Political News

మరో పాదయాత్రకు అమరావతి రైతులు

అమరావతి రైతులు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలన్న డిమాండ్ తో కొంతకాలం క్రితం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ తిరుపతి అలిపిరి వరకు పాదయాత్ర చేయటం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు అంటూ మరో మహా పాదయాత్రకు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 12 నుంచి తాజా పాదయాత్ర షురూ కానుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ భూములు ఇచ్చిన …

Read More »

కాళేశ్వరం పంప్ హౌస్ కు భారీ నష్టం

ఈమధ్యనే కురిసిన భారీ వర్షాలు, వరద కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ కు భారీ నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేశారు.  ప్రాజెక్టులో నుండి నీటిని తోడి పంపటానికి వీలుగా ఏర్పాటుచేసిన పంప్ హౌస్ లోని 17 మోటాటర్లలో ఎనిమిది మోటార్లు దెబ్బతిన్నట్లు నిపుణులు స్పష్టంగా తేల్చారు. ఇందులో కూడా ఆరుమోటార్లను పూర్తిగా మార్చాల్సిందే అని అభిప్రాయపడ్డారు. మరో రెండు మోటార్లు కూడా దెబ్బతిన్నప్పటికీ రిపేర్లు చేయిస్తే బాగుపడతాయని …

Read More »

YS వివేకా హత్య.. సుప్రీంకోర్టుకు సునీత!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి తాజాగా సంచలన పిటిషన్ ను దాఖలు చేశారు ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి. విషాదకరమైన విషయం ఏమంటే.. తన తమ్ముడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వేళ.. తన తండ్రి హత్యకు సంబంధించిన తమకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తున్న ఆమె తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని …

Read More »

ఉపఎన్నిక తాయిలమేనా?

తొందరలోనే జరగుతుందని అనుకుంటున్న మునుగోడు ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ ప్రభుత్వం జనాలకు తాయిలాన్ని ప్రకటించింది. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో 10 లక్షలమందికి పెన్షన్లు మంజూరుచేసింది. ఉపఎన్నిక ముందు 10 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని క్యాబినెట్ డిసైడ్ చేసిందంటేనే అర్ధమైపోతోంది ఇది కేవలం ఉపఎన్నిక తాయిలమని. సరిగ్గా ఉపఎన్నిక ముందు ఇలాంటి తాయిలాలను ప్రభుత్వం ప్రకటిస్తే జనాలు ఓట్లేసేస్తారా ? కొద్దినెలల క్రితం జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో …

Read More »

మమత వెంటపడుతున్న కేంద్రం

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని ఎలా బలహీనం చేయాలనే విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్ధలు వెంటపడుతున్నట్లు అనుమానంగా ఉంది. తాజాగా సీఎంకు అత్యంత సన్నిహితుడైన అనుబ్రత్ మండల్ ను సీబీఐ అరెస్టుచేసింది. 2020లో నమోదైన పశువుల అక్రమరవాణా కేసులో మండల్ ను సీబీఐ ఆయనింట్లోనే అరెస్టుచేసింది. పశువుల స్మగ్లర్లనుండి డబ్బులు తీసుకుని వారికి రక్షణ కల్పిస్తున్నట్లు అభియోగాలున్నట్లు దర్యాప్తుసంస్ధ చెప్పింది. ఈమధ్యనే భారీ పరిశ్రమలశాఖ మంత్రి పార్ధాచటర్జీని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ …

Read More »

పార్టీల్లో మునుగోడు చిచ్చు

నల్గొండ జిల్లాలోని మునుగోడు ఉపఎన్నిక వ్యవహారం రెండుపార్టీల్లో బాగా చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోలరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించటంతో  ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే కేంద్ర ఎన్నికల కమీషన్ ఉపఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తుందనేది సస్పెన్స్ గా మారింది. సరే ఉపఎన్నిక తేదీని పక్కనపెట్టేస్తే అన్నీపార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో చిచ్చు మొదలైంది. కాంగ్రెస్ కు రాజీనామాచేసిన …

Read More »

వచ్చే ఎన్నికల్లో తేజస్వీయే ఛాంపియనా ?

బీహార్లో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయేకి దెబ్బ తప్పేట్లు లేదు. ఇండియా టు డే-సీ ఓటర్ ఇదే అంశంపై రాష్ట్రంలో సర్వే చేసిందట. దాని ఫలితాలను బుధవారం విడుదల చేసింది. తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్ సభకు ఎన్నికలు జరిగితే మొత్తం 40 స్ధానాల్లో మహాఘట్ బంధన్ 26 స్ధానాల్లో గెలుస్తుందని ఇండియు టు డే స్నాప్ పోల్ తేల్చింది. సర్వేలన్నీ నిజాలవుతాయని అనుకునేందుకు లేదు. …

Read More »

అక్కడ మాత్రం మోడీకి ఇబ్బందులు తప్పవా?

Modi

నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయే ఎన్డీయేలో నుండి బయటకు వెళ్ళిపోవటంతో నరేంద్రమోడీకి ఒక్కసారిగా ఇబ్బుందులు మొదలైపోయాయి. లోక్ సభలో బీజేపీ లేదా ఎన్డీయేకి సంపూర్ణ మెజారిటి ఉన్నా రాజ్యసభలో మొదటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉంది. బిల్లులు గట్టెక్కటానికి ఎన్డీయే పెద్దలు నానా అవస్థలు పడుతున్నారు. జేడీయూ ఉన్నపుడే నూరుశాతం మెజారిటీ లేదు. అలాంటిది ఇప్పుడు నితీష్ ఎన్డీయేకి కటీఫ్ చెప్పేసిన తర్వాత ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడిపోయింది. 245 మంది …

Read More »

గోరంట్ల విడియోపై ఇంత గందరగోళమా?

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై చాలా గందరగోళం రేగుతోంది. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియాలో అనేక సందేహాలకు సమాధానాలు దొరుకుతాయని అందరూ అనుకున్నారు. కానీ ఎస్పీ మాట్లాడిన తర్వాత సందేహాలు మరింతగా పెరిగిపోయాయి. మొదటిదేమిటంటే ఇపుడు సర్క్యులేషన్లో ఉన్న వీడియో ఒరిజినల్ కాదు కాబట్టి అది మార్ఫుడా లేకపోతే ఎడిటింగ్ చేసిందా అని చెప్పలేమన్నారు. ఇపుడున్న వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ ఎలా చెప్పగలరు …

Read More »

బీజేపీ తర్వాత టార్గెట్ ఈ రాష్ట్రమే?

మహారాష్ట్రలోని శివసేన నాయకత్వంలోని  మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిన విషయం అందరికీ తెలిసిందే. సరే ఆ లెక్క బీహార్లో సరిపోయింది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసిన బీజేపీ బీహార్లో అధికార పార్టీ హోదా నుంచి ప్రతిపక్షంలోకి వచ్చేసింది. వచ్చే డిసెంబర్లో బెంగాల్లోని మమతాబెనర్జీ ప్రభుత్వాన్ని కూడా కూల్చేయబోతున్నట్లు బీజేపీ హెచ్చరించింది. బెంగాల్లో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్లో మమత ప్రభుత్వం కూలిపోతుందన్నారు. …

Read More »

కేసీయార్ నిర్ణయం.. షాక్ ఇస్తున్న నేతలు

పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థిని తీవ్రంగా వ్యతిరేకించటం ద్వారా మునుగోడు నేతలు ఏకంగా కేసీయార్ కే షాకిచ్చారు. మాజీ ఎంఎల్ఏ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే ఉపఎన్నికలో పోటీచేయించాలని కేసీయార్ నిర్ణయించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి చెప్పి నేతలందరినీ ఒప్పించమని బాధ్యత అప్పగించారు. అయితే నేతలంతా కలిసి మంత్రితో పాటు కేసీయార్ కు కూడా పెద్ద షాకిచ్చారు. కూసుకుంట్ల అభ్యర్ధిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని …

Read More »

జయసుధ డిమాండ్లను బీజేపీ పట్టించుకుంటుందా ?

ప్రముఖ సినీనటి, మాజీ ఎంఎల్ఏ జయసుధ బీజేపీలో చేరుతున్నారా ? చేరుతున్నారనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయటం లేదని స్వయంగా జయసుధే ప్రకటించారు.  ప్రచారం జరుగుతున్నట్లుగా తాను ఈ నెల 21వ తేదీన మునుగోడు బహిరంగ సభలో చేరటంలేదని కూడా క్లారిటి ఇచ్చారు. అంటే మునుగోడు సభలో చేరటం లేదని చెప్పారే కానీ అసలు బీజేపీలోనే చేరటం లేదని మాత్రం చెప్పలేదు. అయితే పార్టీవర్గాల …

Read More »