ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా ఉన్న సీఎం జగన్ సోదరి, వైఎస్ ఏకైక కుమార్తె వైఎస్ షర్మిల తాజాగా కంట తడి పెట్టారు. ఏపీ కాంగ్రెస్‌లో తాను ఎందుకు చేరినట్టో చెప్పకొస్తూ.. ఆమె ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఇచ్చిన మాట పట్టుకునే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆమె చెప్పారు. ఈ సమయంలో గద్గద స్వరంతో కన్నీటి పర్యంతమయ్యారు. కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారు.
ఏం జరిగింది?
కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన షర్మిల.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పిం చారు. ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. రాష్ట్రంలో రాజన్న పాలన అందిస్తానని వచ్చిన జగన్.. ఆ మేర కు పాలన అందించడం లేదని షర్మిల పేర్కొన్నారు.ఇలా.. తన పర్యటనలలో వైసీపీ సర్కారును ఇరు కున పెడుతూ వచ్చారు. దీంతో వైసీపీ నుంచి కూడా అదే రేంజ్‌లో విమర్శలు రావడం మొదలయ్యాయి. ఇవి పెరిగి పెరిగి వ్యక్తిగత విమర్శల వరకు దారి తీశాయి.
సొంత పార్టీ పెట్టుకుని.. దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. వైసీపీని వ్యతిరేకించే పార్టీల నుంచి ముడుపులు తీసుకుని.. వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ.. సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు వచ్చాయి. ఇదే సమయంలో సామాజిక వర్గం, భర్త, పిల్లలు.. ఇలా అన్ని కోణాల్లోనూ ఆమెను విమర్శించారు. ఇక, సోషల్ మీడియాలో తీవ్రస్తాయిలో ట్రోల్ చేశారు. ఈ పరిణామాలపై కొన్నాళ్ల కిందట పోలీసులకు కంప్లె యింట్ కూడా ఇచ్చారు. కానీ, మనసులో మాత్రం ఆ బాధ షర్మిలను వేధిస్తూనే ఉంది.
ఇదే.. తాజాగా కన్నీరు రూపంలో ఉబికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయిన అభ్యర్థులతో తాజాగా షర్మిల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఎందుకు పార్టీలో చేరాల్సి వచ్చిందో వివరించారు. ఏపీలో సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని, ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వలేదని, తెస్తామని వైసీపీ చెప్పి తేలేదని.. పేర్కొన్నారు.
అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీపైనా, కేంద్రంలో కాంగ్రెస్ వస్తే..తొలి సంతకం చేస్తామన్న మాట ఇచ్చారు కాబట్టే తానే కాంగ్రెస్‌లోకి చేరానని షర్మిల చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అయితే.. షర్మిలను ఇంత మానసికంగా వేధించి, ఆమె కన్నీరు పెట్టుకునే స్థాయిలో ట్రోల్ చేయడం సీఎం జగన్‌కు మంచిది కాదని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.