విజయవాడ టీడీపీలో సమష్టి నాయకత్వం పెద్దగా కనిపించడం లేదు. పైగా.. పాత ముఖాలకే మరోసారి టికెట్లు ఇవ్వడం.. యువతను ఆకట్టుకునే వ్యూహాలు లేక పోవడం వంటివి పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇక, సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నామని చెబుతున్న టీడీపీ సీనియర్ నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు ఈ దఫా ఎదురుగాలి వీస్తుండడం గమనార్హం. వాస్తవానికి ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ హోరులోనూ విజయం దక్కించుకున్నారు.
2014 సహా వైసీపీ హవా జోరుగా వీచి.. జగన్ పాదయాత్ర సానుభూతి పెరిగిన 2019 ఎన్నికల్లోనూ గద్దె విజయం సాధించారు. అయితే.. ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో మాత్రం ఈ తరహా గెలుపు ఎంత మాత్రం సులువు కాదని అంటున్నారు పరిశీలకులు. గత రెండు ఎన్నికలకు.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు తేడా ఉందని.. ఇప్పుడు గద్దె రామ్మోహన్‌కు సరైన , ధీటైన ప్రత్యర్థి రంగంలోకి దిగడంతో గద్దెకు ముచ్చెమటలు పడుతున్నాయి. దివంగత కాకలు తీరిన రాజకీయ యోధుడు దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ వైసీపీ తరఫున తూర్పు నుంచి పోటీ చేస్తుండడాన్ని ప్రస్తావించారు.
2019లో కార్పొరేటర్ స్థాయి వ్యక్తి బొప్పన భవకుమార్.. వైసీపీ తరఫున పోటీ చేశారు. దీంతో గద్దె ఏకపక్షం గానే విజయం దక్కించుకున్నారు. ఇక, 2014లో కాపు సామాజిక వర్గం నేత వంగవీటి రాధాపై సామాజిక వర్గం కార్డును అడ్డు పెట్టుకుని ( అప్పుడు జనసేన సపోర్ట్ కూడా ఉంది) గెలుపుగుర్రం ఎక్కారు. ఈ రెండు సార్లు కూడా గద్దెకు వచ్చిన మెజారిటీ కేవలం 15000 ఓట్లు అటు ఇటు మాత్రమే. అయితే.. ఇప్పుడు ఈ తరహా విజయం గద్దెకు దక్కే పరిస్థితి లేదు.
దీనికి కారణం.. గత కొన్ని దశాబ్దాలుగా తూర్పు నియోజకవర్గం ప్రజలతో మమేకమైన దేవినేని నెహ్రూ వారసుడు దేవినేని అవినాష్ వైసీపీ తరఫున ఇక్కడ పోటీ చేయనున్నాడు. ఈ సారి నియోజకవర్గంలో కమ్మ, కాపు లాంటి బలమైన కులాల్లోనే కాదు.. అన్నీ కులాల్లో ఉన్న యూత్‌లో అవినాష్‌కు ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఇక దేవినేని ఫ్యామిలీ అభిమానులు గుండుగుత్తగా అవినాష్‌కే మద్దతు పలకడం ఖాయమని అంటున్నారు.
ఇక, గత ఎన్నికల్లోనూ సానుభూతిని తనవైపు తిప్పుకొని గెలిచిన గద్దెకు ఇప్పుడు అది కూడా దూరం కానుంది. ఉదాహరణకు 1994లో గన్నవరం నుంచి ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేశారు. అప్పట్లో ఆయనకు అన్న ఎన్టీఆర్ టికెట్ నిరాకరించారు. దీంతో ఇండిపెండెంటుగా నిలిచిన గద్దె సానుభూతి డ్రామా కోసం ప్రయత్నించారు. అప్పట్లో టీడీపీ తరపున పోటీ చేసిన దాసరి బాల వర్ధనరావుపై లేని పోని ఆరోపణలు చేసి.. సానుభూతి పొందారు. తనవర్గంపై దాడి చేశారని, తమను నియోజకవర్గంలో తిరగ నివ్వడం లేదని ఆయన చెప్పి.. ప్రజల మెప్పుపొంది.. ముక్కుతూ మూలుగుతూ విజయం దక్కించుకు న్నారు.
ఇక, 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచే పోటీ చేసిన గద్దె రామ్మోహన్‌రావు.. అప్పట్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన దివంగత దేవినేని నెహ్రూను ఓడించేందుకు అనేక డ్రామాలు తెరమీదికి తెచ్చారు. పోలింగ్‌కు ముందు రోజు.. దేవినేని నెహ్రూ తన ఇంటిపైకి దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ.. పెద్ద యాగీ చేశారు. ఆయనను నెగటివ్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది అప్పట్లో దేవినేనిపై స్వల్ప ప్రభావం చూపించడంతో కేవలం 190 ఓట్ల తేడాతో విజయానికి దూరమయ్యారు.
అయితే. ఇప్పుడు ఇలాంటి సానుభూతి, సెంటిమెంటు పవనాలు ఏవీ లేవు. అన్నింటికి మంచి తూర్పు నియోజకవర్గ ప్రజలు గద్దేకు రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే చేసిన అభివృద్ధి జీరో. కొండ ప్రాంతాలు, గుణదలతో పాటు అనేక బస్తీల్లో సమస్యలు కోకొల్లులుగా అలాగే ఉన్నాయి. అసలు గద్దే ఏనాడు తిరగని డివిజన్లలో ప్రతి వీథివీథికి వెళ్లిన అవినాష్ సమస్యలు తీర్చడమే ఇక్కడ హైలెట్. ఏదేమైనా ఈ సారి గద్దె అవినాష్ మీద గెలిచేందుకు గింగరాలు కొడుతోన్న వాతావరణమే తూర్పులో కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates