సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, ఆ కేసు విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే, తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణ బాగా ఆలస్యం అవుతుందని, 371 సార్లు జగన్ కేసులను సిపిఐ కోర్టు వాయిదా వేసిందని రఘురామ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇక, కేసు విచారణకు ప్రత్యక్షంగా జగన్ హాజరు కాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందని పేర్కొన్నారు. వందల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు వేశారని, ఆ పిటిషన్లో రఘురామ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీఎం జగన్ కు షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన వ్యవహారం సంచలనం రేపుతోంది. జగన్ తో పాటు సీబీఐకి కూడా దేశపు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జగన్ పై కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రదర్శించింది. ఆ కారణాలను వెల్లడించాలంటూ సిబిఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్ పై తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates