టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి నేరుగా కదనరంగంలోకి దిగిపో యారు. నారా చంద్రబాబు అరెస్టు, జైలును నిరసిస్తూ.. రాష్ట్రంలో చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆమె ప్రత్య క్షంగా పాల్గొంటూ యువతను ప్రోత్సహిస్తున్నారు. అదేసమయంలో వైసీపీ ప్రభుత్వంపై సమర శంఖం కూడా పూరించారు. ఇక, ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణను మరింత ముమ్మరం చేస్తూ.. ప్రజలకు ఉద్యమ పిలుపునిచ్చారు. “మోత మోగిద్దాం రండి!” పేరుతో చంద్రబాబు …
Read More »స్కిల్ స్కాం కేసులో లోకేష్ కు ముందస్తు బెయిల్
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుతోపాటు ఏపీ ఫైబర్ స్కామ్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు కూడా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ రెండు కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేష్ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ల పై విచారణ జరిపిన హైకోర్టు లోకేష్ కు ఊరటనిచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో లోకేష్ కు …
Read More »హైకోర్టు షాక్: లోకేష్ కు 41ఏ నోటీసులు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సీఐడీ ఏ14గా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోకేష్ కు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, సీఐడీ విచారణకు …
Read More »విశాఖపట్నం-నరసాపురం-కడప..వెరీ ఇంట్రస్టింగ్ స్టోరీ
అదేంటి? ఏపీలో ఎన్నో నగరాలు, నియోజకవర్గాలు ఉండగా.. ఈ మూడు ప్రాంతాలనే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు అంత స్పెషాలిటీ? ఏంటా ఇంట్రస్టింగ్ అనే ప్రశ్నలు సహజమే. మరో ఆరేడు మాసాల్లో జరగబోయే ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాలు ఇప్పుడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారాయి. ఈ మూడు చోట్ల విజయం దక్కించుకునేందుకు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిన్న మొన్నటి వరకు వ్యూహాలపై వ్యూహాలు పన్నింది. ప్రస్తుతం ఈ …
Read More »మళ్లీ సైలెంట్: జనసేనలో ఊపేది బ్రో?!
అన్న అడుగేస్తే మాస్… అన్న స్టెప్పేస్తే మాస్.. అన్న మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బాగానే నప్పుతుంది. తరచుగా నిన్న మొన్నటి వరకు ఆయన పార్టీ తరఫున నిర్వహించిన సభలు, సమావేశాల్లో ఏం మాట్లాడినా… నాయకులు, కార్యకర్తలు ఈలలతో గోల పుట్టించి.. మాట్లాడే నాయకుడికి కూడా గగ్గోలు పుట్టించేసి ఇంక ఆపండి చాలు! అనే రేంజ్లో హడావుడి చేశారు. ఊపు తెచ్చారు. పవన్ సీఎం-పవనే సీఎం.. అంటూ ఊరమాసు …
Read More »బ్రాహ్మణికి ట్రైనింగ్ ఇస్తున్నారా ?
తాజా రాజకీయ పరిస్థితుల్లో ఏ నిముషంలో అయినా పార్టీలో కీలక బాధ్యతలు పోషించటానికి వీలుగా బ్రాహ్మణి అవసరమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారట. పార్టీలోని కొందరు సీనియర్లు పార్టీ వ్యవహారాలపై బ్రాహ్మణికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. యువగళం పాదయాత్రను ఈరోజు నుండి పునఃప్రారంభించాలని లోకేష్ అనుకున్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేష్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే. పాదయాత్ర …
Read More »షెడ్యూల్ ముందు కేసీఆర్ కొత్త పథకం ?
రాబోయే ఎన్నికల్లో గెలుపు సాధించడం ఎలాగ అన్నది మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముందున్న సవాల్. అధికారం అందుకోవడం కోసం వీలైనన్ని పథకాలు, హామీలు, డిక్లరేషన్లను పార్టీల అధినేతలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలతో పోల్చితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేమిటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమల్లోకి తెచ్చేసే సౌలభ్యం ఉంది. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే …
Read More »కాంగ్రెస్ లో ‘మైనంపల్లి’ లొల్లి
కాంగ్రెస్ లో బీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు అలా చేరారో లేదో ఇలా లొల్లి మొదలైపోయింది. మైనంపల్లి కేంద్రంగా సీనియర్లు అధిష్టానం ముందు గొడవ మొదలు పెట్టేశారు. దేనికంటే తమకు కూడా డబుల్ టికెట్లు ఇవ్వాల్సిందే అని. రాబోయే ఎన్నికల్లో తెలంగాణా మొత్తం మీద ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని మొదట్లోనే అధిష్టానం స్పష్టంగా చెప్పింది. అయితే పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ …
Read More »లోకేష్ తన నిర్ణయం ఎందుకు మార్చుకున్నారు?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగిన సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు పోలీసుల సాయంతో ఎన్నో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. కానీ, వాటన్నిటిని అధిగమించి కదం తొక్కుతూ ముందుకు సాగిన లోకేష్ 200 రోజుల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. అయితే, చంద్రబాబు అరెస్టు తర్వాత పాదయాత్రకు లోకేష్ హఠాత్తుగా విరామం ప్రకటించాల్సి వచ్చింది. …
Read More »కూకట్పల్లి టికెట్ కోట్లు పలుకుతోందా? అన్ని పార్టీల్లోనూ చర్చ
కో.. కోటి! అని తెలుగులో ఓ పాట ఉంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలోనూ.. ఇదే పాట వినిపి స్తోంది. అత్యంత కీలకమైన కూకట్పల్లి టికెట్ కోట్ల రూపాయలు పలుకుతున్నట్టు దాదాపు అన్ని పార్టీల్లో నూ చర్చ సాగుతోంది. కూకట్పల్లి టికెట్‌ను కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. పైగా..ఈ టికెట్ కోసం కోట్ల రూపాయలు పార్టీలకు ఫండ్‌గా ఇచ్చేందుకు కూడా కొందరు పారిశ్రామిక వేత్తలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. గత 2018 …
Read More »ఆ గుర్తులను తొలగించాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ రిక్వెస్ట్
తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ భయపడుతోంది. బీఆర్ఎస్ కు భయమేంటీ? అనుకుంటున్నారా? అవును.. వరుసగా మూడో సారి గెలవాలనే లక్ష్యంతో ఉన్న ఆ పార్టీని కొన్ని గుర్తులు భయపెడుతున్నాయి. ఆ గుర్తులు బీఆర్ఎస్ గుర్తు కారును పోలి ఉండటమే ఇందుకు కారణం. అలాంటి గుర్తుల వల్ల బీఆర్ఎస్ కు పడాల్సిన ఓట్లు ఇతరులకు వెళ్తున్నాయని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది. అందుకే కారును పోలిన గుర్తులను తొలగించాలని …
Read More »సెటిలర్ల ఓట్లు ఈ సారి అక్కర్లేదా? : బీఆర్ఎస్లో గుసగుస
పైకి ఎంత గంభీర వచనాలు చెప్పినా.. ఎన్నికల సమయానికి సెటిలర్ల ఓట్లు.. తెలంగాణ పాలక పక్షానికి కానీ, ప్రతిపక్షాలకు కానీ అత్యంత కీలకం. ఎల్బీనగర్ నుంచి ఖైరతాబాద్, కూకట్పల్లి సహా సుమారు 12 నియోజకవర్గాల పరిధిలో సెటిలర్ల ఓట్లు నాయకుల తలరాతలను సెటిల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలిసే.. అధికార బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీ సహా వామపక్షాల వరకు సెటిలర్లపై పన్నెత్తు మాట అనేందుకు సాహసం చేసే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates