హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి విషయంలో సీబీఐ దాఖలు చేసిన ఫైనల్ చార్జిషీటు గందరగోళంగా తయారైంది. చార్జిషీటు ఒకటే కానీ దాన్ని మీడియా ప్రజెంట్ చేయటంలో భిన్న కోణాల్లో ఉంది. రాష్ట్రంలో మీడియా మొత్తం జగన్ అనుకూలంగా, వ్యతిరేకంగా చీలిపోయిన విషయం తెలిసిందే. అనుకూల మీడియా అంటే ఎక్కుగా సొంత మీడియాలో చార్ఝిషీటులో సీబీఐ దర్యాప్తునే తప్పుపడుతు కథనాలు వచ్చింది. దర్యాప్తులో కీలకమైన గూగుల్ టేక్ అవుట్ ను రీడ్ చేయటంలో పొరబడినట్లు సీబీఐ అంగీకరించిందని చెప్పింది.
దాని ప్రకారం అవినాష్, తండ్రి భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్, సునీల్ యాదవ్ కు హత్యతో సంబంధంలేదని అర్ధమవుతోంది. ఇదే సమయంలో జగన్ వ్యతిరేక మీడియా మాత్రం హత్యలో అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కరరెడ్డి తదితరులు పూర్తిగా ఇరుక్కుపోయారని రాసింది. సీబీఐ చార్ఝిషీట్లో అవినాష్ కు హత్యతో ఉన్న లింకులు ఎస్టాబ్లిష్ అయినట్లు చెప్పింది. హత్యకేసులో నుండి అవినాష్ తప్పించుకునే అవకాశం లేదన్నది.
అలాగే జగన్ దంపతుల పాత్ర కూడా అనుమానాస్పదంగా ఉందన్నట్లుగా కథనాలు ఇచ్చింది. అలాగే హత్యకు కారణాలంటు షర్మిల వాగ్మూలాన్ని కూడా రెండువైపుల మీడియా రెండు రకాలుగా ప్రజెంట్ చేసింది. హత్యకు కడప ఎంపీ టికెట్టే కారణమని సీబీఐ విచారణలో షర్మిల చెప్పినట్లుగా వ్యతిరేక మీడియా ప్రస్తావించింది. అయితే వివేకా హత్యకు కడప ఎంపీ టికెట్ అసలు కారణమే కాదని, వివేకా కుంటుంబ, ఆస్తి తగాదాలు కారణమని షర్మిల చెప్పినట్లుగా జగన్ మీడియా ప్రొజెక్టు చేసింది.
సీబీఐ చార్ఝిషీట్లో ఏముందో స్పష్టంగా తెలీదు కానీ చార్ఝిషీటులోని అంశాలను మాత్రం జగన్ అనుకూల, వ్యతిరేక మీడియా తమిష్టం వచ్చినట్లు ప్రొజెక్టు చేస్తున్నాయి. దాంతో అసలు హత్యకు దారితీసిన కారణాలు ఏమిటి ? అనే విషయంలో జనాల్లో గందరగోళం పెరిగిపోతోంది. చార్జిషీట్లోని అంశాలను ఉన్నది ఉన్నట్లుగా జనాలకు అందించాలన్న ఇంగితం మీడియాలో లేకపోవటమే ఈ పరిస్ధితికి కారణం. రోజుకో కథనం, రోజుకు వాగ్మూలంతో జనాల్లో గందరగోళం పెరిగిపోతోంది. మరీ గందరగోళానికి ఎప్పుడు తెరపడుతుందో ఏమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates