రెండు చోట్లా దుమ్ము రేపుతున్న రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ లోక్ సభ ఎన్నికలలో సిట్టింగ్ స్థానం కేరళలోని వాయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ స్థానాల నుండి పోటీ చేశారు. ప్రస్తుతం రాయ్ బరేలీలో సమీప బీజేపీ ప్రత్యర్ధి దినేష్ ప్రతాప్ సింగ్ పై 40,149 ఓట్ల ఆధిక్య ప్రదర్శిస్తున్నారు. ఇక కేరళలోని వయనాడ్ లో సీపీఐ అభ్యర్థి అన్నె రాజాపై ఏకంగా 91,421 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు.

2019 ఎన్నికల్లో యూపీ అమేథి, కేరళ వయనాడ్ ల నుండి పోటీ చేసిన రాహుల్ అమేథీలో కేంద్రమంత్రి స్మృతిఇరానీ చేతిలొ ఓడిపోయాడు. వయనాడ్ లో నాలుగు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో వయనాడ్ నుండి పోటీ చేసిన రాహుల్ తర్వాత రాయ్ బరేలీ నుండి పోటీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

అమేథీ నుండి పోటీ చేయకుండా రాహుల్ రాయ్ బరేలీ వెళ్లాడని అన్నారు. అమేథీలో కిశోరి లాల్ ను నిలబెట్టిన నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే స్మృతిఇరానీ అక్కడ 18 వేల ఓట్ల వెనుకంజలో ఉండడం, రెండు చోట్లా రాహుల్ భారీ ఆధిక్యంలో ఉండడం విశేషం.