వైసీపీలో ఇదో కొత్తరాగం. వస్తాడు నారాజు ఈ రోజు.. అంటూ కీలక నేత కోసం పార్టీ ఎదురు చూస్తోందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఎన్నికల సమయంలో ఉన్న నాయకులకే టికెట్లు సర్దలేక.. అందరి నీ సంతృప్తి పరచలేక పార్టీ సతమతం అవుతున్నదన్న విషయం వాస్తవం. కానీ, ఇదే సమయంలో కొత్త నాయకుడు, పైగా ఒక సామాజిక వర్గాన్నిప్రభావితం చేయగల నాయకుడు అనే పేరున్న కీలక నేత కోసం వైసీపీ ఎదురు చూస్తున్నట్టు ప్రచారంలో ఉంది.
ఆయనే కాపు నాయకుడు, వారి రిజర్వేషన్ కోసం ఉద్యమించిన కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనా భం. ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారని తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని.. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చర్చకు వచ్చింది. అయితే.. ఆయన సైలెంట్ అయ్యారు. ఇక, ఇటీవల కాలంలో ఆయన వైసీపీకి అనుకూలంగా ప్రత్యక్ష ప్రకటనలు చేయకపోయినా.. అనుకూలంగా మాత్రం ఉన్నారనేది టాక్.
మరోవైపు.. కాపు నాయకుల్లోనూ ఆయన బలంగానే ఉన్నారు. గత ఎన్నికల్లోతెరచాటున వైసీపీకి అనుకూ లంగా వ్యవహరించారనే టాక్ ఉండనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆయనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని.. వైసీపీ కొంతకాలంగా ఆయనను కోరుతున్నట్టు తెలిసింది. దీనిపై ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. అయితే..ఈ వారంలోగాఏదో ఒకటి తేల్చాలని పార్టీవైపు నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్టు సమాచారం.
దీంతో ఏ క్షణమైనా.. ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని.. ఇటు తాడేపల్లి, అటు తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈయన కోరితే..ఎక్కడ నుంచి ఏ సీటునైనా.. అది అసెంబ్లీ, పార్లమెంటు కావొచ్చు.. దేనినైనా ఇచ్చేందుకు జగన్‌సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు.. కాపు నాయకులను ఆకర్షించేందుకు, ప్రధానంగా జనసేనకు చెక్ పెట్టేందుకు ముద్రగడ వంటిబలమైన నాయకుల కోసం ఎన్నిరోజులైనా వెయిట్‌చేయాలనిచూస్తున్నట్టు సమాచారం. మరి ఆయన ఎప్పుడు వస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates