ఒకవైపు ఏపీ పోలీసులు బృందాలుగా ఏర్పడి వెతుకులాట. మరోవైపు.. ఎక్కడున్నాడో కూడా.. తెలియని మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి. వరుగా నాలుగు రోజుల నుంచి కూడా.. పోలీసులు వివిధ ప్రాంతాల్లో వెతుకుతూనే ఉన్నారు. అయినా రామకృష్ణారెడ్డి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సంచలనం చోటు చేసుకుంది.. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ.. పిన్నెల్లి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాదులు.. హైకోర్టును ఆశ్రయించారు.
వీరు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మరోవైపు.. పిన్నెల్లి ఆచూకీ వ్యవహారంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరూ ఆయన ఎక్కడ ఉన్నదీ తెలుసుకోలక పోతున్నారు. కొందరు తెలంగాణలోనే ఉన్నారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం పొరుగు దేశానికి వెళ్లిపోయారని చెబు తున్నారు. దీంతో నాలుగు బృందాల పోలీసులు.. పిన్నెల్లి ఆచూకీ కోసం.. గాలిస్తుండడం గమనార్హం. అయితే.. ఆయన ఎక్కడ ఉన్నదీ ఎవరికీ అంతు చిక్కకపోవడం గమనార్హం.
ఈపరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా పిన్నెల్లి తరఫున న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు తిరుగుతున్నారని.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాల ని కోర్టును అభ్యర్థించారు. అయితే.. ఈ విషయాన్ని ముందుగానే ఊహించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ముందస్తు బెయిల్ ఇచ్చే ముందు.. తమవాదనలు కూడా వినిపించుకోవాలని కోరుతూ.. రాష్ట్ర పోలీసుల తోనే పిటిషన్ వేయించింది.
సో.. ఎలా చూసుకున్నా.. పిన్నెల్లి కి బెయిల్ ఇచ్చేందుకు పోలీసులు చెప్పే వాదనను ఎన్నికల సంఘం చెప్పే వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోవైపు.. పోలీసులు.. తీవ్రస్తాయిలో గాలిస్తున్నారు. ఆయనను ఏక్షణమైనా అరెస్టు చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో పిన్నెల్లి వ్యవహారం.. ఆసక్తిగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates