బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని అమ‌లు చేస్తామ‌ని కూడా చెబుతున్నారు. వీటిలో ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం.. నెల‌నెలా రూ.1500, మాతృవంద‌నం కింద రూ.15000 ఎంత మంది ఉన్నా ఇస్తామ‌ని చెబుతున్నారు. ఇలా.. మొత్తంగా చంద్ర‌బాబు సూప‌ర్ సిక్స్ ఒక రేంజ్‌లో అయితే.. ప్ర‌జ‌ల‌పై క‌న‌క వ‌ర్షం కురిపిస్తోంది.

ఇక‌, తాజాగా వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ ప్ర‌వేశ పెట్టిన ‘న‌వ‌ర‌త్నాలు 2.0’ను గ‌మ‌నిస్తే.. సంచ‌ల‌న ప్ర‌క‌టన‌లు ఏమీ క‌నిపించ‌డం లేదు. పైగా.. ప్ర‌స్తుతం ఉన్న వాటినే కొన‌సాగిస్తామ‌ని.. వాటిని పూర్తి చేస్తామ‌ని అంటున్నారు. అంటే.. ఒక ర‌కంగా.. ఆయ‌న ప్ర‌త్యేకంగా ఇస్తున్న‌ది ఏమీ కనిపించ‌డం లేదు. మొత్తంగా చూస్తే ఇప్ప‌టికిప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు వ‌స్తే.. ప్ర‌జ‌ల‌కు మేళ్లు పాత‌వే కొన‌సాగుతాయి త‌ప్ప‌.. కొత్త‌గా వ‌చ్చేవి అంటూ ఏమీ ఉండ‌వు.

ఈ ప‌రిణామమే.. ఆలోచ‌న‌కు గురిచేస్తోంది. అయితే.. సూప‌ర్ సిక్స్‌లో మ‌రో కీల‌క హామీ కూడా.. ఉంది. ఏటా 4 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌న‌తో పాటు మెగా డీఎస్సీపై తొలి సంత‌కం అన్న చంద్ర‌బాబు హామీ కీల‌కంగా మారింది. కానీ, జ‌గ‌న్ ఇలాంటి సంచ‌ల‌న ఉద్యోగ హామీని ఇవ్వ‌లేక పోయారు. మొత్తంగా చూస్తే.. సూప‌ర్ సిక్స్‌తో పోలిస్తే.. న‌వ‌ర‌త్నాలు 2.0 తేలిపోతున్నాయ‌నే చెప్పాలి. ఎంత విశ్వ‌స‌నీయత ఉన్నా.. ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ప్ర‌భుత్వాల నుంచి ఆశించ‌కుండా ఉండ‌రు.

సో.. ఇలా చూసుకున్న‌ప్పుడు.. చంద్ర‌బాబు వైపే మెజారిటీ ఓట‌ర్లు మొగ్గు చూపించే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కూట‌మి ప్ర‌భుత్వం రాగానే రూ.4000 పింఛ‌ను క‌ళ్ల ముందు క‌నిపిస్తుంద‌న్న ఆశ వారిని ఆదిశ‌గా నడిపించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.