ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత.. తొలి రౌండ్‌లలో 36 స్థానాలను ప్రకటించే సరికి వైసీపీకి ఒక్క సీటులో మాత్రమే లీడ్ కనిపించింది. 2019 ఎన్నికల్లో తొలి రౌండ్ నుంచి కూడా వైసీపీ దూకుడు ప్రదర్శించింది. పైగా.. వేల సంఖ్యలో లీడ్ కూటమి వైపు కనిపిస్తుండడం గమనార్హం. ఈ పరిణామం గమనిస్తే.. వైసీపీ వైపు ప్రజలు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూట మి దూకుడు ప్రదర్శించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇలా.. రౌండ్లు ముందుకు సాగుతున్న కొద్దీకూటమి అభ్యర్థులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో కడప, అనంతపురంలో మాత్రం టీడీపీ దూకుడు కనిపించలేదు. ఇప్పుడు వచ్చిన ట్రెండ్స్‌తో పోలిస్తే… టీడీపీ దూసుకుపోతోంది. జనసేన పార్టీలో ఇద్దరు అగ్రనేతలు కూడా లీడ్‌లో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ 28 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఈ పరిణామాలు గమనిస్తే.. కూటమి ఏకపక్షంగా దూసుకుపోతుం డడం గమనార్హం.
పిఠాపురంలో..
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. లీడ్‌లో ఉన్నారు. తొలి రెండు రౌండ్లు.. దాటే సరికి.. 4 వేల 500 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. వంగాగీతకు ఇంకా బోణీ పడలేదు. కూటమికి 35 స్థానాలు దక్కే అవకా శం కనిపిస్తోంది. ఈ పరిణామాలు గమనిస్తే.. పిఠాపురం సహా తెనాలిలో జనసేన అభ్యర్థి దూసుకుపోతు న్నారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత.. గంట సమయం వరకు లీడ్‌లు కూటమి వైపే ఉండడంతో గెలుపుపై ధీమా దిశగా కూటమి అభ్యర్థులు సంబరాలు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates