తెలంగాణలో రైతు రుణ మాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయిన సంగతి తెలిసిందే. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఉంటుందని, ఈ నెల 18 లోపు లక్ష రూపాయలలోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎల్లుండి సాయంత్రానికల్లా రైతులు ఖాతాలలో డబ్బులు జమవుతాయని రేవంత్ అన్నారు. అయితే, రుణమాఫీకి రేషన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిన పనిలేదని, రైతు పట్టాదారు పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ …
Read More »పసికందుల పై పాశవికాలు.. ఏపీకి ఏమైంది?
ఏపీలో ఏం జరిగిందో ఏమో.. వరుసగా జరుగుతున్న అత్యంత దారుణ ఘటనలు సగటు వ్యక్తులను నివ్వెర పోయేలా చేస్తున్నా యి. కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నాలుగు కూడా.. పసికందులపైనే కావడం గమనార్హం. వీటిలో ఒక ఘటన ఐదు రోజుల చిన్నారిపై జరగ్గా.. మరో రెండు ఘటనలు కూడా 8 ఏళ్ల ముక్కుపచ్చలారని చిన్నారులపై చోటు చేసుకున్నాయి. ఆయా …
Read More »22 నుంచి అసెంబ్లీ.. జగన్పై కేబినెట్లో చర్చ!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు తాజాగా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ దఫా వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశ పెట్ట నున్నారు. వైసీపీ హయాంలో జూలై నెల ఆఖరు వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జట్ను ప్రవేశ పెట్టారు. ఈ గడువు ఈ నెల 31తో ముగియనుంది. దీంతో వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్ను …
Read More »టీడీపీలో కొత్త సంప్రదాయం.. తెలిస్తే..ఆశ్చర్యం ఖాయం!
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గడిచిన నెల రోజుల పాలనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు.. సమీక్షించారు. పాలనలో అనుసరించాల్సిన పద్ధతులను.. ఇప్పటి వరకు సాగించిన పాలనను కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఎక్కువమంది ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తే.. బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. …
Read More »విద్యుత్ కమిషన్ రద్దుకు సుప్రీం నో
విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ అవకతవకలపై విచారణ జరిపేందుకు ఓ కమిషన్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ విద్యుత్ విచారణ కమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డిని నియమించింది. అయితే, ఆ విచారణ పూర్తికాకముందే నరసింహారెడ్డి మీడియా ముందుకు వచ్చి …
Read More »మీడియాతో తల గోక్కున్న సాయిరెడ్డి
కొన్ని ఆరోపణలు వచ్చినపుడు, వివాదాలు తలెత్తినపుడు రాజకీయ నాయకులకు మౌనమే సరైన పరిష్కారం. లేదంటే తూతూ మంత్రంగా ఖండించి వదిలేయడం కూడా మంచి ఆప్షనే. అలా కాదని.. సై అంటే సై అంటూ మీడియా ముందుకెళ్లి సవాళ్లు విసిరితే మొదటికే మోసం వస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు ఇలాగే తయారైంది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషననర్గా పని చేసి సస్పెండైన శాంతి …
Read More »వైఎస్ పై ఉన్న అభిమానంతో ఓర్చుకున్నా
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా బాంబు పేల్చారు. గత రెండు రోజులుగా ఆయన మీడియా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంగళవారం కూడా.. మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తాను అనేక ఇబ్బందులు పడ్డానని చెప్పారు. సొంత పార్టీ నాయకులే.. తనను, తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా …
Read More »ఏపీలో ఫ్రీ బస్ పథకం డేట్ ఫిక్స్
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉచిత పెన్షన్ వంటి కొన్ని హామీలను ఆల్రెడీ సీఎం చంద్రబాబు అమలు చేశారు. తల్లికి వందనం పథకం పై కూడా విధివిధానాలు రూపొందుతున్నాయి. అయితే, ఏపీలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుపై మాత్రం ఇంకా ఎటువంటి …
Read More »పవన్.. ఒక నిశ్చలం.. మరో నిర్భయం !
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఒక నిశ్చలం-ఒక నిర్భయం అన్న సూత్రంతో ముందుకు సాగుతున్నారు. తను తీసుకునే నిర్ణయాలను నిర్భయంగా ఆయన వెల్లడిస్తున్నారు. అదేవి ధంగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నాయకుల మధ్య పోరు జరుగుతున్నప్పటికీ చాలా నిశ్చలంగా నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది భవిష్యత్తులో పార్టీ పునాదులను బలోపేతం చేయడానికి అనుసరిస్తున్న విధానమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఒక పార్టీ …
Read More »ఆ రికార్డు జనసేనకే దక్కింది !
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలోనే అధికంగా గాజువాక శాసనసభ స్థానం నుండి 95,235 ఓట్ల అత్యధిక మెజారిటీతో టీడీపీ తరపున పల్లా శ్రీనివాసరావు విజయం సాధించాడు. మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవడంతో ఆయనకు ఏపీ టీడీపీ అధ్యక్ష్య పదవిని కట్టబెట్టారు. అయితే పల్లా శ్రీనివాసరావు అత్యధిక మెజారిటీ సాధించినా నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓట్లు సాధించి జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అగ్రస్థానంలో నిలిచినట్లు ఏడీఆర్ విశ్లేషణలో …
Read More »ఫైనాన్షియల్ వైట్ పేపర్.. చంద్రబాబు మంచి నిర్ణయం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… గత వైసీపీ ప్రభుత్వంపై శ్వేత పత్రాల రూపంలో ప్రత్యేక వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పోలవరం, అమరావతి, విద్యుత్ రంగం విషయాల్లో గత ప్రభుత్వం చేసిన లోటుపాట్లను అక్రమాలను వశదీకరిస్తూ ఆయన శ్వేత పత్రాలు విడుదల చేశారు. ఈ క్రమంలో ముందుగానే ప్రకటించిన ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సి ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థపై శ్వేత పత్రాన్ని పక్కనపెట్టిన చంద్రబాబు అనూహ్యంగా …
Read More »జగన్ను బూతులు తిట్టిన విజయసాయిరెడ్డి!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నంబర్-2 నాయకుడిగా ఒకప్పుడు ఎంతో వైభవం చూశారు విజయసాయిరెడ్డి. జగన్కు నమ్మిన బంటుగా ఆయనకు పార్టీలో ఎక్కడ లేని ప్రాధాన్యం దక్కేది. కానీ గత రెండు మూడేళ్లలోపరిస్థితులు మారిపోయాయి. వైసీపీ అధికారంలో ఉండగా చాలా వరకు సజ్జల రామకృష్ణారెడ్డిదే ఆ పార్టీలో హవా. ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్న విజయసాయికి వైసీపీ నుంచి ఏమాత్రం సపోర్ట్ దక్కుతున్న పరిస్థితి కనిపించడం లేదు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates