Political News

రాహుల్ గాంధీకి కేజీఎఫ్ ఎలివేష‌న్ వాడార‌ని..

సినిమాల్లో హీరో ఎలివేష‌న్ అనే మాట ఎత్తితే కొన్నేళ్ల నుంచి అంద‌రికీ కేజీఎఫ్ సినిమానే గుర్తుకొస్తోంది. మాస్ ఎలివేష‌న్ల‌కు కొత్త అర్థం చెబుతూ య‌శ్ పోషించిన‌ రాకీ క్యారెక్ట‌ర్‌ను శిఖ‌ర స్థాయిలో నిల‌బెట్టాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. మ‌న‌కు అస‌లు ప‌రిచ‌యం హీరోను పెద్ద మాస్ హీరోగా ఫీల‌య్యేలా చేసిన ఘ‌న‌త ప్ర‌శాంత్‌కే ద‌క్కుతుంది. ఆ సినిమా రిలీజైన ద‌గ్గ‌ర్నుంచి బ‌య‌ట ఎవ‌రికి ఏ ఎలివేష‌న్ ఇవ్వాల‌న్నా కేజీఎఫ్ బ్యాగ్రౌండ్ …

Read More »

ఎంఏ పరీక్ష‌లో వైసీపీ ప్ర‌శ్న‌.. మ‌రీ ఇంత రాజ‌కీయమా?

వారంతా ఎంఏ విద్యార్థులు. భ‌విష్య‌త్తులో ఉన్న‌త‌స్థాయి వ్య‌క్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైన‌, మ‌రీ ముఖ్యంగా విశ్వ విద్యాల‌యాల‌పైనా ఉంది. కానీ, వారిని కూడా రాజ‌కీయంగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నాలు సాగాయి. తాజాగా శుక్రవారం ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన ఎం.ఏ పరీక్షల్లో 4(b)వ ప్రశ్న కింద వైసీపీ ప్ర‌భుత్వ విధానాలు, కార్యక్రమాల గురించి వివరించండి అనే ప్రశ్న ఇచ్చారు. దీంతో విద్యార్థులు అవాక్క‌య్యారు. ఇదేం ప్ర‌శ్న‌.. అంటూ అంద‌రూ నివ్వెర పోయారు. స‌హ‌జంగా …

Read More »

ప‌వ‌న్ ఇంటికి వాళ్లు మందు తాగి వెళ్లారు అంతే: పోలీసులు

హైదరాబాద్లోని జ‌న‌సేన అధినేత పవన్ క‌ళ్యాణ్‌ ఇంటి వద్ద రెక్కీ నిర్వ‌హించార‌నే సంచ‌ల‌న‌ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ, దాడి కుట్ర ఏమీ జరగలేదని పోలీసులు తెలిపారు. నిందితులను ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణగా పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ, …

Read More »

తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడిగా కాసాని.. బీసీల కోస‌మేనా?

తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులును పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో కాసానిని కొత్త అధ్యక్షుడిగా నియమించారు. బక్కని నర్సింహులును జాతీయ కార్యదర్శిగా నియమించారు. మరోవైపు ఈ నెల 10న కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవలే తెలుగుదేశం పార్టీలో …

Read More »

జనసేన మీటింగ్‌కు స్థలం ఇచ్చారని..

రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అవతలి పార్టీ వాళ్లను అధికార పార్టీ, ప్రభుత్వం టార్గెట్ చేయడం కొత్తేమీ కాదు. కానీ ప్రభుత్వం మారినపుడు కొన్ని రోజులు ఇలాంటి వాటి మీద దృష్టిపెట్టి.. ఆ తర్వాత పరిపాలన మీద దృష్టిసారిస్తుంటాయి ప్రభుత్వాలు. కానీ అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్ష పార్టీలను, తమకు కంటగింపుగా మారిన వారిని వేధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చూస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన …

Read More »

బాదుడే బాదుడు: చంద్ర‌బాబు కాన్వాయ్‌ ను బాదేశారు

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోలో రాళ్ల దాడి జ‌రిగింది. చంద్రబాబు కాన్వాయ్‌పై ఓ దుండగుడు రాయి విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు, చీఫ్ సెక్యూరిటీ అధికారి మధు గాయపడ్డారు. రాయి విసిరిన సమయంలో విద్యుత్ సరఫరా నిలివేశారు. పోలీసుల భద్రతా వైఫల్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు చంద్రబాబు …

Read More »

క‌డ‌ప‌లో ప‌రిస్థితి మారేలా ఉందే జగన్ అన్నా

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో రాజ‌కీయ ప‌రిస్థితులు మారేలా ఉన్నాయ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాను రెండుగా విభ‌జిస్తూ.. చేసిన నిర్ణ‌యం ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌లేద‌నే విష‌యం తెలిసిందే. రాజంపేట కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లాను ఏర్పాటు చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. అయితే, రాయ‌చోటి కేంద్రంగానే ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అప్ప‌ట్లో దీనిపై పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల నుంచి ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. కానీ, ప్ర‌భుత్వం …

Read More »

ప్రతిపక్ష నేతల్ని హీరోలను చేయడమే పనా?

అదేమిటో ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏది ముట్టుకున్నా మసైపోతోంది. ప్రతి ఇష్యూలోనూ జగన్ సర్కారుకు ఎదురు దెబ్బ తప్పట్లేదు. అనాలోచిత నిర్ణయాలతో కోరి వివాదాలను కొని తెచ్చుకోవడం ముదు నుంచి ఉంది కానీ.. ఈ మధ్య ప్రతి నిర్ణయం బూమరాంగ్ అయి ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుండడం, ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుండటం గమనించవచ్చు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనను అనవసరంగా వివాదాస్పదంగా మార్చడం, పోలీసుల ఓవరాక్షన్ కారణంగా జనసేనాని హీరో …

Read More »

ప‌వ‌న్‌కు ప్ర‌జారాజ్యం అండ‌.. క‌లిసి వ‌చ్చేనా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు పెద్ద ద‌న్నే దొరికిన‌ట్టు అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీకి కేడ‌ర్ లేదు. నాయ‌కులు లేరు.. అంటూ.. పెద్ద ఎత్తున జ‌న‌సేన‌లో ఒక చ‌ర్చ అయితే జ‌రిగింది. దీనికి పార్టీ అధినేత‌గా ప‌వ‌న్ నుంచి ఎలాంటి ఆన్స‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. కానీ, తాజాగా మారిన‌ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌న‌సేన‌కు ఒక కీల‌క‌మైన మైలు రాయి వంటి మైలేజీ ల‌భిస్తోంది. గ‌తంలో మెగాస్టార్ ప్రారంభించిన ప్ర‌జారాజ్యం పార్టీలో …

Read More »

షర్మిళపై జగన్ చిందులు?

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. ఆయన సోదరి షర్మిళకు తీవ్ర విభేదాలు నెలకొన్నాయని, ఆయన్నుంచి ఆమె వేరు పడుతున్నారని.. తెలంగాణలో కొత్తగా పార్టీ పెడుతన్నారని కొన్నేళ్ల కిందట ఆంధ్రజ్యోతిలో ఒక భారీ కథనం వస్తే చాలామందికి అది సిల్లీ విషయంలా అనిపించింది. జగన్ జైల్లో ఉన్నపుడు పార్టీని నిలబెట్టడానికి 2 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిళతో ఆయనకు ఎందుకు విభేదాలు వస్తాయని ఆశ్చర్యపోయారు. …

Read More »

జగన్ ని నమ్ముకున్నారు .. పనైపోయింది

పదవుల పంపకానికి సంబంధించి జోరు పెంచేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తి అయినప్పటికీ.. ఇప్పటికి తనకు వీర విధేయులుగా వ్యవహరిస్తూ.. తనకు మద్దతుగా గళం విప్పేందుకు ఏ మాత్రం వెనుకాడని పలువురికి ఆయన పదవులు ఇవ్వలేదన్న మాట వినిపిస్తూ ఉండటం తెలిసిందే. ఈ వాదనలకు చెక్ పెట్టే దిశగా జగన్ నిర్ణయాలు ఉండటం గమనార్హం. రెండు మూడు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ …

Read More »

10 ఉంగరాలతో పాల్ పరుగో పరుగు..

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ వేడి పుట్టించిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంచి పట్టున్న ఈ ప్రాంతంలో పాగా వేసేందుకు అధికార పార్టీ గట్టి ప్రయత్నాలు చేసింది. ఇక, కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మునుగోడులో సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని ఆ పార్టీ విశ్వప్రయత్నమే చేసింది. దీంతో, మునుగోడులో త్రిముఖ పోరు చలికాలంలోనూ హీట్ పుట్టించింది. ఇలా రాజకీయ వేడితో సెగుల పుట్టిస్తున్న …

Read More »