Political News

బండికి 14 రోజుల క‌స్ట‌డీ

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కు కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సంజయ్‌ సహా కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్‌, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్‌కు ఈ నెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిం చింది. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన ఉద్రిక్తత ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. రెండో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సంజయ్‌కి కోర్టు రిమాండ్ …

Read More »

రేవంత్ రెడ్డి.. సొంత ఛానెల్

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి ఊహించిన స్థాయిలో మీడియా మ‌ద్దతు ఉండ‌డం లేదా? అందుకే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఓ ఛానెల్ పెట్టేందుకు సిద్ద‌మ‌వుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. రాజ‌కీయాల్లో నిల‌బ‌డాలంటే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉండాలి. కానీ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు చేరువ కావాలంటే అందుకు మీడియా ఓ సాధ‌నంగా ఉప‌యోగ‌ప‌డుతోంది. ఇప్పుడు మీడియా పెద్ద‌ల ఆశీర్వాదం రాజ‌కీయ పార్టీల‌కు ఎంతో అవ‌స‌రం. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన రేవంత్ …

Read More »

కేసీఆర్ కి, డీజీపీ అమ్ముడుపోయాడు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనపై పెట్టిన సెక్షన్లపై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఆయనకు రిమాండ్ విధిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు ఇవ్వగా.. కరీంనగర్ జిల్లా కోర్టులో సవాలు చేయడం.. అక్కడా ఎదురు దెబ్బ తగిలి.. పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ నిర్ణయం రావటంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా …

Read More »

షర్మిల సంచలనం.. ఏపీలో పార్టీ

మొండితనంలో  తాత రాజారెడ్డి నోట్లో నుంచి పుట్టినట్లుగా.. పట్టుదల విషయంలో తండ్రి వైఎస్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా వ్యవహరిస్తారని చెప్పే వైఎస్ షర్మిల మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. త్వరలో ఆమె ఏపీలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేత రాసిన కాలమ్ లో పేర్కొనటం.. దానిపై వైసీపీ నేతలు ఎవరూ స్పందించకపోవటం తెలిసిందే. ఇదిలాఉంటే.. సదరు మీడియా …

Read More »

తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఏపీలో 100 ఎకరాలు

రాజుగారి చిన్న భార్య మంచిదంటే.. పెద్ద భార్య.. సామెతలా కూడా కాకుండా సుత్తి లేకుండా స్ట్రెయిట్ గా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఏపీ లోని పరిస్థితిని చెప్పకనే చెప్పేశారు. తెలంగాణ గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నంలో.. ఏపీలోని వాస్తవ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనే …

Read More »

వంగవీటి రెక్కీపై తేల్చేసిన పోలీసులు

వంగవీటి రాధాను చంపేందుకు రెక్కీ నిర్వహించారనే విషయంలో ఆధారాలు లేవు.. ఇది తాజాగా పోలీసులు తేల్చిన విషయం. విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా మీడియాతో మాట్లాడుతూ తనను చంపటానికి రెక్కీ నిర్వహించారని వ్యాఖ్యలు చేసిన రాధా అందుకు తగ్గ ఆధారాలను తమకు ఇవ్వలేదని చెప్పారు. వారం రోజుల క్రితం తనను అంతం చేయటానికి రెక్కీ నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాధా వ్యాఖ్యలతో విజయవాడలో …

Read More »

గెలుపు బీజేపీదే కానీ…

రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వివిధ పార్టీలు ఎంతగా పోరాడుతున్నాయో అందరు చూస్తున్నదే. ఈ నేపధ్యంలో పార్టీలు కావచ్చు లేదా మీడియా సంస్ధలు కూడా కావచ్చు ప్రజల నాడిని తెలుసుకునేందుకు సర్వేల మీద సర్వేలు చేయించుకుంటున్నాయి. తాజాగా టైమ్స్ నౌ-నవభారత్ మీడియా కోసం వీటో అనే సంస్ధ సర్వే నిర్వహించింది. పోయిన నెల 14-30 తేదీల మధ్య రాష్ట్రం మొత్తం తిరిగి వీటో సంస్ధ సర్వే నిర్వహించింది. …

Read More »

మోడీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా ?

నరేంద్ర మోడీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా ? అవుననే అనిపిస్తోంది క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. అప్పుడు మూడు వ్యవసాయ చట్టాలకు చేసిన తప్పునే ఇపుడు అమ్మాయిల వివాహ వయస్సు విషయంలో కూడా చేస్తున్నారు. ముందుగా నిర్ణయం తీసేసుకోవటం తర్వాత వివాదం రేగగానే దానిపై అద్యయనానికి కమిటి వేయటం మోడీ ప్రభుత్వానికి ఇది రెండోసారి. పైగా ఇపుడు నియమించిన కమిటిలో కేవలం ఒకే ఒక్క  మహిళా ఎంపిని నియమించటం …

Read More »

జగన్‌తో ట్వంటీ22 ఆడనున్న పరిస్థితులు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం, పాలక పార్టీ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సుదీర్ఘకాలం పాలనలో ఉంటే వచ్చే స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత… నాయకత్వ లేమితో వచ్చే స్థాయిలో పాలక పార్టీలో వర్గ పోరు అక్కడ కనిపిస్తున్నాయి. మూడేళ్ల వయసు ప్రభుత్వానికి ఎదురవ్వాల్సిన పరిస్థితులు… పదేళ్ల వయసున్న పార్టీలో జరగాల్సిన పరిణామాలు కావివి. కానీ, ఏపీలోని జగన్ ప్రభుత్వం… ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం.ఈ నేపథ్యంలో ఏపీ …

Read More »

జగన్ ఢిల్లీ టూర్.. ఎవరెవరిని కలుస్తున్నారు?

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో ఏపీ బీజేపీ నేతలు జగన్ పాలనపై విరుచుకుపడటమే కాదు.. రెండు పార్టీల మధ్య లడాయి మోతాదు మించిన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి మరో ఒకట్రెండు నెలల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయన్న అంచనా ఒకవైపు.. సీఎం జగన్ మీద ఉన్న అవినీతి కేసులకు సంబంధించి అంశం ఏదైనా తెర మీదకు వస్తుందన్న మాటతో …

Read More »

జగన్ – షర్మిల మధ్య వాదులాట?

మరే మీడియా సంస్థ ప్రస్తావించని అంశాల్ని తన కాలమ్ లో చెప్పే గుణం ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ వేమూరి రాధాక్రిష్ణకు అలవాటన్న సంగతి తెలిసిందే. ప్రతి వారాంతంలో తాను రాసే పొలిటికల్ కామెంటరీ ‘కొత్త పలుకు’లో ఆయన పలు సంచలన అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. గత వారం ఆయన తన కాలమ్ లో.. క్రిస్మస్ ముందు రోజు రాత్రి కడప జిల్లాలోని వైఎస్ కుటుంబానికి చెందిన ఇడుపులపాయ గెస్టు హౌస్ …

Read More »