ఇటీవల ఓ పత్రిక, మీడియాలో వైసీపీ అధినేత జగన్ సతీమణి భారతి గురించి సంచలన కథనాలు వెలుగు చూశాయి. ఆమె పార్టీ పగ్గాలను చేపడుతున్నారని.. త్వరలోనే దీనిపై నిర్ణయం రానుందని, ఇప్పటికే నాయకులతో ఆమె టచ్‌లో ఉన్నారని కూడా ఈ కథనం చెప్పుకొచ్చింది. ఇది వైసీపీలో సంచలనంగా మారింది. సహజంగా రెడ్డి నాయకులు మహిళా సారథ్యంలో పనిచేసేందుకు ఇష్టపడరు. అందుకే.. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కుమార్తెను ఇంచార్జ్‌గా పెట్టినా.. ఆ …
Read More »పవన్ కు జ్వరం…చికిత్స కోసం హైదరాబాద్ పయనం
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఈ వారంలో సోమవారమే ఆయన జ్వరం బారిన పడినా… సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే జ్వరం తీవ్రత పెరగడంతో ఆయన మంగళగిరిలోని తన నివాసంలోనే చిన్నపాటి చికిత్సలు తీసుకుంటూ విశ్రాంతి తీసుకున్నారు. అయితే వైరల్ ఫీవర్ ప్రభావం మరింత తీవ్రం కావడంతో వైద్యులు హైదరాబాద్ లో మరింత మెరుగైన చికిత్స తీసుకోవాలని …
Read More »జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత
తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో శుక్రవారం ఓ కీలక ప్రకటన వెలువడింది. విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సునీత అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. సునీతకే టికెట్ దక్కుతుందని చాలా రోజులుగా అనుకుంటున్నా… శుక్రవారం అధికారిక ప్రకటన రావడంతో ఆ విషయం రూఢీ అయిపోయింది. …
Read More »నాన్న కష్టాన్ని గుర్తు చేసుకున్న నారా లోకేశ్
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో నాడు సీఎం హోదాలో కొనసాగిన ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని హైదరాబాద్ ను ఎంతగానో అభివృద్ది చేశారు. చంద్రబాబు లేకుంటే అసలు హైదరాబాద్ ఇప్పుడున్నట్టు ఉండేది కాదేమో. నేటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ను నాడు చంద్రబాబు ఏ రీతిన అభివృద్ధి చేశారన్న విషయాన్ని ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ రెండు, మూడు మాటల్లో వివరించారు. …
Read More »చిరంజీవి రియాక్షన్.. వైసీపీకి మేలా?
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై గురువారం రాత్రి.. మెగా స్టార్ చిరంజీవి స్పందించా రు. సుమారు 10 కీలక పాయింట్లను ఆయన లేవనెత్తారు. అయితే.. పాయింట్లు వైసీపీకి మేలు చేసేలా ఉన్నాయన్న వాదన వినిపించడం గమనార్హం. వైసీపీ హయాంలో సినిమా సమస్యలపై మాట్లాడేందుకు.. 2023లో దిగ్గజ దర్శకుడు రాజమౌళి, హీరోలు ప్రభాస్, మహేష్‌బాబు సహా పలువురితో కలిసి చిరంజీవి తాడేపల్లి నివాసానికి వచ్చారు.ఈ సమయంలో మంత్రి …
Read More »ప్యాన్ ఇండియా సినిమాలకు తెలంగాణా షాక్
తాజాగా విడుదలైన ఓజి సినిమా ప్రీమియర్లు, పెంచిన టికెట్ రేట్ల మీద ఇచ్చిన ఉత్తర్వు చెల్లదంటూ తెలంగాణ హై కోర్టు సింగిల్ జడ్జ్ తీర్పు ఇవ్వడం, దాని మీద మూవీ యూనిట్ అప్పీల్ కు వెళ్తే, డివిజన్ బెంచ్ దాన్ని శుక్రవారం వరకు నిలుపుదల చేస్తూ నిర్మాతకు ఊరట కలిగించడం ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు. హోమ్ శాఖకు ఇలా వెసులుబాటు ఇచ్చే అధికారం లేదంటూ ఒక వ్యక్తి వేసిన పిల్ …
Read More »నేను పూజారిని మాత్రమే: ఏపీ స్పీకర్
ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ అనే దేవాలయం లో తాను కేవలం పూజారిని మాత్రమేనని.. ప్రజలే దేవుళ్లని వ్యాఖ్యానించారు. దేవుళ్లకు సేవ చేసుకునేందుకు మాత్రమే ఇక్కడ ఎన్నికైన సభ్యులు పనిచేయాలని సూచించారు. ఇదేసమయంలో వైసీపీ అధినేత జగన్ కోరుతున్నట్టుగా .. ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది దేవుడే ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. పూజారి ఏమైనా ఇవ్వగలడా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని …
Read More »రేవంత్ సర్కారుకు మెట్రో… ఇది అసలు ప్లాన్!
హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రాజెక్ట్‌పై నెలల తరబడి కొనసాగిన చర్చలు ఇప్పుడు క్లైమాక్స్‌కి చేరాయి. ఎల్అండ్టీ పూర్తిగా వెనక్కి తగ్గడంతో, మొత్తం ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోంది. ఈ క్రమంలో దాదాపు రూ.13 వేల కోట్ల అప్పును ప్రభుత్వం టేకోవర్ చేయడానికి అంగీకరించింది. అంతేకాకుండా ఎల్అండ్టీకి రూ.2,100 కోట్లు నగదు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. దీంతో మెట్రో నిర్వహణలో ప్రైవేట్ రంగం పాత్ర ముగిసిపోగా, ప్రభుత్వమే పూర్తి …
Read More »62 వేల కోట్లతో యుద్ధవిమానాలు.. చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం
భారత వాయుసేన (IAF) శక్తివంతమైన దళంగా ఎదగడానికి మరో కీలక అడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ మార్క్ 1A యుద్ధవిమానాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ భారీ ఒప్పందంపై సంతకం చేసింది. మొత్తం 97 విమానాల కోసం రూ.62,370 కోట్లతో ఈ కాంట్రాక్ట్ కుదిరింది. ఇది చరిత్రలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద ఒప్పందం అని తెలుస్తోంది. ఈ ఒప్పందంలో 68 సింగిల్ సీటర్ ఫైటర్లు, 29 ట్విన్ సీటర్ …
Read More »ఏపీ అసెంబ్లీలో దొంగ సంతకాలు.. దాగుడు మూతలు ..!
వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి బెరుకు, బెంగ కూడా ఉన్నాయని స్పష్టమవుతోంది. తమ పార్టీ అధినేత తీరు తో కొందరు విసిగిపోతున్నారన్నది కూడా వాస్తవమే. ముఖ్యంగా కొందరు ఫస్ట్ టైమ్ గెలిచిన వారు ఉన్నారు. అలాగే.. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వంటివారు.. సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన 11 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు.. అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. అంటే.. ఆయా నియోజకవర్గాల్లో తక్కువ మెజారిటీతోనే గెలుపు గుర్రం …
Read More »శభాష్.. సత్య: మంత్రికి బాబు మార్కులు !
బీజేపీ నాయకుడు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు.. వరుసగా రెండో సారి సీఎం చంద్రబాబు నుంచి అభినందనలు దక్కాయి. ‘శభాష్ సత్య’ అంటూ.. మంత్రి సత్యకుమార్‌కు సీఎం ఫోన్ చేసి మరీ అభినందించారు. గతంలో కూడా.. ఒకసారి మంత్రిని చంద్రబాబు అభినందించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఆయన.. ప్రభుత్వ వైద్య శాలలను సందర్శించి.. లోపాలను ఎత్తి చూపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్య …
Read More »బాబుపై వ్యతిరేకత పెరిగింది.. ఇక, మనమే: జగన్
వైసీపీ అధినేత జగన్.. అసెంబ్లీకి రాకుండా.. తాడేపల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులు, జిల్లాల ఇంచార్జులతో సమావేశాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నా.. ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం రాత్రి 7 గంటల వరకు నిరవధికంగా సాగింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై జగన్ స్పందించారు. తన పార్టీ వారికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates