బోరుగడ్డతో వైసీపీకి సంబంధం లేదా?

బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన యువకుడు. వైసీపీ అధికారం కోల్పోగానే అతని పాపం పండింది. అతనిపై దాదాపు 50కి పైగా కేసులు నమోదు అయ్యాయి. చాలా కాలం జైలులో ఉన్నాడు. ఒక కేసులో బయటకు రాగానే మరో కేసులో అరెస్టు అయ్యాడు. ఇప్పుడు అతను ఎవరికీ కాకుండా పోయాడు.

ఇంతకాలం వైసీపీకి అనుకూలంగా మాట్లాడాడు కదా.. ఆ పార్టీ వ్యక్తే అని సహజంగానే అనుకున్నారు. ఇప్పుడు.. తూచ్.. అతను మా పార్టీ వాడు కాదు.. అంటూ వైసీపీ తేల్చేసింది. అయితే గతంలో తాము అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు, పవన్ ను అనుచితంగా మాట్లాడినపుడు మౌనంగా వైసీపీ ఇప్పుడు అతనితో మాకేం సంబంధం లేదు అనడం ఆశ్చర్యమే మరి. 

బోరుగడ్డ అనిల్ కు తమకు ఎటువంటి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు వైసీపీ సానుభూతి పరుడిగా అతనికి గుర్తింపు ఉండేది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) పార్టీకి చెందిన వ్యక్తిగా కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో చెప్పుకునేవాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక అతను అరెస్టు అయ్యాడు. రౌడీషీట్ కూడా ఓపెన్ అయింది.

అతనిని పరామర్శించడానికి ఒక్క నేత కూడా వెళ్లలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ మునుపటి తరహాలోనే పలువురు నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీంతో వైసీపీ అలెర్ట్ అయింది. అతనితో తమకు ఏ సంభాదము లేదంటూ తేల్చి చెప్పింది. ఇంతకాలం కూటమి నేతలపై ఓ రేంజిలో విరుచుకు పడిన బోరుగడ్డ ఇప్పుడు ఏమి చెబుతాడో చూడాలి మరి.