Political News

పది రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి తెలంగాణకు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో సానుకూల ఫలితాలు రాబట్టే అవకాశం ఉండటంతో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. త్వరలో జరగబోయే తెలంగాణ ఎన్నికలకు పార్టీ నాయకులను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఖమ్మంలో సభలో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్పై అమిత్ షా తీవ్ర విమర్శలు …

Read More »

మైనంపల్లి అంటే భయపడుతున్నారా?

మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు అంటే కేసీయార్ భయపడుతున్నారా ? అందుకనే ఆయనపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవటానికి వెనకాడుతున్నారా ? అంటే అవుననే అంటున్నాయి పార్టీవర్గాలు. మల్కాజ్ గిరిలో తనకు మెదక్ లో తన కొడుక్కి ఎంఎల్ఏ టికెట్లు కావాలని మొదటినుండి మైనంపల్లి పట్టుబడుతున్నారు. అయితే అందుకు కేసీయార్ అంగీకరించలేదు. మొదటినుండి చెబుతున్నట్లే మల్కాజ్ గిరిలో మాత్రమే మైనంపల్లికి టికెట్ ఇచ్చారు. దాంతో హనుమంతరావు అలిగారు. తన కొడుక్కి …

Read More »

ఈటల పిలిస్తే తుమ్మల వస్తారా?

అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత ఆయన.. దివంగత ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు, తాజాగా కేసీఆర్ ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేశారు. ఖమ్మం జిల్లాలో ఆయనకు గొప్ప పట్టుంది. తెలంగాణ ఎన్నికలకు ముందు అలాంటి నాయకుడికి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. ఆ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. పాలేరు టికెట్ దక్కకపోవడంతో అసంత్రుప్తి ఉన్న ఆయన రాజకీయ భవిష్యత్ ఎలాంటి మార్పులు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. పాలేరు సిట్టింగ్ …

Read More »

కాంగ్రెస్ లో కొత్త సమస్య మొదలైందా?

కాంగ్రెస్ లో కొత్త సమస్య మొదలైందట. అదేమిటంటే పార్టీలో కొత్తగా చేరినవాళ్ళకి టికెట్లు దక్కుతుందా లేదా అని. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీచేయాలన్నా ముందు దరఖాస్తు చేసుకోవాల్సిందే అనే నిబంధన పెట్టారు. దాని ప్రకారం 119 నియోజకవర్గాలకు దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 18వ తేదీనుండి 25వ తేదీ వరకు అంటే వారంరోజుల పాటు దరఖాస్తులకు సమయమిచ్చారు. వారం రోజుల్లో సుమారు వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాలకైతే 15 …

Read More »

ఇండియాకు షాకిచ్చిన కేజ్రీవాల్

కొత్తగా ఏర్పడిన ఇండియాకూటమికి ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పెద్ద షాకిచ్చారు. బీహార్లో తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఆప్ పోటీచేస్తుందని ప్రకటించారు. స్ధానిక సంస్ధల ఎన్నికలతో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న కేజ్రీవాల్ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీకి రెడీ అవుతున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ ప్రకటన ఇండియా కూటమిలో కలకలం రేపుతోంది. కూటమి స్పూర్తిని  కేజ్రీవాల్ దెబ్బతీస్తారా అంటు …

Read More »

బీజేపీ తరపున చికోటి పోటీ?

చికోటి ప్రవీణ్…పేరు తెలియని వారుండరు. మనిషిని నేరుగా చూడకపోవచ్చు, పరిచయం కూడా లేకపోవచ్చు. కానీ ప్రతిరోజు వార్తలను ఫాలో అయ్యేవాళ్ళకి చికోటి ప్రవీణ్ అనే పేరు చాలా పరిచయటమనే చెప్పాలి. చికోటి పేరు ఎలాగ పరిచయం ఉంటుందంటే గ్యాంబ్లింగ్ నిర్వాహకుడిగా. దేశ, విదేశాల్లో కాసినో నిర్వాహకుడిగా, గ్యాంబ్లింగ్ మాస్టర్ గా సమాజంలో చికోటి చాలా పాపులర్. అలాంటి చికోటి రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయబోతున్నారట. ఈ విషయాన్ని బీజేపీ …

Read More »

బెయిల్ పై బయట ఉండడంలో జగన్ ది ఆల్ టైం రికార్డ్!

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేనలతోపాటు వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ కు మొదటి నుంచి బీజేపీ అండ ఉందని, అందుకే ఆయన కేసులను కాపాడుకునేందుకు రాష్ట్ర భవిష్యత్తును జగన్ తాకట్టు పెట్టారని వామపక్ష నేతలు గతంలో పలుమార్లు విమర్శలు గుప్పించారు. జగన్ నియంత పోకడల వల్ల రాష్ట్రం అప్పుల ఊభిలో కూరుకుపోయిందని వారు దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా …

Read More »

అజయ్ రావు..కేటీఆర్ గా ఎలా మారారో చెప్పిన బండి

ఖమ్మంలో బీజేపీ తలబెట్టిన ‘రైతు గోస-బీజేపీ భరోసా’ సభకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖా మంత్రి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సభలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా పాల్గొని బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోసం చేయడంలో కేసీఆర్ పీహెచ్ డీ చేశారని, కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్ అని …

Read More »

40 లక్షలతో బస్ షెల్టర్..4 రోజుల్లో కూలింది

విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సౌత్ సైడ్ ఒక బస్సు షెల్టర్ కొత్తగా నిర్మించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి ఈ మోడరన్ బస్ షెల్టర్ ను ఐదు రోజుల క్రితమే అట్టహాసంగా ప్రారంభించారు. ఈ మోడరన్ బస్ షెల్టర్ కం బస్ బేకు 40 లక్షల రూపాయలు వెచ్చించారు. అయితే, పట్టుమని పది రోజులు కూడా కాకుండానే ఈ బస్సు షెల్టర్ కుంగిపోయి …

Read More »

క్రిస్టియన్ కామెంట్లుపై భూమన స్పందన

సీఎం జగన్ హయాంలో టీటీడీ ప్రతిష్ట మసకబారుతోందని టిడిపి సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అన్యమత ప్రచారం మొదలుకొని టీటీడీ నూతన చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం వరకు జగన్ ప్రభుత్వంపై, టీటీడీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా భూమన నియామకం వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు దూకుడు పెంచారు. అన్యమతస్థుడైన కరుణాకర్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టడం ఏమిటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. …

Read More »

గన్నవరంలో మరో పెద్ద వికెట్ పడనుందా?

గన్నవరం నియోజకవర్గంలో పంచాయితి జగన్మోహన్ రెడ్డికి కాస్త తలనొప్పిగానే తయారైంది. ఈమధ్యనే యార్లగడ్డ వెంకటరావు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. పెద్ద తలనొప్పి వదిలిపోయిందని అనుకుంటే దుట్టా రామచంద్రరావు రూపంలో మళ్ళీ మొదలైంది. 2014లో వైసీపీ నుండి పోటీచేసి ఓడిపోయింది దుట్టానే. 2019లో యార్లగడ్డ చివరి నిముషంలో వచ్చి టికెట్ తీసుకుని ఓడిపోయారు. రెండు ఎన్నికల్లో ఇద్దరిపైన గెలిచిన వల్లభనేని వంశీ మారిన రాజకీయ పరిణామాల్లో …

Read More »

ఓట్ల పంచాయతీ ని బీజేపీ ఏం చేస్తుందో ?

ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ తొందరలో ఢిల్లీకి చేరుకుంటోంది. ఈనెల 28వ తేదీ అంటే సోమవారం ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు కూడా కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ ను కలవబోతున్నాయి. రెండుపార్టీలు ఒకదానిపై మరొకటి ఫిర్యాదులు చేసుకునేందుకు రెడీ అయ్యాయి. తమకు అనుకూలంగా చేర్పించుకుంటు, తమకు ఓట్లు పడవని అనుమానం వచ్చిన ఓట్లను వైసీపీ నేతలు ఓటర్ల జాబితాలో నుంచి తీసేస్తున్నట్లు చంద్రబాబునాయుడు పదేపదే ఆరోపిస్తున్నారు. ఇదే …

Read More »