బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ను ఇంతకాలం జగన్‌కు అత్యంత ప్రీతిపాత్రుడిగా భావించేవారు చాలామంది. ఆయన రాజకీయ ప్రత్యర్థులు, ఆయన అనుచరులు, వైసీపీలోని ఇతర నేతలు, చివరకు అధికారులు కూడా ఆయన జగన్‌కు అత్యంత ఇష్టుడని.. జగన్ నుంచి ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉందని భావించేవారు. అందుకు తగ్గట్లుగానే నియోజకవర్గంలో.. సొంత జిల్లాలో ఆయన హవా నడిచింది. కానీ, గత కొన్నేళ్లుగా నందిగం సురేశ్‌ను ఇంటాబయటా అంతా లైట్‌గా తీసుకుంటున్నట్లు టాక్. …
Read More »రేపల్లెలో రెడీ అవుతున్న మోపిదేవి కుమారుడు
నాయకులంతా తమ వారసులను రంగంలోకి దించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా అదే రూట్లో కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని అసెంబ్లీ బరిలో దించడానికి ఆయన పావులు కదుపుతున్నట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, …
Read More »ఈ ఫోటోలు చూశాక ఏమైనా అర్థమైందా గుడివాడ అమర్నాథ్?
ఏదైనా చెబితే అతికినట్లుగా ఉండాలి. అబద్ధాన్ని సైతం అడ్డగోలు వాదనతో వినిపించటంలో మాత్రం ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ముందుంటారన్న మాట ఏపీ ప్రజలు ఎక్కువగా అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే తాజా పరిణామాలు ఉన్నాయని చెప్పాలి. తన తప్పుల్ని కవర్ చేసుకోవటానికి ఆయన వినిపించే వాదన విన్నోళ్లంతా నోరు నొక్కుకునే పరిస్థితి. అయినప్పటికీ వెనక్కి తగ్గని మంత్రిగారు తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఫోటోలను …
Read More »అన్నదమ్ముల ‘రాజకీయం’.. ఇరకాటంలో వైసీపీ!
చాలా మంది అన్నదమ్ములు, తల్లీ కుమార్తెలు కూడా రాజకీయం చేస్తున్నారు. అయితే.. అందరూ ఒకే పార్టీలో ఉన్నారు. ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో దామచర్ల జనార్దన్, సత్యలు టీడీపీలోనే ఉన్నారు. శ్రీకాకులంలో ప్రతిభా భారతి, గ్రీష్మలు కూడా టీడీపీలోనే ఉన్నారు. అయితే.. వైసీపీ విషయానికి వస్తే మాత్రం కొంత భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. వైసీపీలో ఉన్న వారిలో ఒకరు టీడీపీలో ఉంటే.. మరొకరు వైసీపీలో ఉన్నారు. దీంతో రాజకీయాలు …
Read More »గాంధీ భవన్ షాక్‌కు గురైంది..
గాంధీ భవన్ షాక్‌కు గురైంది.. మెట్లెక్కనన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నడుచుకుంటూ లోనికి వచ్చేయడంతో ఆశ్చర్యపోయింది. అంతేకాదు.. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు చెవులు కొరుక్కుంటూ గుసగులాడుకుంటూ మంతనాలు జరుపుకోవడంతో అక్కడున్న కాంగ్రెస్ నాయకులంతా ఏం జరుగుతోందో అర్థంకాక ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇదంతా చూసి పాత కాపు వి.హనుమంతరావు కొత్తగా అలక మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో శుక్రవారం సాయంత్రం అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర …
Read More »లోకేశ్ పాదయాత్రకు అనుమతి ఇస్తారా? ఇవ్వరా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. పాదయాత్ర ఏఏ నియోజకవర్గాలలోంచి వెళ్లాలి.. ఎన్ని రోజులు సాగాలి వంటివన్నీ ఇప్పటికే నిర్ణయించుకోవడంతో అనుమతులు రాగానే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవడానికి టీడీపీ రెడీ అవుతోంది. అనుమతుల కోసం టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్ వర్ల రామయ్య జనవరి 12న ఏపీ డీజీపీ, హోం శాఖ సెక్రటరీ చిత్తూరు ఎస్పీలను అనుమతి కోరుతూ లేఖలు …
Read More »మాజీ సీఎం కుమారుడికి గెలిచే సీన్ ఉందా?!
ఆయన పేరుకు మాజీ సీఎం కుమారుడు. కానీ, రాజకీయాల్లో అనుభవం తక్కువ. పైగా ఎక్కువ కాలం విదేశాల్లో ఉండి వచ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం లోకల్ పాలిటిక్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఆయనే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత నేదురు మల్లి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి రాజ్యలక్ష్మిల కుమారుడు రామ్. నిజానికి కాంగ్రెస్ హయాంలో దంపతులు ఇద్దరూ చక్రం తిప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి …
Read More »ఏపీ, తెలంగాణలకు మోడీ చురకలు
ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యూహాలకు పదును పెంచారా? వచ్చే మేలో జరగనున్న కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన రెండు తెలుగు రాష్ట్రాలుసహా.. దక్షిణాదిలో పాగా వేసేలా తన కార్యాచరణను రెడీ చేసుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పుడు మోడీకి అత్యంత కీలకమైన సంవత్సరం నడుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. దీంతో మోడీ.. తాజాగా కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్భంగా …
Read More »‘యువగళం’ పై టెన్షన్ .. టీడీపీ ఏం చేయనుంది?
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో వారంలో యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నాఉరు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభించే ఈ యాత్ర.. ఇచ్ఛాపురం వరకు సాగనుంది. మొత్తం 4 వేల కిలో మీటర్లు, 4 వందల రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, బలమైన …
Read More »కట్టడి చేస్తుందా? పరిస్థితి చేయి దాటి పోతుందా?
ఆధిపత్య పోరు అధికార పార్టీకే కాదు.. విపక్షంలోనూ ఉంటుందా ? టీడీపీ నేతలు రోడ్డున పడి కొట్టుకుంటున్నారా ? పార్టీ గెలవకముందే పచ్చ చొక్కాలు పదవులు పంచుకుంటున్నాయా ? అచెన్న, గంటా, అయ్యన్న ఇంకెందరో ఆశలు పెట్టుకుని ఉన్నారా ? వారిని పార్టీ కట్టడి చేస్తుందా ? పరిస్థితి చేయి దాటి పోతుందా ? పార్టీలో అంతర్గత కుమ్ములాటపరస్పర దూషణలు దిగిన నేతలుగంటా ఏమైనా పెద్ద నాయకుడా అని ప్రశ్నించిన …
Read More »కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన కుమారస్వామి
ఖమ్మంలో బీఆర్ఎస్ సభ నిర్వహించి రెండు రోజులవుతున్నా కేసీఆర్ కోరుకున్న బజ్ ఎక్కడా కనిపించడం లేదు. జనాన్ని తేగలిగినా జనంలో ఊపు మాత్రం తేలేకపోయారన్నది ఖమ్మం సభ తరువాత వినిపిస్తున్నమాట. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలకు చెందిన, ఇతర పార్టీలరకు చెందిన నాయకులపై కేసీఆర్ పెట్టుకున్న హోప్స్‌కు ఈ సభ సమాధి కట్టేసిందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. కేసీఆర్ కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగినప్పటికీ ఆయన ఫ్రెండ్స్ మొహం చాటేశారు. మరీ …
Read More »జగన్‌కు ఎవరు కావాలి.. మోడీనా? కేసీఆరా?
ఔను.. ఏపీ సీఎం జగన్‌కు ఇప్పుడు ఎవరు కావాలి? మోడీ కావాలా? కేసీఆర్ కావాలా? ఇదీ… ఇప్పుడు తెలంగాణ రాజకీయ నేతల మధ్య సాగుతున్న చర్చ. దీనికి కారణం.. బీఆర్ ఎస్ పార్టీని ఏపీలో విస్తరించా లని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకోవాలని.. కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ ఆలోచన ఎలా ఉన్నప్పటికీ జగన్ మాత్రం తటస్థంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. తనపై ఉన్న …
Read More »