ఏపీలో ప్రారంభమైన ఓట్ల కౌంటింగ్.. వేగంగా సాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలను ముందుగా లెక్కిస్తుండ గా.. మరికొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్ర వ్యాప్తగా కౌంటింగ్ కొనసాగు తోంది. తొలి అరగంటలోనే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతల లీడ్ కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కుప్పంలో చంద్రబాబు, నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పొంగూరు నారాయణ లీడ్‌లో ఉన్నారు.
రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి, నరసారావుపేట పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయులు లీడ్‌లో ఉన్నారు. మొత్తంగా చూసినా.. ఏపీలో కూటమి లీడ్‌లో కొనసాగుతోంది. తూర్పు గోదావరిలో కూటమి ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తోంది. విజయనగరం నుంచి కూడా కూటమి అభ్యర్థి, టీడీపీ నేత శ్రీనివాసరావు ట్రెండ్‌లో ఉన్నారు. సో.. రాష్ట్రంలో కూటమి లీడ్‌లో కనిపిస్తోంది.
నిజానికి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కూటమి లీడ్‌లో ఉండడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. వైసీపీకి బలమైన నెల్లూరు జిల్లాలోనూ కూటమి పుంజుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు కర్నూలు జిల్లాలోని నంద్యాల పార్లమెంటు, పాణ్యం అసెంబ్లీ నియోజకవ ర్గంలోనూ.. కూటమి లీడ్‌లో కొనసాగుతోంది. నిజానికి తొలి ట్రెండ్‌లోనే.. కూటమి దూకుడు ప్రదర్శిస్తుం డడం గమనార్హం. దీనిని బట్టి కూటమి దూకుడు కొనసాగుతుందని తెలుస్తోంది.