వాలంటీర్ల వ్యవహారంపై ఏపీలో జరుగుతున్న రచ్చ మామూలుగా లేదు. ఏపీ ప్రభుత్వం వాలంటీర్లను పంపించి ప్రజలు ఆధార్ కార్డ్ డాటా, బ్యాంకు అకౌంట్ల డాటా సహా కీలకమైన, వ్యక్తిగత డాటా తీసుకుంటుండం పై కొద్దిరోజులుగా పవన్ ప్రశ్నిస్తున్నారు.
ఆ డాటా ఎవరి చేతుల్లో ఉందని అడుగుతున్నారు.. ఆ డాటాను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ నిలదీస్తున్నారు. పవన్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యకర్తలు, సోషల్ మీడియా బ్యాచ్ మొత్తం పవన్ పై ఎదురుదాడికి దిగుతున్నారు.
ఈ నేపథ్యలో 2019 ఎన్నికలకు ముందు జగన్ మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జగన్.. మీ ఆధార్ డాటా, బ్యాంకు అకౌంట్ డాటా, ఓటర్ కార్డు డాటా కలర్ ఫొటో సహా వేరే ఎవరి దగ్గరైనా ఉంటే అది క్రైంఅవుతుంది అని చెప్పడం స్పష్టంగా ఉంది. దాంతో జనసేన కార్యకర్తలు ఆ వీడియోను వైరల్ చేస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నదీ ఇదే కదా జగన్ అని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఆ వీడియోను షేర్ చేస్తూ జగన్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు. డాటా ప్రైవసీ నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయి… నువ్వు సీఎం అయినా కాకపోయినా నిబంధనలు ఒకేలా ఉంటాయి. కాబట్టి నేను అడిగే ఈ మూడు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటూ మూడు ప్రశ్నలను ట్విటర్లో పోస్ట్ చేశారు.
1) వాలంటీర్లకు బాస్ ఎవరు?
2) ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్సనల్ డాటా మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు?
3) ప్రజల వ్యక్తిగత డాటా తీసుకోవడానికి వాలంటీర్లకు ఎవరు అధికారం ఇచ్చారు? వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా? అంటూ మూడు ప్రశ్నలు అడిగారు.
ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో రాజకీయంగా కాక పుట్టిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates