జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పటి వరకు ఏపీలో చేసిన ఆర్థిక సాయంపై ఆ పార్టీ లెక్కలు చెప్పింది. ఇప్పటి వరకు పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ కోటీ 28 లక్షల రూపాయలను పంపిణీ చేసినట్టు తెలిపింది. వీటిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించినప్పుడు.. ఆయా కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పంపిణీ చేశారని తెలిపింది. ఇలా.. మొత్తం 73 కుటుంబాలను పవన్ పరామర్శించారని.. ఆయా కుటుంబాలకు లక్ష చొప్పున ఇచ్చారని పేర్కొంది.
ఇక, ఈ ఏడాది కాలంలో జనసేన తరపున ప్రచారం లేదా.. సభల నిర్వహణకు వస్తూ.. ప్రమాదాయాల్లో గాయపడి మరణించిన వారి కుటుంబాలకు కూడా పవన్ ఆర్థిక సాయం అందించారని తెలిపింది. మొత్తం 11 మంది కార్యకర్తలు.. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని.. వీరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం 55 లక్షలను ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయంగా అందించినట్టు పేర్కొంది.
తాజా సాయం ఇదే..
ఈ ఏడాది వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన 11 మంది జనసేన క్రీయాశీలక సభ్యుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.55 లక్షల ఆర్థిక సహాయాన్ని పవన్ అందించారు. కుటుంబ సభ్యులకు ఆయా బీమా చెక్కులను అందజే శారు. సాయం పొందిన వారు పవన్ ఆర్థిక సాయం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. మరికొంత మంది అయితే జనసేన అధినేత సాయం పట్ల భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటలోను జనసేన పార్టీ అధికారిక ఖాతాల ద్వారా సోషల్ మీడియాలో పెట్టింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates