వైసీపీ అధినేత జగన్‌కు ఆయన సోదరి, కాంగ్రెస్ చీఫ్ షర్మిల భారీ షాకిస్తున్నారా? అంటే.. ఇప్పటికే అనేక షాకులు ఇస్తున్నారు కదా.. ఎందుకీ డౌటు? అని అంటారు. కానీ, మరో కీలక నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. తాజాగా ఓ జాతీయ మీడియాలో జరిగిన చర్చలో షర్మిల వర్సెస్ జగన్ విషయాలు వెలుగు చూశాయి. ఏపీలో 11 మందిని ప్రజలు ఇచ్చినా.. వైసీపీ సరైన రోల్ పోషించడం లేదని.. జాతీయ మీడియా చెప్పుకొచ్చింది. ఇక్కడే జగన్‌కు చెల్లి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతోందట.
151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినా.. పార్టీ అధినేత జగన్ విజయం దక్కించుకున్నారు. దీంతో సాధారణంగానే ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తారని.. తమ కోసం వైసీపీ పనిచేస్తుందని ఆశించారు. కానీ, వైసీపీ అధినేత మాత్రం.. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. అసెంబ్లీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు.. తనకు మాట్లాడే అవకాశం ఇస్తే తప్ప.. సభలో అడుగు పెట్టనని కూడా చెప్పుకొచ్చారు. కానీ, సభలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా.. బలమైన పాత్ర పోషించిన వారు ఉన్నారు.
గతంలో అనేక మంది కమ్యూనిస్టులు సభలను దడదడలాడించారు. ఎంత మంది సంఖ్యా బలం ఉందనేది కాదు.. ఎంత బలమైన సబ్జెక్టును ఎంచుకున్నామన్నదే సభలో కీలకం. దీంతో ప్రతిపక్ష హోదా మాట తేలే వరకు కూడా.. జగన్ సభకు వెళ్లరని తేలిపోయింది. ఇక, ఇప్పుడు.. ఈ ప్లేస్‌ను కూడా షర్మిల ఆక్యుపై చేస్తున్నారనేది జాతీయ మీడియా చెబుతున్న మాట. వాస్తవమే. బలమైన గళం వినిపించడంతోపాటు.. ఆమె ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు.
ఒకవైపు అన్ననే అనుకుంటే.. మరో వైపు సర్కారును కూడా నిలదీస్తున్నారు. వరద ప్రభావిత జిల్లాలో పర్యటించారు. నడుములోతు నీళ్లలో నిలబడి రైతుల పక్షాన ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ గురించి.. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆయనను కూడా నిలదీశారు. ఇక, వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తే.. ఊరుకునేది లేదన్నారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. జగన్ ఒక్క విషయంపై కూడా స్పందించలేదు. కేవలం తన పార్టీ నాయకులపై జరుగుతున్న దాడుల కోసం.. ఢిల్లీవెళ్లి ధర్నా చేశారు. దీంతో ప్రతిపక్ష ప్లేస్‌ను కూడా.. షర్మిల ఆక్యుపై చేస్తున్నారన్న వాదన ఇప్పుడు తెరమీదికి వచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates