Political News

పాకిస్తాన్ కోడలు సానియా ఎందుకు.. రాజాసింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి మండిపడ్డారు. ఈ క్రమంలో.. భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను కూడా వివాదంలోకి లాక్కురావడం గమనార్హం. పాకిస్తాన్ కోడలు సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు నియమించారంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్ కోడ‌లు సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ చేసిన కేసీఆర్ కు పీవీ సింధు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. సింధుని బ్రాండ్ అంబాసిడ‌ర్ చేయాలని డిమాండ్ …

Read More »

ఏపీ మంత్రుల‌కే కాదు.. మంత్రుల మాటకు కూడా విలువ లేదా?

జ‌గ‌న్ కేబినెట్‌లో సీనియ‌ర్ మంత్రులుగా ఉన్న వారికి .. విలువ‌లేదా ? నాయ‌కులుగా.. మంత్రుల‌కే కాదు.. వారి మాట‌కు కూడా వాల్యూ లేకుండా చేస్తున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌తి దానికీ.. త‌గుదున‌మ్మా.. అంటూ.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ముందుకు వ‌స్తున్నార‌ని.. చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కీల‌క‌మైన విష‌యాల్లో స‌జ్జ‌లే మీడియా ముందుకు వ‌స్తున్నారు. పార్టీ త‌ర‌ఫున వాయిస్ కూడా వినిపిస్తున్నారు. మ‌రోవైపు.. …

Read More »

ప్రతిపక్షాల వల్ల దేశభద్రతకు ముప్పుందా ? !!

ప్రతిపక్షాల వల్ల దేశభద్రతకు ముప్పుందా ? కేంద్రప్రభుత్వం తాజాగా చేసిన వ్యాఖ్యలతో అందరిలోను ఇదే అనుమానాలు మొదలయ్యాయి. పార్లమెంటు సమావేశల్లో మంటల మండిస్తున్న పెగాసస్ సాఫ్ట్ వేర్ అంశాన్ని చర్చించాల్సిందే అని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. ఇదే విషయం గడచిన 15 రోజులుగా పార్లమెంటులోని ఉభయసభలను పట్టి కుదిపేస్తోంది. ప్రతిపక్షాలు ఇంత డిమాండ్ చేస్తున్నా కేంద్రప్రభుత్వం మాత్రం చర్చకు ఇష్టపడటంలేదు. అధికార-ప్రతిపక్షాల మధ్య మొదలైన ప్రతిష్టంభనను క్లియర్ చేయటానికి రాజ్యసభ …

Read More »

జ‌గ‌న్ వైఖ‌రితో త‌ల ప‌ట్టుకున్న బ్యాంక‌ర్లు..!

ఏపీ పొలిటిక‌ల్ , మీడియా స‌ర్కిల్స్‌లో ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పుల‌తో ఆర్థిక ప‌రిస్థితి రోజు రోజుకు దిన‌దిన‌గండంగా మారిపోతోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల మేర‌కు భారీ స్థాయిలో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వానికి వ‌చ్చిన, వ‌స్తున్న ఆదాయం.. వ‌చ్చిన‌ట్టే.. ల‌బ్ధిదారుల ఖాతాల‌కు మ‌ళ్లుతున్నాయి. దీంతో ఒక‌వైపు క‌రోనా నేప‌థ్యంలో ఆదాయం …

Read More »

యడ్డీకి షాకిచ్చిన మోడి

కర్నాటకలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ప్రధానమంత్రి నరేంద్రమోడి పెద్ద షాకిచ్చారు. రాజీనామాకు ముందు యడ్యూరప్ప డిమాండ్లను అంగీకరించిన కేంద్ర నాయకత్వం తర్వాత తుంగలో తొక్కేసింది. బుధవారం ప్రమాణస్వీకారం చేసిన కొత్తమంత్రివర్గంలో యడ్డీ కొడుకు విజయేంద్రకు చోటు దక్కలేదు. అలాగే మాజీ సీఎం మద్దతుదారుల్లో చాలామందికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. అలాగే ఉపముఖ్యమంత్రులుగా ఎవరినీ నియమించలేదు. కొద్దిరోజుల ముందు తన భవిష్యత్తుపై మాట్లాడేందుకు యడ్యూరప్ప ఢిల్లీలో …

Read More »

టెన్షన్ పెంచేస్తున్న సర్వేలు

ఎప్పుడు జరుగుతుందో తెలీని హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక అన్నీ పార్టీల్లోను టెన్షన్ పెంచేస్తోంది. గెలుపే లక్ష్యంగా ప్రతిపార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగానే పార్టీలో తమ మద్దతుదారులతో సర్వేలు చేయించుకుంటున్నాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే కొన్ని సంస్ధలు స్వచ్చంధంగా నియోజకవర్గంలో సర్వేలు మొదలుపెట్టేశాయి. దాంతో హుజూరాబాద్ లో ఎక్కడ చూసినా సర్వేల హడావుడే కనబడుతోంది. దాంతో పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీల సర్వేలు ఎలాగూ ఉంటుంది. అయితే అవి …

Read More »

చర్చ- తెలంగాణా ఎందుకు గైర్హాజరైంది ?

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల మొదటిసమావేశానికి తెలంగాణా గైర్హాజరైంది. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యాల బోర్టుల సంయుక్త సమావేశం హైదరాబాద్ లో మంగళవారం జరిగింది. సంయుక్త బోర్డుల మొదటిసమావేశానికి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరవ్వాలని ముందే సమాచారం ఇచ్చినా తెలంగాణా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరుకాకపోవటం విచిత్రంగా ఉంది. సమావేశానికి హాజరైన ఏపి ఉన్నతాధికారులు మాత్రం కొన్ని విషయాల్లో తమ వాదనను వినిపించారు. మరికొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డితో …

Read More »

బీసీ నేతనే పోటీలోకి దింపుతున్నారా ?

హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కేసీయార్ తీసుకున్న తాజా నిర్ణయంతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున ఎవరిని పోటీలోకి దింపుతారనే విషయంలో చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి రెడ్డి అభ్యర్ధని, మరోసారి బీసీనే దింపుతారన్నారు. చివరకు ఎస్సీకే టికెట్టిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఎవరిని రంగంలోకి దింపుతారనే విషయం కేసీయార్ కనీసం సూచన కూడా చేయలేదు. ఇలాంటి నేపధ్యంలోనే నియోజకవర్గానికే చెందిన కౌశిక్ …

Read More »

స‌ఖ్య‌త లేని నేత‌ల‌తో విజ‌య‌వాడ‌ వైసీపీ ప్ర‌యాణం…!

రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన న‌గ‌రం విజ‌య‌వాడ‌. ఇక్క‌డ ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టులు, త‌ర్వాత‌.. కాంగ్రెస్ రాజ‌కీయంగా రాజ్యమేలాయి. ఇక్క‌డ ఆ పార్టీల్లో ఉన్న నేత‌లే కార‌ణం. క‌మ్యూనిస్టు, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌తోనే ఇక్క‌డ వారికి ప‌ట్టు చిక్కింది. టీడీపీ 1994, 1999లో అధికారంలో ఉన్నా కూడా విజ‌య‌వాడ న‌గ‌రంలో ఆ పార్టీని శాసించే నాయ‌కులు లేరు. అయితే 2014 త‌ర్వాత మాత్ర‌మే టీడీపీ కూడా ఇక్క‌డ పుంజుకుంది. రెండు అసెంబ్లీ.. …

Read More »

జగన్ రానివ్వకపోతే బీజేపీలోకే… ?

ఏపీ రాజకీయం ఇంకా ఒక కొలిక్కి రావడంలేదు. ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ వరసపెట్టి గెలుస్తోంది. అది వాపో బలమో ఎవరికీ తెలుయదు. ఎందుకంటే వైసీపీ చేతిలో అధికారం ఉంది కాబట్టి అది నిజమైన గెలుపా కాదా ? అన్న దాని మీద ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి. అలాగని టీడీపీ పుంజుకుందా అంటే ఆ పార్టీ నాయకులే గట్టిగా చెప్పలేకపోతున్నారు. మరో వైపు చూస్తే గతంలో ఎన్నడూ లేని …

Read More »

జేసీ కుటుంబానికి జ‌గ‌న్ ‘ఫేవ‌ర్‌’.. రీజ‌నేంటి?

రాజ‌కీయాల్లో చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే వైసీపీలోనూ చోటు చేసుకుంది. రాజ‌కీయంగా ఉప్పు నిప్పుగా ఉండే.. అనంత‌పురం జిల్లాకు చెందిన జేసీ బ్ర‌ద‌ర్స్‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి జేసీ కుటుంబాన్ని గ‌త 2019 ఎన్నిక‌ల‌కుముందు.. పార్టీలో చేరాల‌ని జ‌గ‌న్ ఆహ్వానించారు. ఈ విష‌యాన్ని ఓ సంద‌ర్భంలో దివాక‌ర్‌రెడ్డి ప్ర‌స్తావించారు. త‌న‌ను జ‌గ‌న్ పార్టీలోకి చేర‌మంటున్నాడ‌ని.. అయితే.. క‌ప్పం …

Read More »

అఖిలకు మేనమామ అండ… ?

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రాజకీయం డోలాయమానంలో పడింది. భూమా కుటుంబంలో కూడా పెద్దగా సఖ్యత లేదు. దాంతో భూమా ఫ్యామిలీకు అడ్డాలుగా నిలిచిన ఆళ్ళగడ్డ, నంద్యాలలో పొలిటికల్ సీన్ రివర్స్ అయింది. ఇక్కడ నుంచి టీడీపీలో పోటీ చేసేందుకు వేరే నాయకులు కూడా రెడీగా ఉన్నారు. చంద్రబాబు కూడా ఈసారి భూమా ఫ్యామిలీని పక్కన పెట్టి వేరే వారికి టికెట్లు ఇస్తారని అంటున్నారు. దాంతో అఖిలప్రియ ఏకంగా జగన్‌నే …

Read More »