తెలంగాణ : ఆ రెండు మినహా అన్నింటి మీదా ఆశలు గల్లంతే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో మొత్తం 17 స్థానాలలో కేవలం రెండు చోట్ల మినహా మిగిలిన 15 స్థానాలలో బీఆర్ఎస్ ఆశలు వదులుకున్న పరిస్థితి నెలకొంది. సామాజిక సమతూకం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినా కూడా ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీని పరిగణనలోకి తీసుకోలేదని అర్ధమవుతున్నది.

ఈ ఎన్నికలలో నాగర్ కర్నూలు, మెదక్ స్థానాలలో మాత్రమే బీఆర్ఎస్ ప్రభావం చూపగలిగింది. మిగిలిన స్థానాలలో బాగా వెనకబడి పోయింది. మెదక్ లో 3311 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, నాగర్ కర్నూలులో 1,25,112 ఓట్లతో మల్లురవి 16,403 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, 1,08,709 ఓట్లతో రెండో స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 1,02,679 ఓట్లతో మూడోస్థానంలో గట్టి పోటీని ఇస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న ట్రయాంగిల్ పోటీలో ఎవ్వరు గెలిచినా 5 నుండి 15 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే ఉండే అవకాశం ఉంది.

ఇవికాకుండా మిగతా స్థానాలలో బీఆర్ఎస్ ఎంతో వెనకబడింది. ఆదిలాబాద్ , భువనగిరి, చేవెళ్ల,హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్, వరంగల్, జహీరాబాద్ లలో మూడో స్థానానికి పార్టీ పరిమితం అయింది.