Political News

కాంగ్రెస్ రాత మారుతుందా?

దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ప్రయాంకగాంధి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్చార్జిలుగా ఉన్నవారి వల్ల ఎలాంటి ఉపయోగం కనబడలేదు. మిగిలిన రాష్ట్రాల సంగతి వదిలేసినా ఏపీకి ఊమెన్ చాంది, తెలంగాణాకు మాణిక్కం ఠాగూర్ ఇన్చార్జిలుగా ఉన్నారు. అయితే వీరిద్దరి వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం కనబడలేదు. తెలంగాణాలో పార్టీకి కొద్దొగొప్పో నేతలున్నారు కానీ ఏపీలో అయితే ఇంకా సమాధిస్ధితిలోనే ఉంది పార్టీ. నిజానికి మెజారిటి జనాల అభిమతానికి విరుద్ధంగా కాంగ్రెస్ …

Read More »

వచ్చే ఎన్నికల బరిలో జీవిత

టాలీవుడ్ కు చెందిన ఏదో ఒక అంశంలో జీవితా రాజశేఖర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆ మధ్యన ఆమె బీజేపీ తీర్థం తీసుకోవటం తెలిసిందే. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్న ఆమె.. వైఎస్ మీద విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించేవారు. ఆయన తరఫున మాట్లాడుతుండేవారు. రాజకీయంగా ఆయన నుంచి సాయం కోరినట్లు చెబుతారు. వైఎస్ అనూహ్య మరణం తర్వాత కాంగ్రెస్ …

Read More »

పెద్దలసభలో ఇంతమంది నేరచరితులా?

రాజకీయాల్లో నేరచరితులు ఉండకూడదని ఒకవైపు జనాలు నానా గోలచేస్తుంటే మరోవైపు రాజకీయపార్టీలు ఎక్కువగా నేరచరితులకు ప్రాధాన్యతిస్తున్నాయి. దేశంలోని అన్నీపార్టీలు దాదాపు ఇదే పద్దతిలో ముందుకు వెళుతున్నాయి. బహిరంగసభల్లో పార్టీలు చెప్పేదొకటి, అవసరానికి చేస్తున్నదొకటిగా ఇప్పటికే చాలాసార్లు బయటపడింది. అసోసియేష్ ఫర్ డమొక్రటికి రిఫార్స్మ్ (ఏడీఆర్) అనే సంస్ధ మన రాజకీయాల్లోని నేరచరితుల చిట్టాను ఎప్పటికప్పుడు బయటపెడుతునే ఉంది. ఇపుడిదంతా ఎందుకంటే ఏపీలోని పెద్దలసభగా చెప్పుకునే శాసనమండలిలోని నేరచరితుల బండారం బయటపెట్టింది. …

Read More »

ఎమ్మెల్సీల్లో అత్యంత సంపన్నుడు లోకేశ్

ఏపీ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఆస్తుల విషయంపై ఒక సంస్థ తాజాగా జరిపిన విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మొత్తం 58 మంది ఉండగా.. 48 మంది ఆస్తులకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయని.. మిగిలిన 10 మంది ఎమ్మెల్సీల వివరాలు తమకు అందలేదని చెబుతోందిన సదరు సంస్థ. అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీల వివరాల్లో అధికార వైసీపీకి 22 మంది ఉంటే.. విపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు …

Read More »

ఇలాగైతే టీఆర్ఎస్ గెలిచినట్లే

అధికార పార్టీకి సంబంధించి మునుగోడు నియోజకవర్గంలో గ్రూపుల గోలంతా బయటపడుతోంది. కాంగ్రెస్ ఎంఎల్ఏగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయకపోతే బహుశా టీఆర్ఎస్ లోని గ్రూపులు రోడ్డునపడేవి కావేమో. గ్రూపుల గోలను తట్టుకోలేక చివరకు కేసీయార్ కే ఏమిచేయాలో దిక్కుతోస్తున్నట్లు లేదు. కేసీయార్ నిర్ణయించిన క్యాండిడేట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నియోజకవర్గంలోని చాలామంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్ధి ఎంపిక విషయంలో తనను వ్యతిరేకిస్తున్న వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో ఇప్పుడు …

Read More »

కోమటిరెడ్డికి రేవంత్ క్షమాపణ

తప్పుగా మాట్లాడితే సారీ చెప్పటం తప్పేం కాదు. కానీ.. ఎవరో ఒక నేత మరో నేతను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేసినప్పుడు.. దానికి పార్టీ అధినేత బాధ్యత వహించి సారీ చెప్పాలని పార్టీ నేత కోరితే.. ఫలితం ఎలా ఉంటుంది? కానీ.. రోటీన్ కు భిన్నంగా.. అందరిని కలుపుకుపోవటమే తప్పించి.. తల ఎగరేయటం తనకు రాదన్న చందంగా వ్యవహరించిన టీపీసీసీ రేవంత్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెర తీశారని చెప్పాలి. …

Read More »

మరో పాదయాత్రకు అమరావతి రైతులు

అమరావతి రైతులు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలన్న డిమాండ్ తో కొంతకాలం క్రితం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ తిరుపతి అలిపిరి వరకు పాదయాత్ర చేయటం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు అంటూ మరో మహా పాదయాత్రకు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 12 నుంచి తాజా పాదయాత్ర షురూ కానుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ భూములు ఇచ్చిన …

Read More »

కాళేశ్వరం పంప్ హౌస్ కు భారీ నష్టం

ఈమధ్యనే కురిసిన భారీ వర్షాలు, వరద కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ కు భారీ నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేశారు.  ప్రాజెక్టులో నుండి నీటిని తోడి పంపటానికి వీలుగా ఏర్పాటుచేసిన పంప్ హౌస్ లోని 17 మోటాటర్లలో ఎనిమిది మోటార్లు దెబ్బతిన్నట్లు నిపుణులు స్పష్టంగా తేల్చారు. ఇందులో కూడా ఆరుమోటార్లను పూర్తిగా మార్చాల్సిందే అని అభిప్రాయపడ్డారు. మరో రెండు మోటార్లు కూడా దెబ్బతిన్నప్పటికీ రిపేర్లు చేయిస్తే బాగుపడతాయని …

Read More »

YS వివేకా హత్య.. సుప్రీంకోర్టుకు సునీత!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి తాజాగా సంచలన పిటిషన్ ను దాఖలు చేశారు ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి. విషాదకరమైన విషయం ఏమంటే.. తన తమ్ముడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వేళ.. తన తండ్రి హత్యకు సంబంధించిన తమకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తున్న ఆమె తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని …

Read More »

ఉపఎన్నిక తాయిలమేనా?

తొందరలోనే జరగుతుందని అనుకుంటున్న మునుగోడు ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ ప్రభుత్వం జనాలకు తాయిలాన్ని ప్రకటించింది. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో 10 లక్షలమందికి పెన్షన్లు మంజూరుచేసింది. ఉపఎన్నిక ముందు 10 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని క్యాబినెట్ డిసైడ్ చేసిందంటేనే అర్ధమైపోతోంది ఇది కేవలం ఉపఎన్నిక తాయిలమని. సరిగ్గా ఉపఎన్నిక ముందు ఇలాంటి తాయిలాలను ప్రభుత్వం ప్రకటిస్తే జనాలు ఓట్లేసేస్తారా ? కొద్దినెలల క్రితం జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో …

Read More »

మమత వెంటపడుతున్న కేంద్రం

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని ఎలా బలహీనం చేయాలనే విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్ధలు వెంటపడుతున్నట్లు అనుమానంగా ఉంది. తాజాగా సీఎంకు అత్యంత సన్నిహితుడైన అనుబ్రత్ మండల్ ను సీబీఐ అరెస్టుచేసింది. 2020లో నమోదైన పశువుల అక్రమరవాణా కేసులో మండల్ ను సీబీఐ ఆయనింట్లోనే అరెస్టుచేసింది. పశువుల స్మగ్లర్లనుండి డబ్బులు తీసుకుని వారికి రక్షణ కల్పిస్తున్నట్లు అభియోగాలున్నట్లు దర్యాప్తుసంస్ధ చెప్పింది. ఈమధ్యనే భారీ పరిశ్రమలశాఖ మంత్రి పార్ధాచటర్జీని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ …

Read More »

పార్టీల్లో మునుగోడు చిచ్చు

నల్గొండ జిల్లాలోని మునుగోడు ఉపఎన్నిక వ్యవహారం రెండుపార్టీల్లో బాగా చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోలరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించటంతో  ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే కేంద్ర ఎన్నికల కమీషన్ ఉపఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తుందనేది సస్పెన్స్ గా మారింది. సరే ఉపఎన్నిక తేదీని పక్కనపెట్టేస్తే అన్నీపార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో చిచ్చు మొదలైంది. కాంగ్రెస్ కు రాజీనామాచేసిన …

Read More »