పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు చూపిస్తున్నారు. ఇక్కడ రెండో రౌండ్ ముగిసిన తర్వాత పవన్ 8500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్నారు. 1549 ఓట్లతో లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి భరత్ వెనుకంజలో ఉన్నారు. పులివెందులలో జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.
2004 నుండి గుడివాడ ఎమ్మెల్యేగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న కొడాలి నాని తాజాగా ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి 13 వేల ఓట్ల ఆధిక్యంలో ఉండడం విశేషం. మంత్రి రోజా నగరిలో వెనకంజలో ఉన్నారు. రాజమండ్రిలో ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి, మంగళగిరిలో నారా లోకేష్ ముందజంలో ఉన్నారు. 90 స్థానాలలో టీడీపీ, 20 స్థానాలలో వైసీపీ, జనసేన 12, బీజేపీ 5 స్థానాలలో అధిక్యంలో కొనసాగుతున్నాయి.
రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో టీడీపీ కూటమి స్పష్టమయిన ఆధిక్యం ప్రదర్శిస్తున్నది. జనసేన 9 చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో టీడీపీ ఓట్లు జనసేన అభ్యర్థులకు పడ్డాయని అర్ధం అవుతున్నది.