జగన్, బొత్స మినహా ఓటమి బాటలో మంత్రులు

ఏపీలో ఎన్డీఏ కూటమి ఆధిక్యం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల వరకు ముగిసిన కౌంటింగ్ గణాంకాల ప్రకారం ఎన్డీఏ కూటమి 120 అసెంబ్లీ స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, వైసీపీ 20 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. టీడీపీ 100 స్థానాల్లో లీడ్ లో ఉండగా, జనసేన 16 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక, ఏపీలో వైసీపీకి చెందిన పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. సీఎం జగన్, మంత్రి బొత్స సత్యన్నారాయణ మినహా మంత్రులంతా వెనుకబడ్డారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి, నగరిలో మంత్రి రోజా, మంత్రి తానేటి వనిత, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు కూడా వెనుకంజలో ఉన్నారు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, తునిలో మంత్రి దాడిశెట్టి రాజా, అమలాపురంలో మంత్రి విశ్వరూప్…ఇలా 9 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ మినహా మిగతా మంత్రులంతా ఓటమి బాటలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆముదాలవలసలో తమ్మినేని, గుడివాడలో కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు.