Political News

సునీల్ దేవధర్.. ఏపీలో ఎందుకు ఫెయిలయ్యారు?

తెలంగాణలో తొడ కొడుతున్న బీజేపీ ఏపీలో మాత్రం నీరసంగా అడుగులు వేస్తోంది. అక్కడి నాయకుల్లోనే ఆ నీరసం ఉండగా వారిని నడిపించడానికి నియమించిన ఏపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ మరింత నీరసంగా మారి ఇటువైపు చూడడమే మానేశారు. ఇక సహాయ ఇంచార్జి సునీల్ దేవధర్ కూడా ఏపీ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే సునీల్ దేవధర్‌కు ఇది ఫస్ట్ ఫెయిల్యూర్. 2018 జులైలో ఏపీ బీజేపీ వ్యవహారాల సహాయ …

Read More »

మారిన గేమ్ ప్లాన్.. టీడీపీ ఎదురుదాడి

టీడీపీ గేమ్ ప్లాన్ మార్చింది. అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ అన్న నిర్ణయానికి వచ్చింది. తొక్కిసలాట సంఘటనలను తొలుత దుర్ఘటనలుగా భావించిన టీడీపీ ఇప్పుడు అసలు సంగతి అర్థం చేసుకుని డైరెక్టుగా వైసీపీని అటాక్ చేస్తోంది.. చంద్రబాబు నాయుడు కందుకూరు రోడ్ షోలో ఎనిమిది మంది చనిపోయారు. తక్షణమే స్పందించిన టీడీపీ అధినేత బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు భారీగా ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి …

Read More »

మోదీ కేబినెట్లోకి సీఎం రమేశ్, బండి సంజయ్?

ఏపీ, తెలంగాణలో బీజేపీ నేతలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో కేంద్ర మంత్రివర్గాన్నివిస్తరిస్తారనే అంచనాలు వినిపిస్తున్న తరుణంలో ఏపీ నుంచి ఒకరికి.. తెలంగాణ నుంచి ఒకరికి మోదీ కేబినెట్లో చోటు దొరుకుతుందని దిల్లీ వర్గాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో చేయాలనుకుంటున్న ఈ విస్తరణతో తెలుగు రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. అదే జరిగితే …

Read More »

‘మా ఆయన పార్టీ మారితే నేనూ మారాల్సిందే’

ఏపీ మాజీ హోం మంత్రి, మహిళా దళిత నేత మేకతోటి సుచరిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలోనే కాదు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రాజకీయంగా తమ ప్రయాణం వైసీపీతోనే అని చెప్తూనే తన భర్త నిర్ణయమే తన నిర్ణయమని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న సుచరిత ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారా అనేది చర్చనీయమవుతోంది. తానొక పార్టీలో తన భర్త ఇంకో పార్టీలో ఉండబోమని …

Read More »

దొంగగా మారిన ఏపీ కాంట్రాక్టర్

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చాక తమ పంట పండినట్లే అనుకున్నారు ఆ పార్టీ మద్దతుదారులైన కాంట్రాక్టర్లు. గతంలో వైఎస్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా.. కాంట్రాక్టర్లు మామూలుగా సంపాదించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ, వైఎస్ సన్నిహితులు అప్పట్లో ఎంతో బాగుపడ్డారు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్ల ముఖాల్లో కళ పోయింది. పెద్ద పెద్ద కాంట్రాక్టులు దక్కించుకున్న బడా బాబులకే ఢోకా లేకపోయింది …

Read More »

ఎవరిది రౌడీయిజం? ఎవరిది అరాచకం?

కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలనేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుదల.. అది సాధ్యమయ్యే సూచనలు లేకపోవడంతో ఇప్పుడు ఏకంగా కుప్పంలో చంద్రబాబు పర్యటననూ అడ్డుకున్నారంటున్నారు టీడీపీ నేతలు. కుప్పంలో బుధవారం చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రెండో రోజూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పోటాపోటీగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబులు మీడియా సమావేశాలు పెట్టి …

Read More »

ఏపీలో వ‌లంటీర్ల వేత‌నం 15 వేలు.. మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వానికి అన్నీ తామై వ్య‌వ‌హ‌రిస్తున్న వ‌లంటీర్ల విష‌యంలో అమ‌లాపురం ఎమ్మెల్యే, మంత్రి పినిపే విశ్వ‌రూప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం వారికి ఇస్తున్న రూ.5000ల‌ను త్వ‌ర‌లోనే 15000కు పెంచుతామ‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. దీనికి ఆయ‌న ఒక కండిష‌న్ పెట్టారు. ఆ కండిష‌న్‌ను వ‌లంటీర్లు నెర‌వేర్చితే.. ఖ‌చ్చితంగా వారి వేత‌నం మూడు రెట్లు అవుతుంద‌ని చెప్పారు. ఇంత‌కీ ఆ కండిష‌న్ ఏంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో …

Read More »

సేవ చేయాలనుకున్నారు… బోల్తా పడ్డారు…

గుంటూరులో సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమం విషాదంగా మారిన సంగతి తెలిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు చనిపోయారు. మిస్ మేనేజ్ మెంట్ కారణంగా గందరగోళ పరిస్థితి ఏర్పడి తొక్కిసలాట జరిగిందని నిర్ధారించారు. ఉయ్యూరు ఫౌండేషన్ తరపున ఉయ్యూరు శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మృతుల కుటుంబాలకు శ్రీనివాసరావు తక్షణమే 20 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు వైసీపీ …

Read More »

రామనాథం దారెటు…

జగన్మోహన్ రెడ్డి శీతకన్నేసిన రావి రామనాథం బాబుకు ఇప్పుడు దిక్కుతోచడం లేదు. పార్టీలో తన పరిస్థితేమిటో అర్థం కాక ఆయన నానా తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలన్న తన కోరిక తీరే అవకాశం కనిపించడం లేదని రామనాథం బాబు ఆవేదన చెందుతున్నారు. విత్తనాల వ్యాపారం చేసే రావి రామనాథం బాబు 2018లో వైసీపీలో చేరారు. పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేయాలన్న ఉద్దేశంలో అక్కడ పనులు చేసుకుంటూ పోయారు. …

Read More »

‘గుడ్‌మార్నింగ్’ చెప్పావని గుడ్డిగా ఓట్లేస్తారా కేతిరెడ్డీ?

‘మెరిసేదంతా బంగారం కాదు’ అనే సామెత రాజకీయాల్లో చాలామంది పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి కూడా ఇది కరెక్టుగా సరిపోతుందట. పొద్దున్న లేవగానే ‘గుడ్‌మార్నింగ్ ధర్మవరం’ అంటూ కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారు నుంచి దిగి రెండు మూడు గంటల పాటు కేతిరెడ్డి చేసే హడావుడిని ఫేస్‌బుక్ లైవ్‌లో వేలమంది చూస్తుంటారు. ధర్మవరం నియోజకవర్గానికి చెందని లక్షలాది మంది కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి బీభత్సమైన ఫ్యాన్స్‌గా …

Read More »

‘జగన్ వల్లే కాలేదు.. కేసీఆర్‌తో ఏమవుతంది?’

ఏపీలో బీజేపీ సీనియర్లు పవన్ కల్యాణ్‌పై గట్టిగానే ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. తమ సొంత బలం కంటే పవన్ బలంతో ఏపీని ఏలగలమని నమ్ముతున్నట్లుగా కనిపిస్తున్నారు. బీజేపీలో ఉండీ ఉండనట్లుగా ఉంటున్న కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల పవన్‌కు అండగా ఉంటానంటూ బహిరంగంగా మద్దతు ప్రకటించగా.. తాజాగా మరో నేత కూడా పవన్ పక్షం వహించారు. బీఆర్ఎస్ ఏపీలో కాపులను ఆకర్షిస్తూ పవన్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని, పవన్‌ను ఎవరూ ఏమీ …

Read More »

సాయిరెడ్డి బాధ్యతలు సజ్జల కొడుక్కి..

వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం, పట్టు క్రమంగా తగ్గుతోందా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీకి చెందినవారు. ఇప్పటికే విజయసాయిరెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి ఓవర్టేక్ చేశారని… సాయిరెడ్డి మేకపోతు గాంభీర్యంతో నెట్టుకొస్తున్నారని అంటున్నారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో సాయిరెడ్డి చేతిలో ఉన్న కొద్దిపాటి పవర్స్ కూడా పోయే పరిస్థితి వచ్చిందంటున్నారు. వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలన్నీ తానే చూస్తున్నారు విజయసాయిరెడ్డి. దీనికోసం ఆయన …

Read More »