వినడానికి విచిత్రంగానే ఉన్నా నిజంగా నిజమనే అంటున్నాయి పార్టీ వర్గాలు. విషయం ఏమిటంటే నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు చంద్రబాబునాయుడు గట్టి అభ్యర్ధి కోసం వెతుకుతున్నారని సమాచారం. ఆ అభ్యర్ధి కూడా రెడ్డి సామాజికవర్గం నుండి కావాలని చంద్రబాబు అనుకున్నారట. ఇపుడు నరసరావుపేట నుండి వైసీపీ తరపున డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఎంఎల్ఏగా ఉన్నారు. గోపిరెడ్డిని ఓడించాలంటే టీడీపీ నుండి కూడా బలమైన రెడ్డి సామాజికవర్గంకు చెందిన నేతే అయ్యుండాలన్నది చంద్రబాబు ఆలోచన.
ఎందుకంటే నియోజకవర్గంలో రెడ్లు, బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. రెడ్లలో చీలిక తెస్తేకాని టీడీపీ అభ్యర్ధికి గెలుపు సాధ్యం కాదని సర్వేల్లో తేలిందట. అందుకనే బలమైన రెడ్డి నేత కోసం చూస్తున్నారు. ఇపుడు పార్టీ తరపున ఇన్చార్జిగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు యాక్టివ్ గానే ఉన్నారు. ఈయనతో పాటు డాక్టర్ కే వెంకటేశ్వరరావు, నల్లపాయి రామచంద్రప్రసాద్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళ ముగ్గురిలో టికెట్ ఎవరికి ఇవ్వాలంటే అరవింద్ బాబుకు ఇవ్వటమే న్యాయం. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో బాగా కష్టపడుతున్నారు కాబట్టే.
ఇప్పుడు విషయం ఏమిటంటే నరసరావుపేటలో గెలవటం టీడీపీకి బాగా ప్రిస్టేజి అయిపోయింది. ఎందుకంటే గడచిన నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలిచిందే లేదు. 2004 నుండి టీడీపీ ఓడిపోతునే ఉంది. అందుకనే ఇపుడు జనసేన మద్దతు కూడా ఉన్న కారణంగా ఈ సీటులో టీడీపీ కచ్చితంగా గెలిచి తీరాలన్నది చంద్రబాబు కోరిక. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన సింపతి అరవింద్ బాబుకు ఉంటుందన్న పాయింట్ కూడా పార్టీలో చర్చల్లో ఉంది.
అయినా సరే బలమైన రెడ్డి నేత కోసం చంద్రబాబు చూస్తున్నారు. వైసీపీలో సస్పెండ్ అయిన అట్లా చినవెంకటరెడ్డి టీడీపీ తరపున పోటీచేయాలని అనుకుంటున్నారు. వెంకటరెడ్డి గట్టి నేతనే చెప్పుకోవాలి. అయితే నాన్ లోకల్ కిందకు వస్తారు. బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు రెడ్డి సొంతూరు. అందుకనే ఏమిచేయాలో అర్ధంకాక చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. మరి పార్టీ తరపున అరవింద్ బాబునే పోటీచేయిస్తారా ? లేకపోతే వెంకటరెడ్డిని దింపుతారా ? అదీకాకపోతే చివరి నిముషంలో ఇంకెవరినైనా పోటీచేయిస్తారా అన్నది సస్పెన్సుగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates