పెండ్యాల శ్రీనివాస్ ‘చెర’ త‌ప్పింది

పెండ్యాల శ్రీనివాస్‌. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న సీనియ‌ర్ తెలుగు అధికారి. ఈయన 2014-19 మ‌ధ్య కాలంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేశారు. క‌ట్ చేస్తే.. 2019లో వైసీపీ వ‌చ్చిన త‌ర్వాత ఈయ‌నపై ప‌లు కేసులు పెట్టారు. ముఖ్యంగా చంద్ర‌బాబు జైలుకు వెళ్ల‌డానికి కార‌ణ‌మ‌ని వైసీపీ పేర్కొన్న ‘స్కిల్’ డెవ‌ప‌ల్‌మెంట్ వ్య‌వ‌హారంలోనే పెండ్యాల‌పై వైసీపీ స‌ర్కారు కేసులు పెట్టింది.

ఈ క్ర‌మంలోనే సీఐడీ పెండ్యాల‌కు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే.. ఈ విష‌యం తెలిసి ఆయ‌న అమెరికా వెళ్లిపోయారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంటు కేసులో.. సంబంధిత విభాగం నుంచి అక్ర‌మంగా నిధులు దారిమ‌ళ్లించార‌న్న‌ది వైసీపీ పెట్టిన కేసు. అయితే.. ఈ కేసులోనే చంద్ర‌బాబును జైల్లోనే పెట్టారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ కేసు పెట్ట‌డానికి.. చంద్ర‌బాబును జైల్లో పెట్ట‌డానికి సోమ‌వారంతో 100 రోజులు పూర్త‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. వైసీపీ పెట్టిన కేసుల‌ను ర‌ద్దు చేయ‌డంతో పాటు. పెండ్యాల శ్రీనివాస్‌పై అప్ప‌ట్లో వైసీపీ స‌ర్కారు విదించిన స‌స్పెన్ష‌న్‌ను కూడా ఎత్తి వేసింది. వెంట‌నే అమెరికా నుంచి ఏపీకి రావాల‌ని.. జీఏడీలో రిపోర్టు చేయాల‌ని కూడా స‌ర్కారు పేర్కొంది. అప్ప‌ట్లో చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌ణాళిక శాఖ‌లో అసిస్టెంట్ సెక్ర‌ట‌రీగా పెండ్యాల వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు పీఎస్‌గా కూడా ప‌నిచేశారు.

వైసీపీ హ‌యాంలో దాదాపు నాలుగేళ్ల‌పైగానే ఆయ‌న అమెరికాలో ఉండిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో స‌ర్కారు మార‌డంతో ఆయ‌న‌పై న‌మోదైన చార్జ్‌ల‌ను కూట‌మి ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంది. దీంతో పెండ్యాల‌కు చెర వీడిన‌ట్టేన‌ని ఉద్యోగ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఆయ‌న ఎప్పుడు తిరిగి వ‌స్తారో చూడాలి.