపట్టిన ఉద్యమం విషయంలోనూ.. నాయకుల మధ్య పొంతన లేకుండా పోయింది. ముఖ్యంగా గతంలో రాష్ట్ర పార్టీ సారధిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు. అయితే.. అదే సమయంలో టాఠ్! ఇలా …
Read More »3 రాజధానుల బిల్లు వెనుకపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన
అనూహ్యమైన నిర్ణయాన్ని ఏపీ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లుగా పేర్కొన్న జగన్ సర్కారు సంచలనానికి తెర తీసింది. తొలుత ఈ విషయాన్ని హైకోర్టుకు తెలిపారు. అనంతరం ప్రకటన చేశారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మూడు రాజధానుల ఏర్పాటును ఉద్దేశించి ప్రవేశ పెట్టిన బిల్లును వెనక్కి తీసుకున్నట్లుగా చెబుతూ.. కీలక అంశాల్ని ప్రస్తావించారు. ఆయనేం చెప్పారన్నది …
Read More »ఆ విషయంలో టీడీపీని బీజేపీ హైజాక్ చేస్తుందా..?
రాజకీయాల్లో పార్టీలు ఒకరిపై ఒకటి పైచేయి సాధించుకునేందుకు ప్రయత్నించడం మామూలే. ఒకరి కన్నా ఎక్కువ మంచి విధానాలతో మరో పార్టీ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఇది కామన్‌గా జరిగేదే. అయితే.. ఇప్పటి వరకు ఏ విషయం లోనూ పోటీకి రాని.. బీజేపీ.. ఇప్పుడు కొత్తగా ఒక విషయంలో పెద్ద పోటీనే ఇస్తోంది. నిజానికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అనేక ప్రయాసలు పడుతున్న నాయకులు.. వ్యూహాలు దొరక్క, వేసిన వ్యూహాలు సైతం …
Read More »సలహాదారులను సాగనంపుతారా?
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? లెక్కకు మిక్కిలిగా ఉన్న సలహాదార్ల సంఖ్యను తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలోని మంత్రుల సంఖ్య కంటే సలహాదారులే ఎక్కువ. ముఖ్యమంత్రి జగన్ కేబినేట్ సంఖ్య 25 అయితే.. అంతకంటే ఎక్కువగా 33 మంది సలహాదారులతో భారీ స్థాయిలో అడ్వైజరీ కమిటీ నియమించుకున్నారు. ఇంతమంది సలహాదార్లు …
Read More »కేంద్రం ఎఫెక్ట్.. అందుకే జగన్ యూటర్న్?
దాదాపు రెండేళ్లకు పైగా రైతుల పోరాటం.. పోలీసుల నుంచి లాఠీ దెబ్బలు.. అవమానాలు..మంత్రుల నుంచి ఈసడింపు మాటలు.. వెరసి.. అమరావతి విషయం రగిలిన భోగిమంటలా.. కొనసాగింది. రైతులు వెనుదిరిగేది లేదని.. తమ త్యాగాలు వృథా కారాదని.. స్పష్టం చేస్తూ.. అమరావతికోసం. ఉద్యమించారు. మూడు రాజధానులను తిరస్కరించారు. అయితే.. తాము వెనక్కి తగ్గేదిలేదని., ప్రభుత్వం భీష్మించింది. దరిమిలా కోర్టులో ఈ కేసులు నానడం..రోజువారి విచారణ జరుగుతుండడం సర్వత్రా తీవ్ర ఉత్కంఠకు వివాదానికి …
Read More »