వరుసగా మూడోసారి కూడా ప్రధాని పీఠం నరేంద్ర మోడీకే దక్కనుందని తాజాగా ఓ సర్వే తేల్చి చెప్పింది. దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి పేరున్న ఆసియానెట్ న్యూస్ ‘మూడ్ ఆఫ్ ది నేష న్` సంస్థ నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ప్రజలు మోడీవైపే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ప లు అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సర్వే సాగడం గమనార్హం. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమా రి వరకు జరిగిన సర్వేలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీవైపే మెజారిటీ ప్రజలు మొగ్గు చూపినట్టు సర్వే సంస్థ వెల్లడించింది.
అంతేకాదు.. పలు అంశాల విషయంలోనూ ప్రజలు మోడీవైపే నిలబడినట్టు సర్వే తేల్చి చెప్పింది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారా? ప్రధాని నరేంద్ర మోడీ వైపు ఉన్నారా? అనేది ఈ సర్వేలో ప్రధానంగా ప్రస్తావించినట్టు సర్వే సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్ పేర్కొంది. మొత్తంగా 79 శాతం మంది ప్రజలు మరోసారి ప్రధాని పీఠం ఎక్కేది.. నరేంద్ర మోడీనేనని తేల్చి చెప్పారు. అయితే.. ఆయనను వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. ఉన్నప్పటికీ 30 శాతంలోపే ఉండడం గమనార్హం.
ఇతమిత్థంగా.. ఇదీ రిజల్ట్
+ ఇటీవల తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ప్రధాని మోడీకి ప్లస్ అవుతుందని 51.1 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.
+ ఇదే పౌరసత్వ సవరణ చట్టం ప్రతికూల ప్రభావం చూపవచ్చని 26.85 శాతం మంది ప్రజలు అభిప్రాయ పడ్డారు.
+ జాతీయ రహదారులు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు ఇలా.. మౌలిక వసతలు అభివృద్ధి పనులు నరేంద్ర మోడీకి పెద్ద విజయంగా మారనున్నాయని 38.11 శాతం మంది అభిప్రాయపడ్డారు.
+ డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్ కీలకమని 26.41 మంది, ఆత్మనిర్భర్ భారత్ అతిపెద్ద కార్యక్రమమని 11.46 శాతం మంది అభిప్రాయపడ్డారు.
+ ఇక, బీజేపీ ఆది నుంచి విశ్వసిస్తున్నట్టు అయోధ్య రామమందిర నిర్మాణం.. విగ్రహ స్థాపనకు 30.04 శాతం మంది ప్రజలు జై కొట్టారు.
+ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అంశంగా రామమందిర్ అంశం నిలుస్తుందని దేశవ్యాప్తంగా 57.16 శాతం మంది అభిప్రాయపడ్డారు.
+ ఇక, ఇప్పుడున్న కీలక నాయకుల్లో ప్రధాని ఎవరు అనే ప్రశ్నకు మోడీనే అని 51.06 శాతం మంది ఆయనకే మొగ్గుచూపారు. 46.45 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైపు మొగ్గు కనబరిచారు.
+ కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి.. మోడీని నిలువరించడం కష్టమనే అభిప్రాయం 60.33 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. కేవలం 32.28 శాతం మంది మాత్రమే మోడీని తట్టుకునే పార్టీగా కాంగ్రెస్‌ను పేర్కొనడం గమనార్హం.
+ పార్లమెంటు ఎన్నికలపై భారత్ జోడో యాత్ర(రాహుల్ చేపట్టింది) ప్రభావం పడుతుందని 54.76 శాతం మంది అభిప్రాయపడినా.. అది ఓటు బ్యాంకు గా మారడం కష్టమని 38.21 శాతం మంది అభిప్రాయపడ్డారు.