రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు.. ఇచ్చే ఆదేశాలు.. చేసే మేళ్లను తప్పుబట్టేవారు.. చాలా మంది ఉన్నారు. అయితే.. వ్యక్తిగతం విషయానికి వస్తే మాత్రం మోడీ ఒకింత ఆదర్శంగానే ఉంటారు. ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపిత మైంది. ఆయన ఎవరితోనూ తన కాళ్లకు మొక్కించుకోరు. ఇది చాలా సందర్భాల్లో కనిపించింది. పార్టీ నేతల్లో చోటా వారు చాలా మంది ప్రధాని మోడీకి పాద నమస్కారం చేసేందుకు ఉత్సాహ పడతారు. కానీ, ఆయన వారిని సున్నితంగా వారిస్తా రు. ఒక సందర్భంలో ఏపీ సీఎం జగన్ కూడా.. పాదనమస్కారం చేసేందుకు ప్రయత్నించారు. కానీ, మోడీ వారించారు. ఇది అప్పట్లో వైరల్ అయింది.
ఇక, పద్మ పురస్కారాలు అందిస్తున్న వేళ గత ఏడాది కూడాపలువురు ఉద్ధండులు ఆయన పాదాలకు నమస్కరించే ప్రయ త్నం చేస్తే.. తాను స్వయంగా సీటులోంచి లేచి వచ్చి.. వారించారు. తాజాగా కూడా ఇలాంటి ఘటనే వైరల్‌గా మారింది. దేశంలో నే తొలి సారిగా జాతీయ సృష్టికర్తల అవార్డులను అందించారు. ప్రధాని మోడీ ఈ అవార్డులను అందించారు. ఈ సందర్భంగా ఓ మహిళ అవార్డును అందుకునే ముందు.. ప్రధాని మోడీ పాదాలకు నమస్కరించబోయింది. అయితే.. ఆమె మహిళ కావడంతో ముట్టుకుని వారించకుండా.. మోడీ తిరిగి ఆమె పాదాలకు నమస్కరించారు.
కొసమెరుపు..
ఇటీవల కాలంలో రాజకీయ నేతలకు, ముఖ్యంగా పార్టీల అధినాయకులకు పాదనమస్కారాలు చేసేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటీవల విశాఖలో సీఎం జగన్‌కు అనకాపల్లి వైసీపీ అభ్యర్థి భరత్ పాదనమస్కారం చేశారు. దీనిని ఆయన వారించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏఐఎస్‌ల నుంచి మంత్రుల వరకు పాదన మస్కారాలు చేయని వారు చాలా తక్కువ మంది ఉంటారు. సో.. ఇలాంటివారికి మోడీ ఆదర్శమనడంలో సందేహం లేదు.