వైసీపీలో కుమ్ములాటలు.. ఆత్మ స్థయిర్యం కోల్పోతున్న వైనం స్పష్టంగా తెరమీదికి వచ్చింది. ఎక్కడికక్కడ నాయకులు తమకు టికెట్ వస్తుందో రాదో అనే భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో వారు.. ఎవరికివారే మౌనంగా ఉంటున్నారు. ఇది.. ఏకంగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంపై ప్రభావం చూపించిందని అంటున్నారు పరిశీలకులు. శనివారం(జూలై 8) వైఎస్ జయంతి. కానీ, ఎక్కడా ఆ జోష్ కనిపించడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లపాటు వైఎస్ …
Read More »ఐప్యాక్ మీద నమ్మకంలేదా ?
తొందరలోనే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంఎల్ఏల పనితీరుపై ఐప్యాక్ విస్తృతంగా సర్వేల మీద సర్వేలు నిర్వహిస్తోంది. ఐప్యాక్ బృందం తయారుచేసిన సర్వే రిపోర్టుపై జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఎంఎల్ఏల మీద ఉన్న ప్లస్సులు, మైనస్సులతో పాటు జనాల్లో ఉన్న అభిప్రాయాలు, వ్యతిరేకత తదితర అంశాలపైన కూడా ఐప్యాక్ బృందం క్లారిటితో రిపోర్టు సబ్మిట్ చేసినట్లు సమాచారం. అందుకనే జగన్ కూడా అంత సుదీర్ఘంగా సమీక్షలు …
Read More »టార్గెట్ @ 47 సీట్లు
ఎన్నికల వేడి పెరిగిపోతున్న కొద్ది వివిధ సామాజికవర్గాలు ఎక్కువ టికెట్లు సాధించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీలో ఇపుడీ విషయమే హాట్ టాపిక్కుగా మారింది. కాంగ్రెస్ లోని బీసీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో మాజీ ఎంపీ వీ హనుమంతరావు తదితరులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీసీల జనాభా ఆధారంగా సముచితమైన స్ధానాలు కేటాయించాల్సిందే అని తీర్మానించారు. వీలైనన్ని ఎక్కువ టికెట్లు …
Read More »సిట్టింగులతోనే సమస్యా ?
ఒకపుడు ఎంఎల్ఏలకు నియోజకవర్గాలను రాసిచ్చేయటమే ఇపుడు కేసీయార్ కు తలనొప్పులుగా తయారైంది. దాదాపు తొమ్మిదేళ్ళపాటు నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలదే రాజ్యమైపోయింది. ఒకవిధంగా నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు రాజులుగా చెలామణి అయిపోతున్నారు. నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు ఏమిచేసినా కేసీయార్ పిలిచి ప్రశ్నించింది లేదు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా కనీసం కేసీయార్ పట్టించుకోలేదు. దాంతో ఏమైందంటే తమకు కేసీయార్ పూర్తిస్ధాయిలో స్వేచ్చ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఆకశమేహద్దుగా చెలరేగిపోయారు. దాని ఫలితం ఏమైందంటే భూకబ్జాలు, అవినీతి, …
Read More »వైసీపీ ట్రాప్‌లో పడకపోయి ఉంటే.. !
ప్రత్యర్థి పార్టీలు వేసే ట్రాప్‌లో చిక్కుకుంటే.. ఏం జరుగుతుందో ఇప్పుడు టీడీపీకి తెలిసి వస్తోందని అంటున్నారు జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకులు. 2018-19 మధ్య కాలంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ప్రత్యేక హోదా అస్త్రాన్ని తెరమీదికి తెచ్చింది. ప్రజల్లో భావావేశాన్ని రగిలించింది. అప్పటి అధికార పార్టీ టీడీపీ ప్రత్యేక హోదాను వదిలేసిందని.. తాము అధికారంలోకి రాగానే హోదాను సాధిస్తామని తేల్చి చెప్పింది. అయితే.. అప్పటికే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్న టీడీపీ …
Read More »ఒక్క శాతం ఓట్ల కోసం నాలుగు పార్టీల కుస్తీ..!
రాష్ట్రంలో ఒక్కశాతం ఓట్ల కోసం.. నాలుగు పార్టీలు కుస్తీపడుతున్నాయని సర్వేలు చాటి చెబుతున్నాయి. పార్టీలకు అతీతంగా చేస్తున్న సర్వేల్లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేనలకు సుమారు 98.2 శాతం వరకు ఓట్లు షేర్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అది ఓటర్లు వచ్చే దానిని బట్టి ఆధారపడుతుందని లెక్కలు వేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల సమయానికి ఓటర్లు పోటెత్తినా.. ఈ లెక్కలో పెద్దగా తేడా ఉండేది లేదని …
Read More »చాపకింద నీరులా.. కేశినేని వ్యవహారం..
ఎన్నికలకు సమయం చాలా దగ్గరగా ఉంది. షెడ్యూల్ ప్రకారం జరిగితేనే 9 నెలలు ఉన్నాయి. కానీ, ముంద స్తు ముచ్చటకు ఇష్టపడుతున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ సమయం మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. తమ్ముళ్లను సెట్ చేస్తు న్నారు. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల పరిస్థితి ఆయనకు కొరుకుడు పడడం లేదు. ఉదాహరణకు మైలవరం, తిరువూరు, నందిగామ, విజయవాడ …
Read More »నందిగామ వైసీపీలో లెక్కలు మారుతున్నాయిగా..!
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో వైసీపీ అసంతృప్తులు రోడ్డున పడుతున్నాయి. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు వైఖరిని నిరసిస్తూ.. నందిగామ నియోజకవర్గంలోని కీలకమైన కంచిక చర్ల మండలంలో పదుల సంఖ్యలో కీలక నాయకులు పార్టీని వదిలేశారు. వీరిలో పరిటాల శివారు నెక్కలంపేటకు చెందిన సీనియర్ నాయకుడు, ఏంఎసీ మాజీ వైస్ చైర్మన్ మాగంటి వెంకట రామారావు, పీఏసీఎస్ చైర్మన్ నెమలపురి అమ్మారావు, మాజీ చైర్మన్ గుదే ప్రసాద్ సహా పదుల సంఖ్యలో …
Read More »ఐప్యాక్ బృందంతో జగన్ భేటీ.. ముందస్తుపైనేనా?!
వైసీపీ అధినేత, సీఎం జగన్ అనూహ్యంగా ఐప్యాక్ బృందంతో భేటీ అయ్యారు. సాధారణంగా ఆయన నెలకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి భేటీ నిర్వహిస్తున్నారు. ఈ నెలలో 1వ తారీకు ఒకసారి ఐప్యాక్ బృందంతో భేటీ అయ్యారు. అయితే.. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత..కేవలం రెండురోజుల వ్యవధిలోనే మరోసారి ఆయన ఐప్యాక్ బృందంతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 …
Read More »షర్మిల షాకింగ్ డెసిషన్.. తన పేరిట భూములను ఏం చేశారంటే..
వైసీపీ అధినేత సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. వెంటనే అమలు కూడా చేసేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రాజకీయంగా కూడా ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. శనివారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి కడపకు వచ్చిన షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి కూడా ఉన్నారు. …
Read More »కడపలో ఈ సారి మామూలుగా ఉండదా..!
కడప జిల్లా రాజకీయాలు మారుతున్నాయా? టీడీపీ, వైసీపీ నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తపిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ఎట్టి పరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలని శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కొందరు సీనియర్ నాయకులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే.. వారికి పదవులు ఇచ్చే విషయంలోనే చర్చసాగుతోంది. ఈ చర్చలు కొలిక్కి వస్తే..డీఎల్ రవీంద్రారెడ్డి వంటి …
Read More »పవన్ ఇప్పుడు బేరాల్లో ఉన్నాడు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. వారాహి యాత్రపై ఆయన మాట్లాడుతూ.. తొలి విడత ప్యాకేజీ డబ్బులు అయిపోవడంతో పవన్ యాత్రను అర్ధంతరంగా ముగించేశాడని వ్యాఖ్యానించారు. వాస్తవానికి రెండు జిల్లాల్లోనూ పూర్తవుతుందని.. పేర్కొంటూ ముందు జనసేన షెడ్యూల్ ఇచ్చిందని.. కానీ, దీనిని మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ వెళ్లిపోయాడని చెప్పారు. దీనికి కారణం.. ప్యాకేజీ సొమ్ము పూర్తిగా …
Read More »