ఒకవైపు మహిళా సెంటిమెంటు.. మరోవైపు చెల్లి సెంటిమెంటు.. వెరసి.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మి లకు సెంటిమెంటు రాజకీయం బాగా కలిసి వస్తోంది. సహజంగానే పత్రికలు, మీడియా కూడా.. మహిళ లకు వ్యతిరేకంగా నిలిచే పరిస్థితి లేదు. అందుకేనేమో.. జగన్‌ను వ్యతిరేకించే మీడియానే కాదు.. జగన్‌ను తరచుగా సమర్థించే.. మీడియా కూడా షర్మిలను చాలా సున్నితంగా డీల్ చేస్తున్నారు. ఎక్కడా ఆమెపై పరుషంగా వార్తలు రాయడం కానీ.. కామెంట్లు చేయడం కానీ.. చేయడం లేదు.
తాజాగా వెలుగు చూసిన ఆస్తుల వివాదంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అనుకూల మీడియాలు ఎలానూ సమర్థిస్తాయి. అయితే.. తటస్థ మీడియాలు కూడా.. జగన్‌ను సమర్థించడం గమనార్హం. ఇక, ఎప్పుడూ వ్యతిరేకించే బలమైన మీడియా ఎలానూ వ్యతిరేకిస్తుంది. మంచి చేసినా.. చెడు చేసినా.. వ్యతిరేకం ఖాయం. కాబట్టి.. ఇప్పుడు తటస్థ మీడియాపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. ఈ విషయంలో తటస్థ మీడియా జగన్‌పై సానుభూతి చూపిస్తోంది.
ఎందుకంటే.. నిజంగానే సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను విజయమ్మ కనుక షర్మిలకు బదలాయిస్తే.. ఆ ఉచ్చు .. జగన్‌కు చుట్టుకుంటుంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే జగన్ ఆస్తులు.. వ్యాపారాలు అన్నీ కూడా.. ఈడీ, సీఐబీ స్వాధీనంలో ఉన్నాయి. వీటిని నిర్వహించుకునే హక్కు మాత్రమే జగన్‌కు, భారతికి కూడా ఉంది. వాటిని బదలాయించడం.. అమ్మడం.. కొనడం వంటివి చేసే హక్కు లేదు. ఈ నేపథ్యంలో జగన్ చెబుతున్నట్టు 48 షేర్లను షర్మిలకు బదలాయిస్తే.. జగన్‌కు ఉన్న బెయిల్ రద్దు చేయమని ఈడీ కోరే అవకాశం ఉంది.
దీంతోనే జగన్ చాలా వ్యూహాత్మకంగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిని విష యం తెలిసిన వారు ఎవరూ తప్పుబట్టరు. కానీ, అటు వైపు చూస్తే.. మహిళ, పైగా జగన్‌కు సొంత చెల్లి కావడంతో ఎవరూ సాహసం చేసి.. ఆమెపై వార్తలు రాయలేని పరిస్థితి వచ్చింది. తటస్థులు కూడా ఈ విషయంలో మౌనంగా నే ఉంటూ.. సున్నితంగానే స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవం ఏంటనేది జగన్ చెప్పుకోవాలి. లేదా.. వెనక్కి తగ్గాలి. లేకపోతే.. డ్యామేజీ ఆయనకు కోర్టు రూపంలో ఎలా ఉన్నా.. ప్రజాకోర్టులో మాత్రం భారీగానే ఉంటుందన్నది విశ్లేషకుల మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates