సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై ఆదారపడిన వారు.. ఈ పింఛను సొమ్మును పెంచాలని కోరుకుంటు న్నారు. ఈ విషయాన్ని పసి గట్టిన టీడీపీ అదినేత చంద్రబాబు.. ప్రస్తుతం ఉన్న పింఛనును రూ.3000 నుంచి 4000లకు పెంచుతామని.. అధికారంలోకి రాగానే ఇచ్చి తీరుతామని చెప్పారు. ఇంటింటికీ పంపిస్తామని.. ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని కూడా చెప్పారు.
ఈ విషయాన్ని కూటమి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్‌గా ఉంటుందని కూడా.. చంద్రబాబు తెలిపారు. అయితే .. దీనికి మరింతగా వైసీపీ మేనిఫెస్టో లో ప్రకటిస్తారని అందరూ ఆశించారు. చంద్రబాబు రూ.4 వేలు ప్రకటి స్తే.. జగన్ కనీసంలో కనీసం రూ.5 వేలైనా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. దీనిపైనే గ్రామీణ ప్రాంతాల్లోనూ చర్చ సాగింది. అయితే.. జగన్ మాత్రం ఈ పింఛన్ పెంపుపై బాంబు లాంటి వార్త పేల్చారు. ప్రస్తుతం ఇస్తున్న పింఛనును రూ.3000 అలానే కొనసాగిస్తామని చెప్పారు.
అయితే.. రూ.500 పెంచుతామనిచెప్పినా.. ఇప్పటికిప్పుడు మాత్రం పెంచేది లేదన్నారు. 2028వ సంవత్సరంలో రూ.250, 2029లో(ఎన్నికల సంవత్సరం) రూ.250 పెంచుతామని చెప్పారు. ఇది మెజారిటీ పింఛను దారుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. మరోవైపు.. చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాదు.. రాకుండానే ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని.. రూ.4000 చొప్పున సామాజిక పింఛనును అందిస్తా మని చెబుతున్నారు.
ఇక, దివ్యాంగుల పింఛన్లను చంద్రబాబు ప్రత్యేకంగా రూ.6లకు పెంచుతామని చెబితే.. జగన్ మాత్రం అసలు వీరి ఊసు కూడా ఎత్తకపోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. పింఛన్ల వ్యవహారం.. ఎ న్నికలను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఇప్పటి వరకు వైసీపీ వేసుకున్న గెలుపు అంచనాలను తలకిందలు చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో వైసీపీ ఈ పింఛన్ల పెంపుపైనే గెలుపు గుర్రం ఎక్కింది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టడంతో పార్టీకి ఇబ్బంది తప్పదనే అంటున్నారు పరిశీలకులు.