రాబోయే యూనియన్ బడ్జెట్ (2026-27) కేవలం పన్నుల లెక్కలకే పరిమితం కాకుండా, టెక్నాలజీ భవిష్యత్తును నిర్ణయించేలా ఉండబోతోందా? అవుననే అంటున్నారు ప్రముఖ ఆర్థికవేత్తలు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో నిపుణులు ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ వంటి నయా టెక్నాలజీలకు బడ్జెట్‌లో ప్రత్యేక పాలసీ సపోర్ట్ ఇవ్వాలని వారు గట్టిగా సూచించారు.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ, కేవలం పాత పద్ధతులపై ఆధారపడితే కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ ట్రేడ్ ఒడిదుడుకుల నుంచి మన ఎకానమీని కాపాడుకోవాలంటే.. అధిక విలువ కలిగిన డిజిటల్ సేవలు, నాలెడ్జ్ బేస్డ్ సర్వీసుల వైపు భారత్ అడుగులేయాలి. తద్వారా సాంప్రదాయ ఐటీ అవుట్‌సోర్సింగ్‌కు మించి, కొత్త ఆదాయ మార్గాలను సృష్టించుకోవచ్చని వారి వాదన.
డేటా సెంటర్లంటే కేవలం భవనాలు కాదు, అవి డిజిటల్ ఎకానమీకి వెన్నెముక లాంటివి. క్లౌడ్ కంప్యూటింగ్, ఫిన్‌టెక్, ఈ కామర్స్ వంటివన్నీ వీటి మీదే నడుస్తాయి. ప్రస్తుతం మన డేటా వినియోగం పెరిగినా, దానికి తగ్గ కెపాసిటీ మన దగ్గర లేదు. అందుకే ఈ రంగంలో పెట్టుబడులు పెంచడానికి పన్ను మినహాయింపులు, భూమి కేటాయింపులు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఇక ఏఐ, రోబోటిక్స్ అనేవి కేవలం ప్రయోగాలకు పరిమితం కాకూడదు. వ్యవసాయం, వైద్యం, తయారీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే సత్తా వీటికి ఉంది. బడ్జెట్‌లో వీటికి నిధులు కేటాయిస్తే, భారత్ కేవలం టెక్నాలజీని వాడే దేశంగా కాకుండా.. సొంతంగా సొల్యూషన్స్ తయారు చేసే గ్లోబల్ హబ్‌గా మారుతుంది. సరైన విధానాలు ఉంటే, ఇవి కొత్త రకమైన ఉద్యోగాల కల్పనకు కూడా దారి తీస్తాయి.
రాబోయే బడ్జెట్ ఈ సలహాలను పాటిస్తే.. గ్లోబల్ టెక్ రేసులో భారత్ ముందంజలో ఉంటుంది. ఇతర దేశాలు తయారు చేసిన టెక్నాలజీపై ఆధారపడకుండా, మనమే కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసే స్థాయికి వెళ్లొచ్చు. బడ్జెట్ 2026 ద్వారా ఇండియాను కేవలం టెక్నాలజీ అడాప్టర్ గా కాకుండా, గ్లోబల్ లీడర్ గా నిలబెట్టే అవకాశం ప్రభుత్వానికి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates