Political News

చ‌రిత్ర‌లోనే తొలిసారి.. 8 మంది ఐఏఎస్‌ల‌కు జైలు శిక్ష‌

దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. ఇక‌, న‌వ్యాంధ్ర హిస్ట‌రీలోనే.. ఫ‌స్ట్ టైం.. గ‌తంలో ఎక్క‌డా ఎప్పుడూ.. క‌నీ వినీ ఎరుగ‌ని సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రంలోనూ.. జ‌ర‌గ‌ని.. ఏరాష్ట్రంలోనూ.. ఇలాంటి ప‌రిణామం.. ఎదురుకాని ప‌రిస్థితి ఏపీలో ఏర్ప‌డింది. ఒకేసారి.. ఎనిమిది మంది సీనియ‌ర్ ఐఏఎస్‌ల‌కు.. ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. సీనియ‌ర్ ఐఏఎస్ అదికారులు.. విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి …

Read More »

కొత్త జిల్లాల ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్‌

ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య నూతన జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. వాలంటీర్ల సేవలకుగాను ఏప్రిల్‌ 6న ప్రభుత్వం సత్కారం చేయనుంది. ఏప్రిల్‌ 8న వసతి దీవెన కార్యక్రమం చేపట్టి.. ఆయా కార్యక్రమాలను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ సంద‌ర్భంగా.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. తాజాగా.. జ‌గ‌న్‌.. ఆయా విష‌యాల‌పై స‌మీక్షించారు. కొత్త జిల్లాలపై సీఎం జగన్ …

Read More »

చంద్రబాబు కోరిక తీర్చిన జగన్

చంద్రబాబునాయుడు కోరికను జగన్మోహన్ రెడ్డి తీర్చేశారు. ఇంతకీ ఆ కోరిక ఏమిటంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ పేరుతో కొత్తగా రెవిన్యు డిజన్ను ఏర్పాటు చేయటం.  ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతున్నది. ఇందులో భాగంగానే 73 రెవిన్యు డివిజన్లను కూడా కొత్తగా ఏర్పాటుచేసింది. వీటిల్లో కుప్పం రెవెన్యూ డివిజన్ కూడా ఒకటి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ …

Read More »

ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీల మంట‌.. జిల్లాల విభ‌జ‌న ఎఫెక్ట్‌!

ఏపీలో కొత్తగా ఏర్ప‌డుతున్న జిల్లాల వ్య‌వ‌హారం.. ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. జిల్లాల విభ‌జ‌న సీఎం జ‌గ‌న్‌కు ఆదాయాన్ని ఇస్తుండ‌గా.. ప్ర‌జ‌ల‌కు మాత్రం జేబులు మ‌రింత గుల్ల చేయనుంది. రిజిస్ట్రేష‌న్ చార్జీలు.. భూముల ధ‌ర‌లు ఆకాశాన్ని అంట‌నున్నాయి. దీంతో ఇప్ప‌టికే కుదేలైన రియ‌ల్ ఎస్టేట్ మ‌రింత దారుణంగా మారిపోతుంద‌ని చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రాల్లో స్థిరాస్తి మార్కెట్‌ విలువల్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరించనుంది. జిల్లాల నోటిఫికేషన్‌ …

Read More »

అన్నీ కొత్త కొత్త‌గా.. ఏపీలో `ఏప్రిల్ మార్పులు`!

ఏపీలో అన్నీ కొత్త‌క‌త్త‌గా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ నుంచి కీల‌క‌మైన కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌టి.. మంత్రి వ‌ర్గ మార్పు, రెండు.. కొత్త జిల్లాల ఏర్పాటు. మూడు.. అధికార పార్టీలో.. కీల‌క మార్పులు వంటివి ఏప్రిల్‌లోనే చోటు చేసుకోనున్నాయి. ఇప్ప‌టికే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ కూడా పూర్త‌యింది. దీనిని ఉగాది రోజు ప్ర‌క‌టిస్తార‌ని.. తెలుస్తోంది. అదేవిధంగా.. ఉగాది మ‌రుస‌టి రోజు నుంచి కొత్త …

Read More »

జ‌గ‌న్ క‌రెంటు పీకేద్దాం: చంద్ర‌బాబు పిలుపు

రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా విద్యుత్ చార్జీలు పెంచుతూ.. ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌పై.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఫైరయ్యారు. “జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కరెంటు పీకేద్దాం“ అంటూ.. చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం దిగ్విజయం పట్ల చంద్రబాబు పార్టీ శ్రేణులకు, ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. జ‌గ‌న్ స‌ర్కారు పెంచిన విద్యుత్ …

Read More »

40 వ‌సంతాల వేడుక‌.. బాబు చేసిన దిశానిర్దేశం ఏంటి?

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీకి 40 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోనూ.. దేశ విదేశాల్లోనూ.. పార్టీ అభిమానులు.. నాయ‌కులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నా రు. ఇక‌, హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో భారీ ఎత్తున నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అనేక మంది నాయ‌కులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు కూడా పాల్గొన్నారు. అయితే. ఈ సంద‌ర్భంగా పార్టీ అభిమానులు.. నాయ‌కులు.. ముఖ్యంగా …

Read More »

సీనియ‌ర్ల‌కు ఎంపీ.. జూనియ‌ర్ల‌కు ఎమ్మెల్యే.. ఇదే బాబు లెక్క‌!

యువ‌త రాజ‌కీయాల్లోకి రావాలి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున యువ‌త‌కు అవ‌కాశం ఇస్తాం.. 40 శాతం టికెట్లు కేటాయిస్తాం.. ఇవీ తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌లు. వీటిని బ‌ట్టి చూస్తుంటే వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల్లో యువ‌త‌కు బాబు అధిక ప్రాధాన్య‌త ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. పార్టీ బ‌లోపేతంపై సీనియ‌ర్లు దృష్టి పెట్ట‌క‌పోవ‌డం.. పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన‌లేక‌పోవ‌డం లాంటి కార‌ణాల వ‌ల్ల ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో యువ‌త‌ను …

Read More »

బాబు, బీజేపీని క‌లిపేది అతనేనా?

ఎన్నిక‌ల‌కు.. చంద్ర‌బాబు పొత్తుల‌కు అవినాభావ సంబంధం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతుంటారు. ఆయ‌న ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలో దిగిన సంద‌ర్భాలు చాల త‌క్కువ. ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పొత్తులు పెట్టుకోవ‌డం ఖాయ‌మైంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఓ వైపు జ‌న‌సేన కూడా అందుకు సిద్ధ‌మంటోంది. ఇక మ‌రోవైపు బీజేపీని కూడా క‌లిపేసుకోవాల‌ని బాబు తెగ ఆరాట‌ప‌డుతున్నారు. కానీ బీజేపీ నాయ‌క‌త్వం నుంచి మాత్రం ఎలాంటి స్పంద‌న రావ‌డం లేదు. …

Read More »

జాబితా రెడీ.. ముహూర్తం ఫిక్స్‌.. మంత్రి వ‌ర్గానికి ఫేర్‌వెల్‌

జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రుల మార్పున‌కు ముహూర్తం ఫిక్స‌యిపోయింది. ఇప్ప‌టికే కొత్త‌గా ప‌ద‌వులు తీసుకునే మంత్రుల జాబితా కూడా రెడీ అయిపోయింద‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎవ‌రు ఏమ‌నుకున్నా.. ప‌రిస్థితి ఎలా ఉన్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. జ‌గ‌న్ మార్పులు చేర్పులు చేశార‌ని అంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నాయ‌కురాలికి మంత్రి వ‌ర్గంలో చోటు ఖాయ‌మైంది. అదే విధంగా స్పీక‌ర్ తమ్మినేనిని కూడా మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటున్నార‌ని చెబుతున్నారు. …

Read More »

చంద్ర‌బాబు చెప్పిన 40 40 40 లెక్కేమిటంటే..?

టీడీపీ ఆవిర్భావ వేడుక‌ల సంద‌ర్భంగా భాగ్య న‌గ‌రి వీధుల్లో ప‌సుపు క‌ళ‌క‌ళ‌లు చాలా రోజుల‌కు త‌ళుకులీనాయి. ఎన్టీఆర్ భ‌వ‌న్ కేంద్రంగా చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. కార్య‌క‌ర్త‌ల‌లో ఉత్సాహం నింపేందుకు  ఏడు ప‌దుల వ‌య‌స్సులోనూ అంటే 70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ఆయ‌న ఎంతో ప్ర‌య‌త్నించారు. శ్రేణులలో ఉత్సాహంతో పాటు కార్యాచ‌ర‌ణ‌ను పెంపొందించేందుకు కూడా చంద్ర‌బాబు ఎంత‌గానో శ్ర‌మిస్తున్నారు. ఇవాళ కూడా శ్ర‌మించారు కూడా! ఆయ‌న అంత‌ర్మ‌థ‌నంలో భాగంగా పార్టీకి సంబంధించి నాలుగు కాదు …

Read More »

టీడీపీది 40 ఏళ్ల సంబరాలు కాదు.. 27 ఏళ్ల సంబరమే: స‌జ్జ‌ల

ఎన్టీఆర్‌ ఉన్న టీడీపీ వేరు.. ఇప్పటి టీడీపీ వేరని.. కుట్రలతో అధికారంలోకి ఎలా రావాలనేది ఇప్పటి టీడీపీ పాలసీ అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీది  40 ఏళ్ల సంబరాలు కాదని.. 27 ఏళ్ల సంబరమేనంటూ ఎద్దేవా చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్టీఆర్‌పై ప్రేమ‌ను అదేస‌మ‌యంలో చంద్ర‌బాబుపై అక్క‌సును వెళ్ల‌గ‌క్క‌డం గ‌మ‌నార్హం. ‘వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట. ఆయనకు మీడియా …

Read More »