ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే వైసీపీనాయకులు, అభ్యర్తులు కూడా.. ఆయా కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ప్రధానంగా కీలకమైన నియోజకవర్గాలలో గెలుపు గుర్రం ఎక్కడం ఖాయ మని అనుకున్న నాయకులు.. ఉద్ధండ నేతలు కూడా.. కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు. ముఖ్యం గా కీలకమైన గుడివాడ, గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల ననుంచి వెళ్లిపోయారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. వల్లభనేని వంశీ, మంత్రి జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా.. అందరూ కూడా.. కౌంటింగ్ కేంద్రాలకు మంగళవారం ఉదయమే చేరుకున్నా రు. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని అనుకున్నారు.. అయితే.. తొలి రౌండ్ నుంచే టీడీపీ పుంజుకోవడం.. జనసేన అభ్యర్థులు పుంజుకోవడంతో వైసీపీ అభ్యర్థులు ఒక్కొక్కరుగా కాదు.. ఉమ్మడిగానే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు.
ఇక, మరోవైపు మొండిగా మరికొందరు కౌంటింగ్ కేంద్రాల వద్దే వేచి చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి రోజాలు తమ తమ నియోజకవర్గాలు విజయవాడ సెంట్రల్, నగరిలో వేచి చూస్తున్నారు. అదేవిధంగా సత్తనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు బాగా వెనుక బడ్డారు. అయితే.. వచ్చే రౌండ్ నుంచి తన ఓట్లు పెరుగుతాయంటూ.. ఆయన వేచి చూస్తున్నారు. కానీ, మొత్తంగా చూస్తే.. 175 నియోజకవర్గాల్లో 100 స్థానాల్లో అభ్యర్థులు తమ ఏజెంట్లకు బాధ్యతలు అప్పగించి.. వెళ్లిపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates