జగన్ ఓటమి చూసి ఇంకా ప్రాణాలు కోల్పోతున్నారా

ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ ప‌రాజ‌యాన్ని త‌ట్టుకోలేక ఫ‌లానా జిల్లాలో ఒక‌రు మృతి. మ‌రో చోట ఇంకొక‌రి మ‌ర‌ణం.. ఇదీ వైసీపీ ప‌త్రిక‌, ఛానెళ్లు, సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ వ‌స్తున్న వార్త‌లు.

జూన్ 4 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీకి కేవ‌లం 11 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. ఈ ఫ‌లితాలు వ‌చ్చి దాదాపు 20 రోజులు కావొస్తోంది. కానీ ఇప్ప‌టికీ జ‌గ‌న్ పార్టీ ఓట‌మిని చూసి త‌ట్టుకోలేక ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నార‌నే వార్త‌లు జ‌నాల‌కే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి.

ఎలా మ‌ర‌ణించినా స‌రే ఆ చావును వైసీపీ ఓట‌మి ఖాతాలోకి తోసేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ శ‌వాల లెక్క వెనుక మ‌రో ప్ర‌ధాన కార‌ణం ఉంద‌ని రాజ‌కీయ నాయ‌కులు విశ్లేషిస్తున్నారు.

మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓదార్పు యాత్ర కోసం ఈ చావుల జాబితాను సిద్ధం చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న ఓదార్పు యాత్ర ప్రారంభించేంత వ‌ర‌కూ ఇలాంటి చావులు జ‌రుగుతూనే ఉంటాయ‌ని, శ‌వాల లెక్క పెరుగుతూనే ఉంటుద‌నే ట్రోల్స్ వ‌స్తున్నాయి.

2009లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆయన మ‌ర‌ణ‌వార్త విని జ‌నాలు చ‌నిపోయార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఆ సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వెళ్లింది.

కానీ ఓదార్పు యాత్ర కోస‌మే జ‌గ‌న్ ఈ శ‌వ రాజ‌కీయాలు చేశారనే విష‌యం తర్వాత వెలుగులోకి వ‌చ్చింద‌నే టాక్ ఉంది. అప్పుడు ఓదార్పు యాత్రను త‌న బ‌ల ప్ర‌ద‌ర్శ‌న కోస‌మే జ‌గ‌న్ ఉప‌యోగించుకున్నార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఇప్పుడు ఓట‌మి నేప‌థ్యంలో మ‌రోసారి ఓదార్పు యాత్ర కోసం శ‌వాల లెక్క పెంచుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.